ఒకే వ్యక్తికి చెందిన సుమారుగా 700 కార్లు వేలానికి

ఆటోమోటివ్ చరిత్రలో బహుశా అతి పెద్ద వేలం ఇదే అని చెప్పవచ్చు. 700 కు పైబడి వాహనాలున్న ఈ గ్యారేజీలో స్టుడ్‌బ్రేకర్లు, మైక్రో కార్లు, మోటార్ సైకిళ్లు మరియు విభిన్నమైన ట్రాక్టర్లు ఉన్నాయి.

Written By:

ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 700 వాహనాలు. ఇవన్నీ ఏ గ్యారేజీలో ఉన్న వాహనాలు అనుకునేరు. అన్ని కూడా ఒకే వ్యక్తికి చెందిన వాహనాలు. కార్లు, మైక్రో కార్లు, బైకులు మరియు అనేక ట్రాక్టర్లు ఈ గ్యారేజిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు వీటిని వేలం వేయనున్నట్లు దీని యాజమాని ప్రకటించాడు. ఒక వ్యక్తి ఇన్ని వాహనాలను ఎలా సంపాదించాడు...? ఇప్పుడు వేలం ఎందుకు వేస్తున్నాడు...? పూర్తి వివరాలు నేటి కథనంలో....

హెన్ రాన్ హాకెన్‌బర్గర్, ఇతనికి వాహనాలు అంటే పిచ్చి ఇష్టం. ఆ ఇష్టమే ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 700 లకు పైబడి వాహనాలకు యజమానిని చేసింది. 15 ఏళ్ల వయసులో ఉన్నపుడు 1948 లో మొదటి స్టుడ్‌బేకర్ కారును కొనుగోలు చేసాడు.

అయితే తనకు 50 ఏళ్ల వయస్సు వచ్చే సమయానికి భారీ సంఖ్యలో ట్రక్కులు, కార్లు, బుల్లి కార్లు, మోటార్ సైకిళ్లకు మరియు అనేక ట్రాక్టర్లకు అధిపతి అవుతాడని ఎప్పుడూ ఊహించి ఉండకపోవచ్చు.

ఇందులో అనేక ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉండటం మరో విశేషం. ఎంత సంపద ఉన్నా తక్కువగానే అనిపిస్తుంది, అందుకే కాబోలు ఇప్పుడు వీటిని వేలం వేయడానికి సిద్దమయ్యాడు.

2017 జూలైలో సుమారుగా మూడు రోజుల పాటు వేలం వేయనున్నట్లు పేర్కొన్నాడు.

హెన్ రాన్ హాకెన్‌బర్గర్, అమెరికాలోని నోర్వాక్ రాష్ట్రంలో ఒహియో అనే ప్రాంతంలో గూడ్స్ డెలివరీ చేసే ఓ ట్రక్కింగ్ కంపెనీకి యజమాని.

ఇతను తరచూ కొత్త వాహనాల మీద ఎప్పుడు దృష్టిసారిస్తూ ఉండేవాడు. నచ్చిన వాటిని వెంటనే కొనుగోలు చేసి అతని గ్యారేజికి తరలిస్తుండే వాడు.

హెన్ రాన్ హాకెన్‌బర్గర్ ఇలాగే కొన్నేళ్ల పాటు నచ్చిన వాహనాలన్నింటినీ కొనుగోలు చేస్తూ వచ్చాడు. తన వాహన శ్రేణిలో వాహనాల సంఖ్య రోజురోజూకీ పెరిగేకొద్దీ ఒక అన్ని వాహనాలను ఒక చోట చేర్చి మ్యూజియమ్‌గా మార్చేయాలని భావించాడు.

ఎప్పటికప్పుడు నూతన వాహనాలను కొనుగోలు చేస్తూ వచ్చేసరికి స్థలం కొరత రావడం, అన్నింటిని ఒక చోట చేర్చడం మరియు నిర్వహణ మీద దృష్టిసారించడంలో విఫలం చెందుతూ వచ్చాడు.

హాకెన్‌బర్గ్ మొదటి సారిగా ఎంతో ప్రేమతో కొనుగోలు చేసిన స్టుడ్‌బేకర్ కారు. దాని మీద ప్రేమ కాస్త 250 స్టుడ్‌బేకర్ కార్లను కొనుగోలు చేసేలా ఉసిగొల్పింది.

హాకెన్‌బర్గ్ కలెక్షన్‌లో డిలోరియన్, కొన్ని సిట్రెయోన్స్, డిఎస్, బోర్గ్‌వార్డ్, టాట్రా మరియు డార్రిన్ వంటి కార్లు ఉన్నాయి. కండలు తిరిగిన ఫోర్డ్ మస్టాంగ్ 65, ప్లే‌మౌత్‌బర్రాకుడా 67 మరియు డోడ్జి చార్జర్ 66 వంటి కార్లు కూడా ఉన్నాయి.

హాకెన్‌బర్గ్ వాండర్‌బ్రిక్ అనే వేలం వేసే సంస్థ సహకారంలో మొత్తం వాహనాలను వేలం వేయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఏడాది జూలైలోని 14, 15, మరియు 16 రోజుల్లో వేలం వేస్తున్నట్లు తెలిపారు.

ఈ వేలంలో వీటన్నింటికి యజమాని అయిన హాకెన్‌బర్గ్ స్వయంగా పాల్గొంటున్నాడు. ఈ వేలం పాటలో గరిష్ట ధరకు చేజిక్కుంచుకునే వారికి మాత్రమే వాహనాలను అందివ్వనున్నట్లు తెలిపాడు.

మీరు కూడా ఈ వేలం పాటలో పాల్గొనాలంటే vanderbrinkauctions అనే పదాన్ని గూగుల్ చేయండి.

హెన్ రాన్ హాకెన్‌బర్గర్ పాత కాలం నాటి కార్ల కలెక్షన్ ....

హెన్ రాన్ హాకెన్‌బర్గర్ పాత కాలం నాటి కార్ల కలెక్షన్ ....

హెన్ రాన్ హాకెన్‌బర్గర్ పాత కాలం నాటి కార్ల కలెక్షన్ ....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Barn Find DeLorean Among 700-Vehicle Collection to be Auctioned
Please Wait while comments are loading...

Latest Photos