ప్రపంచపు నాన్ స్టాప్ విమానం ఇదే

Written By:

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత దూరం ప్రయాణించే రైళ్ల గురించి ఇది వరకే తెలుసుకున్నారు కదా... అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నాన్ స్టాప్‌గా అత్యంత దూరం ప్రయాణించే విమానం గురించి తెలుసుకుందాం రండి.

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఎయిర్ లైన్స్ క్వాంటాస్ తెలిపిన సమాచారం మేరకు, తాము ప్రారంభించిన ఆస్ట్రేలియా - లండన్ విమాన సర్వీస్ ప్రపంచ వ్యాప్తంగా నాన్ స్టాప్‌గా అత్యంత దూరం ప్రయాణించే విమాన సర్వీస్‌ అని వెల్లడించింది.

క్వాంటాస్ ప్రారంభించిన ఈ అత్యంత దూరం పాటు నాన్ స్టాప్ గా ప్రయాణించే విమానం ప్రయాణ సమయం 17 గంటల 30 నిమిషాలుగా ఉన్నట్లు తెలిసింది.

క్వాంటాస్ ఎయిర్ లైన్స్ ప్రారంభించే విమాన సర్వీస్ ఆస్ట్రేలియాలోని పెర్త్ నుండి లండన్ మధ్య గల 8,989 మైళ్లు ప్రయాణిస్తుంది.

క్వాంటాస్ ఎయిర్ లైన్స్ ఈ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత దూరం ప్రయాణించే విమాన సర్వీస్ కోసం బోయింగ్ వారి 787 డ్రీమ్ లైనర్ విమానాన్ని వినియోగించుకోనుంది.

గతంలో ఇదే రికార్డ్ గతంలో ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ అందించే దుబాయ్ నుండి అక్లాండ్ మరియు న్యూజిలాండ్ మీద ఉండేది. ఈ మార్గం మధ్య దూరం 8,823 మైళ్లు మరియు ప్రయాణ సమయం 16 గంటలా 35 నిమిషాలుగా ఉండేది.

ఈ సర్వీస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరో సంవత్సర సమయం పట్టనుంది. ప్రస్కుతం ఆస్ట్రేలియాలోని పెర్త్ ను అంతర్జాతీయ విమానాశ్రయ హబ్‌గా అభివృద్ది చేస్తున్నారు. దీనిని దక్షిణ పసిఫిక్ మరియు యూరప్‌లను కలపనుంది.

ఇప్పుడు విమానయాణ రంగం పూర్తిగా అభివృద్ది చెందడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ట్రావెల్ టైమ్ చాలా తగ్గిపోయింది. అయితే 1930 ల కాలంలో అత్యంత పొడవైన విమాన ప్రయాణ లండన్ నుండి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ మార్గంలో ఉండేది.

ఈ రెండు మార్గాల మధ్య ప్రయాణ సమయం 11 రోజులుగా ఉండేది. మరియు ఇందులో 12 షెడ్యూల్డ్ ష్టాప్‌లు ఉండేవి.

ప్రస్తుతం క్వాంటాస్ ఎయిర్ లైన్స్ ప్రారంభించిన పెర్త్ - లండన్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత దూరం ప్రయాణించే నాన్ స్టాప్ విమాన సర్వీసుకు చెందిన ప్రయాణ టికెట్లను 2017 ఏప్రిల్ నుండి ప్రారంభించనున్నారు.

Story first published: Tuesday, December 13, 2016, 14:53 [IST]
English summary
New 17.5-Hour Flight From Australia to London Will Be The Longest In The World
Please Wait while comments are loading...

Latest Photos