ఫ్యూచర్ హెలికాఫ్టర్ ఆవిష్కరించిన బెల్: కృత్రిమ మేధస్సు దీని ప్రత్యేకత!!

Written By:

టెక్సాస్‌లోని డల్లాస్ వేదికగా జరుగుతున్న 2017 హెలీ ఎక్స్ పో లో బెల్ సంస్థ అత్యాధునిక ఫ్యూచర్ హెలికాఫ్టర్‌ను ఆవిష్కరించింది. ఎఫ్‌సిఎక్స్-001 పేరుతో ఆవిష్కరించింన ఇందులో ప్రస్తుతం ఉన్న హెలికాఫ్టర్లన్నింటి తలదన్నే రీతిలో అత్యాధునిక ఫ్యూచర్ ఫీచర్లను మరియు డిజైన్‌ను అందివ్వడం జరిగింది. దీని గురించి మరిన్ని ప్రత్యేకతలు నేటి కథనంలో చూద్దాం రండి...

స్థిరమైన వెయిట్ లెస్ పదార్థాలతో మోల్డింగ్ తరహాలో రోటార్ క్రాఫ్ట్ కాన్సెప్ట్ ఫీచర్‌తో బెల్ సంస్థ ఈ హెలికాఫ్టర్‌ను రూపొందించింది, ఇందులో హైబ్రిడ్ పవర్ సిస్టమ్, కృతిమ మేధస్సు గల కో పైలట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ హెలికాఫ్టర్‌కు ఉన్న రెక్కలు చూశారా... వీటిని మోర్ఫింగ్ రోటార్ బ్లేడ్లు అంటారు. విభిన్న వాతావరణ పరిస్థితుల ఆధారంగా అవసరాన్ని బట్టి వాటంతట అవే రూపాన్ని మార్చుకుని తిరుగుతూ ఉంటాయి, కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా హెలికాఫ్టర్ రెక్కలు చక్కగా పనిచేస్తాయి.

బెల్ హెలికాఫ్టర్ల సంస్థ సిఇఒ మిచ్ స్నిడర్ మాట్లాడుతూ, సరిగ్గా ఆరు నెలల క్రితం ఓ బృందాన్ని ఏర్పాటు చేసాం. ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా ఖచ్చితంగా రావాల్సిన టెక్నాలజీ మీద దృష్టి సారించి, వాటికి అనుగుణంగా నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలో ఈ బృందం నిమగ్నమయ్యందని తెలిపాడు.

కంటికి కనబడే సాంకేతిక మార్పులు మరియు ఖచ్చితమైన, అతి ముఖ్యమైన అత్యాధునిక ఫీచర్లతో నూతన హెలికాఫ్టర్లను మార్కెట్‌కు పరిచయం చేయడంలో బెల్ హెలికాఫ్టర్స్ సంస్థ నిత్యం దృష్టిసారిస్తోంది. తమ ఆవిష్కరణలో ఒకటి ఈ ఎఫ్‌సిఎక్స్-001 హెలీకాఫ్టర్ అని చెప్పుకొచ్చాడు.

నూతనంగా ఆవిష్కరించిన ఇన్నోవేషన్లలో ఇందులో అనేకం ఉన్నాయి. అందులో ఒకటి, టెయిల్ బూమ్ - బెల్ ఆవిష్కరించిన ఫ్యూచర్ హెలికాఫ్టర్‌లో తోక భాగంలో దీనిని గుర్తించవచ్చు. దీని ద్వారా శబ్దాన్ని తగ్గించడం, పనితీరును పెంచడం మరియు యాంటిటార్క్ సిస్టమ్‌కు అనుసంధానం చేయడం ద్వారా భద్రతను పెంపొందించడం జరిగింది.

ఈ హెలికాఫ్టర్‌లోని అడ్వాన్స్‌డ్ థర్మల్ ఇంజన్‌లో హైబ్రిడ్ ప్రొపల్షన్ సిస్టమ్ కలదు. ఇది ప్రధాన ప్రొపల్షన్‌ను నిర్వహించడం, ఎలక్ట్రిక్ మోటార్ నుండి ఉత్పత్తయ్యే పవర్ యాంటిటార్క్ సిస్టమ్‌కు చేరి అత్యుత్తమ కంట్రోల్ మరియు సులభమైన నిర్వహణ సాధ్యమవుతుంది.

ఎలాంటి హెలికాఫ్టర్‌కైనా లిఫ్టింగ్ పవర్ అత్యవసరం. ఇందులో అందించిన మోర్ఫింగ్ రోటార్ బ్లేడ్లు లిఫ్టింగ్ సమయంలో ఆకారాన్ని మార్చుకుని, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లిఫ్టింగ్ పవర్ ఉత్పత్తి చేస్తాయి.

హెలికాఫ్టర్ బాడీ డిజైన్ విశయానికి వస్తే, విజిబులిటి (దృష్టి) ని పెంచేందుకు మరియు పరిస్థితులను అంచనావేసేందుకు వీలుగా ఉండేవిధంగా స్థిరమైన తేలికపాటి మెటీరియల్‌తో ఈ హెలికాఫ్టర్ బాడీని డిజైన్ చేశారు.

బెల్ సంస్థ మాట్లాడుతూ, "ఈ హెలికాప్టర్ మధ్యలో ఎయిర్‌క్రాఫ్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇది ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ సేకరించి, స్టోర్ చేసుకుని మరియు హెలికాఫ్టర్ ఎగరడానికి కావాల్సిన పవర్‌ను బాహ్య వవస్థకు సరఫరా చేస్తుందని" తెలిపింది.

బెల్ ఫ్యూచర్ హెలికాఫ్టర్‌లో సింగల్ పైలట్ సీటు కలదు, కో పైలట్ కోసం కృత్రిమ మేధస్సు గల కంప్యూటర్ వ్యవస్థను అందివ్వడం జరిగింది. దీని గురించి బెల్ మాట్లాడుతూ, భవిష్యత్తులో అన్నీ తానై చూసుకునే పైలట్ రహిత హెలీకాఫ్టర్ కోసం పనిచేస్తున్నట్లు తెలిపింది.

ప్యాసింజర్ క్యాబిన్ విశయానికి వస్తే, ప్రయాణికుల సీటును పూర్తిగా కస్టమైజ్ చేసుకోవచ్చు, అన్ని సీట్లను ముడిపివేసి కార్గో హెలికాఫ్టర్‌గా కూడా మార్చుకోవచ్చు. ఇలా త్వరితగతిన మోడిఫికేషన్ చేసుకునేందుకు మాడ్యులర్ ఫ్లోరింగ్ సిస్టమ్ అందించారు.

లైటింగ్ కోసం విభిన్న రంగుల్లో కాంతిని వెదజల్లే ఎల్‌ఇడి లైట్లను అందించారు. కృత్రిమ కాంతిని కూడా ఈ ఎల్ఇడి లైట్లను ప్రసరిస్తాయి. ప్రయాణికుల కోసం ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా కలదు.

ప్రస్తుతం బెల్ హెలికాఫ్టర్స్ సంస్థ ప్రారంభ దశలో ఉంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసుకుంటూ స్టార్టప్‌గా రాణిస్తోంది. అయితే దిగ్గజ సంస్థలతో కలిసి టెక్నాలజీ అభివృద్ది మరియు ఆవిష్కరణలో తనదైన పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తున్నట్లు బెల్ సిఇఒ మిచ్ స్నిడర్ పేర్కొన్నాడు.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Thursday, March 16, 2017, 13:15 [IST]
English summary
Bell Helicopter Vision For Future
Please Wait while comments are loading...

Latest Photos