ఎన్నికల ప్రచారం కోసం భాజాపా హై-టెక్ బస్

By Ravi

మరికొద్ది రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఇప్పటి అన్ని రాజకీయ పార్టీలు సరికొత్త ప్రచారాలకు తెరలేపుతున్నాయి. తమ ఎన్నికల ప్రచారాల కోసం ఆయా నాయకులు ఎన్నుకునే వాహనాలు చాలా విశిష్టంగా ఉంటున్నాయి.

ఇది కూడా చదవండి: నందన్ నీలేకని ఎన్నికల క్యాంపైన్ వెహికల్

ఇప్పుడు ఈ కథనంలో మనం చూడబోయేది భాజాపా (భారతీయ జనతా పార్టీ) ఎన్నికల బస్సు. ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా ఈ క్యాంపైన్ బస్సును డిజైన్ చేయించారు. దీనిని కస్టమైజ్ చేసింది మరెవరో కాదు, ప్రముఖ డిజైన్ హౌస్ డిసి డిజైన్స్.

ఈ కమలనాధుల ఎన్నికల బస్సులోని ఆ విలాసాలేంటో మనం కూడా ఓ లుక్కేసొద్దాం రండి..!

భాజాపా హై-టెక్ బస్

బిజెపి ఎన్నికల ప్రచారం కోసం కస్టమైజ్ చేయించిన ఈ హై-టెక్ బస్సు పేరు 'విజయ భారత రథం'.

భాజాపా హై-టెక్ బస్

ఈ బస్సును కర్ణాటక మాజీ సిఎం, బెంగుళూరు నార్త్ బిజెపి అభ్యర్థి సదానంద గౌడ ఆవిష్కరించారు.

భాజాపా హై-టెక్ బస్

ఈ బస్సును కేవలం బిజిపి ఎన్నికల ప్రచారం కోసం మాత్రమే ఉపయోగించనున్నారు.

భాజాపా హై-టెక్ బస్

విజయ భారత రథంగా పిలిచే ఈ హె-టెక్ బస్సును మాజీ పరిశ్రమల శాఖా మంత్రి మురుగేషన్ నిరానీ బహుకరించారు.

భాజాపా హై-టెక్ బస్

ఈ బస్సును మజ్దా సంస్థ తయారు చేసింది, దీనిని పంజాబ్ నుంచి తెప్పించారు

భాజాపా హై-టెక్ బస్

ప్రముఖ భారతీయ ఆటోమోటివ్ డిజైనర్ దిలీప్ ఛాబ్రియాకు చెందిన డిసి డిజైన్స్ సంస్థ ఈ బస్సును పలు విలాసవంతమైన ఫీచర్లతో కస్టమైజ్ చేసింది. తర్వాతి స్లైడ్‌లో ఆ ఫీచర్ల వివరాలు పరిశీలించండి.

భాజాపా హై-టెక్ బస్

ఈ లగ్జరీ బస్సులో మొత్తం 8 మంది కూర్చోవచ్చు. ప్రచార సమయంలో బస్సు లోనుంచే ప్రజలకు అభివాదం చేసేందుకు గాను ఇందులో ప్రత్యేకంగా హైడ్రాలిక్ లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు.

భాజాపా హై-టెక్ బస్

రోడ్ షో అయిపోయిన తర్వాత, నాయకుల వినోదం కోసం ఇందులో 2 ఎల్‌సిడి టెలివిజనలు, డిష్ టివి సెట్, ఎయిర్ కండిషనింగ్, జనరేటర్, రిఫ్రిజిరేటర్, సిసి టివి, టాయ్‌లెట్, మైక్ సెట్, మీడియ ఇంటర్వూ కోసం ప్రత్యేక విభాగం వంటి అనేక ఫీచర్లున్నాయి.

భాజాపా హై-టెక్ బస్

బిజెపి పార్టీ గుర్తు కమలంలోని రంగులతో ఈ బస్సును డిజైన్ చేశారు. దీనిపై ఈ సారి మోడి సర్కార్ అని రాసి ఉంటుంది.

Most Read Articles

English summary
Former Chief Minister DV Sadananda Gowda today launched a hi tech bus which will be exclusively used for election campaign 
Story first published: Wednesday, April 9, 2014, 15:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X