ఎమర్జెన్సీ వాహనాలకు మినహాయిస్తే, PM కారైనా... CM కారైనా సైరన్ బుగ్గలు వాడద్దు!

Written By:

ప్రధాన మంత్రి, రాష్ట్రపతి మరియు ఉప రాష్ట్రపతితో, ప్రధాన న్యాయమూర్తితో పాటు లోక్ సభ స్పీకర్ సహా దేశవ్యాప్తంగా ఉన్న అందరి వీఐపీల కార్ల మీద బుగ్గలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మరి అత్యవసర సేవలకు వినియోగించే వాహనాలు మీదున్న బుగ్గ లైట్లు కూడానా అంటే, ఇందుకు ఆ ఎమర్జెన్సీ వాహనాలను మినహాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. అంబులెన్స్, ఫైర్ వెహికల్, పోలీసు మరియు ఆర్మీ వాహనాలు మీదున్న బుగ్గ లైట్లు అలాగే యథావిధిగా కొనసాగుతాయి.

ఈ కొత్త నియమం మే 1, 2017 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి వర్గం పేర్కొంది.

దీని గురించి కేంద్ర రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, ఎమర్జెన్సీ వాహనాలు మినహాయిస్తే దేశవ్యాప్తంగా ఉన్న వీఐపీల కార్ల మీద బుగ్గ లైట్ల నిషేధించే చారిత్రాత్మక చట్టాన్ని తెచ్చినట్లు పేర్కొన్నాడు.

ఈ కొత్త చట్టం భారత దేశపు ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రి వర్గం, ప్రభుత్వాధికారులు, హై కోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులందరికీ వర్తిస్తుంది.

అధికారులు తమ కార్ల మీద బుగ్గ లైట్లను తొలగించాలని ఉత్తర ప్రదేశ్ మరియు పంజాబ్ ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు. దీనిని దేశవ్యాప్తంగా వర్తింపచేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.

అధికారులు తమ స్టేటస్‌కు గుర్తుగా బుగ్గ లైట్లను హాస్యాస్పదంగా వినియోగిస్తున్నారని 2013 లో సుప్రీం కోర్టులు చేసింది. వెంటనే బుగ్గ లైట్లను తొలగించాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.

అయితే తరువాత 2015 లో సుప్రీం మళ్లీ ఇవి హోదా చిహ్నాలను పేర్కొంది. అయితే మొత్తానికి రాష్ట్రపతి నుండి సాధారణ వీఐపీ వరకు అందరు కూడా బుగ్గ లైట్లను తొలగించాలను కోర్టు కూడా ఈ సారి ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Friday, April 21, 2017, 14:58 [IST]
English summary
Read In Telugu To Know About No More Red Beacons Atop Cars For VIPs Effective May 1
Please Wait while comments are loading...

Latest Photos