శాసనసభ భవనం వద్ద అందరినీ ఆకట్టుకున్న ఎమ్ఎల్ఏ లాంబోర్గిని కారు

ఆయనొక శాసన సభ సభ్యుడు, శాసనసభ సమావేశాల సమయంలో, శాసనసభ ప్రాంగణానికి తనకు ఇష్టమైన లాంబోర్గిని సూపర్ కారులో వచ్చాడు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఈ కారు వలన మళ్లీ వార్తొల్లోకెక్కాడు.

Written By:

ఆయనొక శాసన సభ సభ్యుడు, శాసనసభ సమావేశాల సమయంలో, శాసనసభ ప్రాంగణానికి తనకు ఇష్టమైన లాంబోర్గిని సూపర్ కారులో వచ్చాడు. ఆ కారు ఆయనకు సర్వసాధారణం కావచ్చు. కానీ సామాన్యప్రజానీకానికి కాదు కదా...? అందుకే అక్కడున్న వారందరి చూపు ఆ కారు మీద పడింది.

మహారాష్ట్రలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు మిరా-భయేందర్‌కు చెందిన శాసన సభ్యుడు నరేంద్ర మెహ్తా లాంబోర్గిని కారులో విచ్చేశాడు. శాసన సభ జరుగుతున్న సమయంలో బయట పార్క్ చేసి ఉన్న ఆరేంజ్ కలర్ లాంబోర్గిని కారు అందరినీ దృష్టిని ఆకర్షించింది.

గత ఏడాది కూడా ఇలాగే వార్తల్లోకొచ్చింది ఈ కారు. ఈ ఎమ్ఎల్ఏ భార్య దీనిని నడుపుతున్నపుడు నియంత్రణ కోల్పోయి ఆటోను ఢీకొట్టింది. ఈ కారును కొనుగోలు చేసిన రోజే ప్రమాదం చేసింది.

గత ఏడాదిలో నరేంద్ర మోహ్తా తన భార్యకు పుట్టిన రోజు కానుకగా సుమారుగా రూ. 5.5 కోట్ల విలువైన ఈ కారును ఆగష్టులో బహుకరించాడు.

మిరా భయేందర్ అనే ప్రాంతంలో నరేంద్ర మెహ్తా దిగ్గజ రియర్ ఎస్టేట్ వ్యాపార వేత్త మరియు మిరా భయేందర్ ప్రాంతం యొక్క మునిసిపల్ కార్పోరేషన్‌లో మేయర్ కూడా పనిచేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడిగా ఉన్నాడు.

నరేంద్ర మెహ్తా లాంబోర్గిని కారులో శాసన సభకు వచ్చాక, ఆ విషయంలో మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. దీనిని గమనించిన మెహ్తా రాజకీయంగా రచ్చ జరగడం ఖాయం అని భావించి తన కారుతో శాసనసభ భవన ప్రాగణం నుండి వెళ్లిపోయాడు.

నరేంద్ర మెహ్తా శాసన సభకు అత్యంత విలాసవంతైన లాంబోర్గిని కారులో రావడాన్ని జాతీయ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు జిత్తేందర్ అవాద్ తప్పుబట్టాడు.

నరేంద్ర మెహ్తా ఓ దిగ్గజ వ్యాపారవేత్త అనే విషయం అందరికీ తెలుసు. విలాసవంతమైన కార్లు మరియు బంగ్లాలను కలిగి ఉన్న వారికి మేము ఏ మాత్రం వ్యతిరేకం కాదు. కానీ ఆడంభరమైన జీవితం గడిపే వారికి శాసన సభలో చర్చించే సామాన్య ప్రజల సమస్యల గురించి ఏమి అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు.

రాజకీయ రణరంగంలో విమర్శలు సర్వసాధారణ, ఇవన్నీ ప్రక్కనపెట్టి కారు విషయానికి వస్తే, రూ. 5.5 కోట్ల విలువైన లాంబోర్గిని హురాకాన్ కారులో 5.2-లీటర్ల సామర్థ్యం గల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి10 పెట్రోల్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 610బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. ఇది కేవలం 3.2-సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఈ ఎమ్‌ఎల్ఏ భార్య గత ఏడాది ఈ కారును డెలివరీ తీసుకున్న వెంటనే నియంత్రణ కోల్పోయి ఆటో ఢీ కొట్టడాన్ని క్రింది వీడియో ద్వారా వీక్షించగలరు....

WHAT OTHERS ARE READING

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Read now to know about BJP MLA Lamborghini grabs attention at Vidhan Bhawan in telugu
Please Wait while comments are loading...

Latest Photos