కార్ ఇన్సూరెన్స్ కోసం స్టార్టర్స్ గైడ్

కారు కొనాలనుకునేది ప్రతిఒక్కరి కల. ప్రస్తుతం సరసమైన ధరకే మార్కెట్లో అనేక రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, కారు కొనగానే సరిపోదు, ఆ కారు సంబంధించి క్రమం తప్పకుండా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో ఇన్సూరెన్స్ రెన్యువల్ కూడా ఒకటి.

కొత్త కార్ అయినా లేదా పాత కారు అయినా సరే, దానికి సరైన ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే, మనం గుండెల మీద చేయి వేసుకొని ధైర్యంగా డ్రైవ్ చేయవచ్చు. కొన్నిసార్లు అనుకోకుండా జరిగే ప్రమాదాల కారణంగా, కారు మరమ్మత్తు అయ్యే ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. అయితే ఈ భారాన్ని తప్పించుకునేందుకు ఓ చక్కటి మార్గం ఉంది. అదే వాహన బీమా యాడ్-ఆన్ కవరేజ్ పాలసీలు.

Most Read Articles
<div class="cfmotor_container" style="width:100%;float:left;"></div> <script type="text/javascript"> (function loadScript(src, callback) { var s, r, t; r = false; s = document.createElement('script'); s.type = 'text/javascript'; s.src = src; s.onload = s.onreadystatechange = function() { console.log( this.readyState ); if ( !r && (!this.readyState || this.readyState == 'complete') ){ r = true;callback(); } }; t = document.getElementsByTagName('script')[0]; t.parentNode.insertBefore(s, t); })('https://www.coverfox.com/static/lp-marketing/tp_widget/cf_loader.js', function() { CF.init('oneindia'); }); </script>

తొలిసారిగా కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేవారు లేదా తమ ప్రస్తుత ఇన్సూరెన్స్‌ను రెన్యువల్ చేసుకోదలచిన వారి కోసం ఈ కథనంలో టాప్ 5 యాడ్-ఆన్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి తెలియజేయటమైనది. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఇంజన్ ప్రొటెక్ట్

ఇంజన్ ప్రొటెక్ట్

సాధారణ కార్ ఇన్సూరెన్స్ పాలసీలలో ఇంజన్ డ్యామేజ్ కవర్ అవ్వదు (యాక్సిడెంట్‌లో ఇంజన్ పూర్తిగా దెబ్బతింటే తప్ప). కానీ మీరు తీసుకునే పాలసీకి ఈ యాడ్-ఆన్ ప్యాకేజ్‌ని చేర్చుకుంటే, వర్షాకాలంలో మీ కారు ఇంజన్‌లోకి నీరు చేరి పాడైపోయినా సరే దాని రిపేరుకుకు అయ్యే ఖర్చును బీమా కంపెనీనే భరిస్తుంది.

ఈ యాడ్-ఆన్ ఖర్చు బేస్ ప్రీమియంలో 10 శాతం కన్నా తక్కువగానే ఉంటుంది.

జీరో డిప్రిసియేషన్/బంపర్ టూ బంపర్

జీరో డిప్రిసియేషన్/బంపర్ టూ బంపర్

సాధారణంగా బీమా కంపెనీలు ప్రతి వాహనంపై ప్రతి ఏటా కొంత విలువను తగ్గిస్తూ ఉంటాయి. ఇలా ఏళ్ళు గడిచే కొద్ది వాహనం ఖరీదుకన్నా తక్కువ మొత్తానికి మాత్రమే కవరేజ్ లభిస్తుంది. అయితే, జీరో డిప్రిసియేషన్ యాడ్ ఆన్ కవరేజ్‌ను తీసుకున్నట్లయితే ఆ తగ్గింపు లేకుండా నష్టానికి పూర్తిగా పరిహారం లభిస్తుంది. ఏదైనా ప్రమాదంలో నష్టపోయిన వాహన విడిభాగాల మరమ్మత్తు/మార్పుకు అయ్యే ఖర్చును పూర్తిగా బీమా కంపెనీయే చెల్లిస్తుంది.

ఈ యాడ్-ఆన్ ఖర్చు బేస్ ప్రీమియంలో 10-15 శాతం వరకూ ఉంటుంది.

24/7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్

24/7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్

కార్లలో ఎప్పుడు ఎలాంటి సమస్య వస్తుందో మనం ముందుగా ఊహించడం కష్టం. దూర ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంజన్‌లోని సాంకేతిక సమస్యల వల్ల వాహనం బ్రేక్ డౌన్ అయితే, ఈ యాడ్-ఆన్ చక్కగా సహకరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలన్నదే నిపుణులు ఫోన్ ద్వారా సూచనలు అందించడం జరుగుతుంది.

ఈ యాడ్-ఆన్‌కి అయ్యే ఖర్చు దాదాపు రూ.500 వరకూ ఉంటుంది.

రిటర్న్ టూ ఇన్వాయిస్/కార్ రీప్లేస్‌మెంట్/ఇన్వాయిస్ కవర్

రిటర్న్ టూ ఇన్వాయిస్/కార్ రీప్లేస్‌మెంట్/ఇన్వాయిస్ కవర్

కొత్త కారును కొనుగోలు చేసిన మొదటి సంవత్సరంలో మాత్రమే ఈ కవరేజ్‌ను ఆఫర్ చేస్తారు. ఆ సంవత్సర కాలంలో కారు పూర్తిగా డ్యామేజ్ అయితే, బీమా కంపెనీ 100 శాతం మొత్తాన్ని ఎలాంటి డిప్రిసియేషన్ (తగ్గింపు) లేకుండా చెల్లించడం జరుగుతుంది. అయితే, కేవలం షోరూమ్ ధరను మాత్రమే బీమా కంపెనీ అందిస్తుంది. డీలర్ చార్జీలు, సుంకాలు ఇందులో కవర్ కావు.

ఈ యాడ్-ఆన్ ఖర్చు బేస్ ప్రీమియంలో 10 శాతం వరకూ ఉంటుంది.

ఎన్‌సిబి ప్రొటెక్షన్

ఎన్‌సిబి ప్రొటెక్షన్

ఏ బీమా పాలసీలో అయినా క్లెయిమ్ చేయకపోయినట్లతే, ప్రతి సంవత్సరం బోనస్ పాయింట్లు జమ అవుతూ వస్తాయి. ఈ విధంగా జమ అయిన వాటినే 'నో క్లెయిమ్ బోనస్'గా వ్యవహరిస్తారు. వీటి ఆధారంగా ఒకేసారి 50 శాతం వరకు కూడా డిస్కౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ గతంలో ఒక్క క్లెయిమ్ చేసినా సరే, ఈ బోనస్ లభించదు. దీనిని నివారించుకోవాలంటే ఎసిబి రిటెన్షన్ కవరేజ్ ఉపయోగపడుతుంది. ఈ ప్రయోజనం పొందితే ఎన్‌సిబి యథాతథంగా ఉంటుంది. ఎప్పుడైనా దాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ యాడ్-ఆన్ ఖర్చు బేస్ ప్రీమియంలో 15 శాతం వరకూ ఉంటుంది.

English summary
Add ons on car insurance policies are basically optional additional coverage you pay for in addition to the basic policy per your individual requirements. Here's a list of 5 important add ons that we help you understand. These can make your coverage more robust and driving your car a hassle free experience.&#13;
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X