ఇండియాలో దాగున్న 25 సుందరమైన రోడ్లు

By N Kumar

భూమి ఎప్పుడు పుట్టిందో ఎవరీకి తెలియదు. ఎంతటి ఖగోళ శాస్త్రవేత్తలు అయినప్పటికీ కొన్ని వందల కోట్ల సంవత్సరాలు లేదా లక్షల కోట్ల సంవత్సరాలు అని చెప్పుకొస్తుంటారు. ఇంత వరకు ఎవరూ కూడా భూమి ఫలానా కాలంలో ఏర్పడింది అని చెప్పలేకపోయారు. అయితే ఏడాదికోసారి వచ్చే ఏప్రిల్ 22 ను మాత్రం ఎర్త్ డే గా జరుపుకుంటాం.

భూమి తాను పుట్టినప్పటి నుండి ప్రతి ఒక్క ప్రాణికి ఎదో విధంగా ఉపయోగపడుతూ వచ్చింది. అయితే ఈ మధ్య గడిచిన గత మూడు నాలుగు దశాబ్దాల నుండి మనుషులతో పాటు యంత్రాలు, వాహనాలకు కూడా ఉపయోగపడుతోంది. మానవుడు సృష్టించిన వాహనాల ద్వారా ప్రపంచంలో ఉన్న ఏ మూలకైనా వెళ్లడానికి భూమి మీద ఎంచక్కా రహదారులు వేసుకున్నాం.

ఆ రహదారుల ద్వారా అత్బుతమైన విహార యాత్రలకు వెళుతున్నాం. భూమాతలో ఒక భాగమైన భరతమాతలో దాగున్న విహారయాత్రలకు అత్బుతమైన 25 అందమైన రహదారులు గురించి క్రింది కథనంలో....

1. మనాలి- లేహ్ హైవే

1. మనాలి- లేహ్ హైవే

మనాలి - లేహ్ మధ్య ఉన్న దూరం దాదాపుగా 479 కిలోమీటర్లు అందులో మూడు నుండి నాలుగు కిలోమీటర్లు సముద్ర మట్టానికి గరిష్ట ఎత్తులో ఉంది. ఈ రహదారిని ఏడాదిలో కేవలం రెండు ఐదు నెలలు మాత్రమే యాత్రికులను అనుమతిస్తారు. అక్టోబర్ మధ్య భాగంలో మరియు వేసవి కాలంలో మాత్రమే. విశ్రాంతి తీసుకుంటూ వెళితే మనాలి మరియు లేహ్ మధ్య గల దూరాన్ని చేరుకోవడానికి రెండు రోజుల సమయం పడుతుంది.

2. ముంబాయ్ - పూనే ఎక్స్‌ప్రెస్ వే

2. ముంబాయ్ - పూనే ఎక్స్‌ప్రెస్ వే

ఇండియాలో ఉత్తమ రోడ్ ట్రిప్‌లలో ఒకటి ముంబాయ్ పూన్ ఎక్స్‌ప్రెస్ వే దాదాపుగా 93 కిలోమీటర్లు విస్తరించి ఉంది. మధ్యలో ఉన్న లోనవాలా మీకు మంచి అనుభూతిని ఇస్తుంది. అంతే కాకుండా టూ వీలర్లలో ఇక్కడకు చేరుకునే వారు ప్రకృతిని దగ్గర నుండి ఎంజాయ్ చేయవచ్చు. చక్కటి ఆహారానికి లోనవాలా మరింత ప్రత్యేకం.

3. విశాఖ పట్నం - అరకు వ్యాలీ

3. విశాఖ పట్నం - అరకు వ్యాలీ

తెలుగు వారికి వైజాగ్ మరియు అరకు వ్యాలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తెలుగు వారి ఊటికీగా పిలవబడే ఈ అరకు వ్యాలీ దాదాపుగా 116 కిలోమీటర్లు పొడవు మేర ఉంది. దీనిని చేరుకునే మార్గంలో బొర్రా గుహలు మరియు తాతిపూడి రిజర్వాయర్ కలదు. దీనిని అక్టోబర్ మరియు మార్చి మధ్యలో సందర్శిస్తే ఎంతో బాగుటుంది.

4. సిమ్లా - మనాలి

4. సిమ్లా - మనాలి

ఉత్తమమైన రోడ్ ట్రిప్‌లలో స్థానం సంపాదించడానికి సిమ్లా మరియు మనాలి మధ్య ఉన్న రోడ్డు అనేక విశేషాలను కలిగి ఉంది. మానసిక ప్రశాంతతని పొందడానికి 250 కిలోమీటర్లు ప్రయాణం మార్గం గల సిమ్లా - మనాలి ట్రిప్ ఎంతో బాగుటుంది.

5. తూర్పు తీరం గుండా చెన్నై - పాండిచ్చేరి

5. తూర్పు తీరం గుండా చెన్నై - పాండిచ్చేరి

చెన్నై నుండి పాండిచ్చేరి మధ్య గల రోడ్డు దాదాపుగా 160 కిలమీటర్ల పొడవు కలదు. దీని దూరాన్న ఛేదించడానికి మూడు గంటల సమయం పడుతుంది. ఈ రెండింటి మధ్యలో మహాబలిపురం (యునెస్కో చేత గుర్తింపు పొందినది), కల్పక్కం (న్యూక్లియర్ ఫెసిలిటి), ఇడైక్కజినాడు( అలంబరా కోట) ముడలైయర్ కుప్పం( బోటింగ్ మరియు నీటితో సాగే ఆటలు) మరక్కణం(ఉప్పు కయ్యలకు ఎంతో ప్రసిద్ది) వంటి వాటిని చూస్తూ వెళ్లవచ్చు.

6. గౌహతి - తవాంగ్

6. గౌహతి - తవాంగ్

అత్భుతమైన కొండ ప్రాంతాల మధ్య సాగే గౌహతి - తవాంగ్ మధ్య ప్రయాణ దూరం దాదాపుగా 520 కిలోమీటర్లు ఉంటుంది. గౌహతి నుండి తవాంగ్‌కు చేరుకోవడానికి పట్టే ప్రయాణ సమయం 10 గంటలు పైనే ఉంటుంది. అధ్యంతం ఉత్కంఠంగా సాగే ఈ ప్రయాణం మార్గంలో అతి తక్కువ స్టాపులు కలవు.

7. పూరి - కోనార్క్

7. పూరి - కోనార్క్

కేవలం 36 కిలోమీటర్లతో గంట సమయం పాటు ప్రయాణం గల ఈ మార్గం గుండా వెళితే వెలకట్టలేని మధురానుభూతులను పొందుతారు. ఒరిస్సా పరిధిలో ఉన్న ఈ మార్గం మీ కెమెరాకు విపరీతమైన పని చెబుతుంది.

8. గ్యాంగ్‌టక్ - నాతు-లా రోడ్డు

8. గ్యాంగ్‌టక్ - నాతు-లా రోడ్డు

గ్యాంగ్‌టక్ నుండి నాతు-లా మధ్య గల రోడ్డు 55 కిలోమీటర్ల మేర కలదు. అందులో గ్యాంగ్‌టక్ నుండి 39 కిలోమీటర్ల ప్రయాణం తరువాత ట్సోమోగ్ సరస్సు వస్తుంది. ఆ ప్రయాణ మార్గానికి మొత్తం ఈ సరస్సే ప్రత్యేకత.

9. బెంగళూరు - బందిపూర్ అడవి

9. బెంగళూరు - బందిపూర్ అడవి

బెంగళూరు నుండి బందిపూర్ మధ్య 235 కిలోమీటర్ల దూరం ఉంది. దాదాపు 5 గంటల పాటు ప్రయాణ సమయం తీసుకుంటుంది. మొత్తం అడవి మార్గం ద్వారా సాగే ఈ దారిలో అక్కడక్కడ పర్యాటకుల కోసం విశ్రాంతి మరియు తినడానికి ప్రత్యేక స్టాళ్లు కలవు, అందులో మెక్ డోనాల్డ్స్ మరియు కేఫ్ కాఫీ డే వంటివి కూడా ఉన్నాయి.

10. సిమ్లా - మనాలి (కిన్నూరు మరియు స్పిటి మీదుగా)

10. సిమ్లా - మనాలి (కిన్నూరు మరియు స్పిటి మీదుగా)

సిమ్లా నుండి మనాలికి కిన్నూరు మరియు స్పిటి మీదుగా వెళ్లే మార్గం ఎంతో అత్భుతంగా ఉంటుంది. ఈ మార్గం గుండా వెళ్లడానికి మూడు ప్రముఖ ప్రాంతాలను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. అందులో రాంపూర్, నాకో, కాజా మరియు స్పిటి మీదుగా మనాలి చేరుకోవచ్చు. ఈ రెండింటి మధ్య ప్రయాణం సుమారుగా 3 నుండి 4 రోజులు సమయం తీసుకుంటుంది. కారణం రోడ్డు అంతగా బాగుండదు.

11. పాంబన్ బ్రిడ్జి (రామేశ్వరం)

11. పాంబన్ బ్రిడ్జి (రామేశ్వరం)

ఇది సముద్రం మీదుగా రామేశ్వరానికి కలుపడి ఉన్న వంతెన. ప్రతి వంతెన మీద ప్రతి ఒక్కరూ ప్రయాణించగలరు. కాని ఈ జాబితాలో ఈ బ్రిడ్జిని చేర్చడానికి కారణం ఇది సముద్రం మీద ఉండటం వలన. 13.5 కిలోమీటర్లు పొడవున్న ఈ వంతెన మీద ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాల వ్యవధిలో ముగించవచ్చు. ఇరువైపులా సముద్రాన్ని మీరు చూడవచ్చు.

12. చెన్నై - మున్నారు

12. చెన్నై - మున్నారు

కాఫీ తోటల మధ్య సాగే చెన్నై - మున్నార్‌ల మధ్య దూరం దాదాపుగా 600 కిలోమీటర్లు ఉంది. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ, ప్రకృతిని అనుభవిస్తూ వెళితే సుమారు 10 గంటల ప్రయాణం సమయం తీసుకుంటుంది.

13. ఢిల్లీ - ఆగ్రా

13. ఢిల్లీ - ఆగ్రా

యమునా ఎక్స్‌ప్రెస్ వే మీదుగా సాగే ఢిల్లీ - ఆగ్రా ప్రయణ మార్గం దాదాపుగా 165 కిలోమీటర్ల మేర ఉంది. మొత్తాన్ని అధిక వేగంతో రెండు లేదా రెండున్నర గంటల సమయంలో చుట్టి రావచ్చు. ఓపికతో వెళితో తాజ్‌మహల్ మరియు ఆగ్రా కోటను కూడా దర్శించిరావచ్చు. అయితే ఈ మార్గంలో ప్రయాణించే ముందు టైర్లను అన్నివిధాలుగా పరీక్షించుకుని వెళ్లాల్సి ఉంటుంది.

14. జైపూర్ - జైసల్మీర్

14. జైపూర్ - జైసల్మీర్

జైపూర్ నుండి జైసల్మీర్ మధ్య సాగే ప్రయాణం మీకు ఎడారి గురించి ఓ ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది. మీకు మరియు మీ వాహనానికి విశ్రాంతి కోసం మధ్యలో జోధ్‌పూర్ మీ కంటపడుతుంది. ఈ రహదారిని రాజస్థాన్ స్టేట్ హై వే 19 అని కూడా పిలుస్తారు.

15. షిల్లాంగ్ - చిరపుంజి

15. షిల్లాంగ్ - చిరపుంజి

షిల్లాంగ్ నుండి చిరపుంజి మీదుగా సాగే 53 కిలోమీటర్ల ప్రయాణ మార్గంలో చిన్నగా పడే తుంటరి వానజల్లులు, జలపాతాలు, గుహలు మరియు అందమైన గ్రామాలు అంతే కాకుండా కారు కిటికీలో నుండి తొంగి చూస్తే ఎన్నో అపురూపమైన దృశ్యాలను మీరు చూడవచ్చు. ఒకటి నుండి రెండు గంటల సమయం పాటు సాగే ప్రయాణంలో ఎటువంటి ట్రాఫిక్ కూడా ఉండదు.

16. ముంబాయ్ - గోవా

16. ముంబాయ్ - గోవా

ఫాదర్ ఆఫ్ ఇండియన్ రోడ్ ట్రిప్స్ గా పిలువబడే ఈ రోడ్డు ప్రయాణం అద్యంతం అనందంగా సాగిపోతుంది. మధ్యలో సూర్యుడు, సముద్ర తీరం మరియు తెల్లగా రోడ్డుకిరువైపులా ఇసుక తిన్నెలు అన్ని కలిసి కొత్త అనుభూతిని ఇస్తాయి. ముంబాయ్ నుండి ఎన్‌హెచ్-17 మీదుగా గోవాకు వెళ్లడానికి 10 గంటల సమయం తీసుకుంటుంది. ఉదయాన్నే ముంబాయ్‌లో ప్రయాణాన్ని ప్రారంభిస్తే సాయంకాలం గోవాలో ప్రారంభమయ్యే పార్టీలకు సులభంగా చేరుకోవచ్చు.

17. ఢిల్లీ - జైపూర్

17. ఢిల్లీ - జైపూర్

దేశీయంగా బాగా మెయింటెనే చేస్తున్న రహదారుల్లో ఇది ఒకటి. రంగులమయంగా ఉండే భారతీయ సాంప్రదాయాన్ని ఈ మార్గం గుండా వెళితే బాగా అర్థం అవుతుంది. ఈ మార్గం మీకు ఎన్నో అత్బుతమైన అనుభూతుల్ని ఇస్తుంది. మధ్యలో అక్కడక్కడ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆహారాన్ని తీసుకుంటూ ముందుకు సాగిపోండి.

18.ముంబాయ్ - మౌంట్ అబు

18.ముంబాయ్ - మౌంట్ అబు

మెట్రో నగరాల్లో ఎసిలు, లిఫ్ట్ ‌లకు అలవాటు పడిపోయి లైఫ్ డల్‌గా మారిపోయిందా ? అయితే మౌంట్‌ అబుకు వెళ్దాం రండి. ముంబాయ్ నుండి వడోదర మరియు అహ్మదాబాద్‌ల మీదుగా మౌంట్ అబుని చేరుకోవచ్చు. దాదాపుగా 12 గంటల సుధీర్ఘ ప్రయాణం తరువాత 745 కిలోమీటర్ల దూరాన్ని చేధించి మౌంట్ అబును చేరుకోవచ్చు.

19. కలకత్తా - డిఘా

19. కలకత్తా - డిఘా

తూర్పు భారతీయుల వీకెండ్ ఫేవరెట్ ట్రిప్ డిఘా మరి ఇది మీకు ఎందు ఫేవరెట్ కాకూడదు. అయితే వెళదాం రండి. కలకత్తా నుండి డిఘా వెళ్లే రహదారి దాదాపుగా 180 కిలోమీటర్ల పొడవు ఉంది. సుమారుగా మూడు గంటల ప్రయాణం తరువాత డిఘాను చేరుకోవచ్చు. ఆ దారి వెంబడి ఫోటోలు తీసుకోవడానికి అత్బుతమైన లోకేషన్లు మంచి ఆహార పదార్థాలు ఉంటాయి. ఈ ట్రిప్ ద్వారా మీరు కంప్లీట్‌గా వీకెండ్‌ను ఎంజాయ్ చేయగలరు.

20. జైపూర్ - ర్యాంథమ్‌బోర్

20. జైపూర్ - ర్యాంథమ్‌బోర్

రాజస్థాన్ స్టేట్ హై వే 24 ను ఎంచుకోండి అందులోని జైపూ, ర్యాంథమ్‌బోర్ మరియు ఈ రెండింటి మధ్య గల ప్రాంతాలను సందర్శించండి. ఈ మార్గంలోని బాసి వన్యప్రాణుల అభయారణ్యాన్ని మీరు తిలకించవచ్చు. 145 కిలోమీటర్లు ఉన్న ఈ రహదారి ప్రయాణాన్ని మూడు గంటల్లో ముగించవచ్చు.

21. ఊటి మీదుగా బెంగళూర్ నుండి గోవా

21. ఊటి మీదుగా బెంగళూర్ నుండి గోవా

బెంగళూర్ నుండి ఊటి మీదుగా గోవా ప్రయాణం అత్భుతంగా ఉంటుంది. మద్యలో మైసూర్‌ను కూడా సందర్శించవచ్చు. ఆ తరువాత ప్రకృతితో స్నేహం చేస్తూ దాదాపుగా 266 కిలోమీటర్ల పాటు ప్రయాణించిన తరువాత గోవాను చేరుకోవచ్చు. మధ్యలో చెన్నపట్నంలో అత్భుతమైన ఆహార పదార్థాలను ఆరగించవచ్చు.

22. డిల్లీ - సిమ్లా

22. డిల్లీ - సిమ్లా

డిల్లీ నుండి సిమ్లాకు రైలు మార్గం ఉన్నప్పట్టికీ అత్భుతమై రోడ్డు మార్గపు ప్రయాణాన్ని ఎవరు వదులుకోరు. కొండలు మరియు లోయలు మధ్యలో మేఘాలు వాటిని తాకుతూ మన ప్రయాణం ఎంతో అత్భుతంగా ఉంటుంది. డిల్లీ నుండి దాదాపుగా 358 కిలోమీటర్ల మేర 6 గంటల 40 నిమిషాల ప్రయణం తరువాత మీరు సిమ్లా చేరుకోవచ్చు. మధ్యోలో సుఖ్‌ధేవ్ డాబా వద్ద మీ కడుపుకు మంచి పార్టీ ఇవ్వండి.

23. బెంగళూరు - గోవా

23. బెంగళూరు - గోవా

ఐటి రంగం బాగా అభివృద్ది చెందిన బెంగళూరులోని సాఫ్ట్ ఇంజనీర్లను కదిలిస్తే, బెంగళూరు నుండి గోవా కు రోడ్డు మార్గం ద్వారా అత్బుతమైన జర్నీ ఉంటుందని సెలవిస్తున్నారు. బెంగళూరు నుండి 566 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవాకు బెంగళూరు నుండి అద్దె కార్లు సైతం ఉన్నాయి.

24. కలకత్తా - పూరి

24. కలకత్తా - పూరి

కలకత్తా మరియు పూరి ల మధ్య ప్రయాణం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఉదయాన్నే కలకత్తా నుండి ప్రయాణం అయితే ఖరగ్‌పూర్, బలసోర్, పిప్లి, కటక్ మరియు భద్రక్ మీదు 580 కిలోమీటర్లు పాటు ప్రయాణం చేసి పూరీ తీరాన గల అత్భుతమైన సూర్యాస్తమయ దృశ్యాన్ని చూడగలరు. ఈ మొత్తం ప్రయాణం దాదాపుగా 10 గంటల సమయం తీసుకుంటుంది.

25. అహ్మదాబాద్ - కచ్

25. అహ్మదాబాద్ - కచ్

అహ్మదాబాద్ నుండి 400 కిలోమీటరల దూరంలో గల కచ్‌ను చేరుకోవడానికి సుమారుగా 11 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే ఈ రెండింటి మధ్య రోడ్డు అంతగా బాగుండదు. అందుకోసం వీలైనంత వరకు ఉదయాన్నే అహ్మదాబాద్ నుండి ప్రయాణాన్ని ప్రారంభించడం ఎంతో ఉత్తమం.

విహార యాత్రలకు అత్భుతమైన 25 ఇండియన్ రోడ్లు
  • ప్రపంచంలో కెల్లా అత్యంత సుందరమైన రైలు మార్గాలు

  • విహార యాత్రలకు అత్భుతమైన 25 ఇండియన్ రోడ్లు
    • దెయ్యాలు తిరిగే టాప్-10 భారతీయ రోడ్లు
    • ఈ రోడ్ల మీదకు వెళితే నరకానికి లేదా స్వర్గానికి టికెట్ గ్యారంటీ

Most Read Articles

English summary
Best Road Trips India In Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X