బ్లడ్‌హౌండ్ సూపర్‌సోనిక్ కారును ఎలా నడపబోతున్నారు?

By Ravi

బ్లడ్‌హౌండ్ సూపర్‌సోనిక్ కారు గురించి మనం ఇప్పటికే పలు కథనాల్లో తెలుసుకున్నాం. భూమిపై గంటకు 1600 కి.మీ. (1000 మైళ్ల) వేగంతో వెళ్లే 'బ్లడ్‌హౌండ్' (Bloodhound) అనే సూపర్‌సోనిక్ కారును బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు జెట్ ఇంజన్‌తో అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. మరికొద్ది రోజుల్లోనే దీనిని విజయవంతంగా పరీక్షించి, ఎవ్వరూ ఛేదించటానికి సాధ్యం కాని ల్యాండ్ స్పీడ్ రికార్డును ఈ కారుతో సృష్టించనున్నారు.

ఈ నేపథ్యంలో, కారు ఈ వేగాన్ని ఎలా చేరుకుంటుంది, అంత వేగం నుంచి ఎలా నెమ్మది అవుతుంది, దీనిని ఎక్కడ, ఎలా టెస్ట్ చేయనున్నారనే విషయాలను పరిశోధకులు ఓ వీడియో రూపంలో వెల్లడించారు. గంటకు గరిష్టంగా 1600 కి.మీ. పైగా వేగంతో ప్రయాణించే ఈ కారును నడపాలంటే సాధారణ రోడ్లు పనికిరావు. అందుకే ఈ బ్లడ్‌హౌండ్ కారును దక్షిణాఫ్రికాలోని నార్తర్న్ కేప్ ప్రావిన్స్‌లో ఉన్న హాక్‌స్కీన్ పాన్ అనే ఎండిపోయిన సరస్సులో టెస్ట్ చేయనున్నారు.

Bloodhound SSC

అయితే, ఈ సరస్సుకు ఇరు చివర్లలో పెద్ద బండ రాళ్లు ఉంటాయి, వాటి మధ్యలో ఉంటే ఖాలీ ప్రాంతంలో ఈ సూపర్‌సోనిక్ కారును టెస్ట్ చేస్తారు. ఈ ట్రాక్ మొత్తం దూరం 12 మైళ్లు మాత్రమే. ఈ దూరంలో ఐదున్నర మైళ్లను కారును యాక్సిలరేట్ చేసేందుకు ఉపయోగిస్తారు, మిగిలిన ఐదున్నర మైళ్లను కారు వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగిస్తారు. ఈ లెక్కలో ఏ మాత్రం తేడా వచ్చినా కారు వేగం అదుపు కాకుండా పోయి, బండరాళ్లను ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది.

దక్షిణాఫ్రికాలోని నార్తర్న్ కేప్ ప్రావిన్స్‌లో ఉన్న హాక్‌స్కీన్ పాన్ అనే ఎండిపోయిన ఈ సరస్సు గర్భాన్ని రేస్‌ ట్రాక్‌గా మార్చేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కాగా, ఈ కారుకు వెయ్యి మైళ్ల వేగాన్ని సాధ్యం చేయగలిగే మార్గాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటికే తెలుసుకున్నారు. ఈ విషయంపై అధ్యయనం చేసిన స్కాన్సియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు, భూమిపై నడిచే వాహనాలు సురక్షిత స్థితిలో ఇంత వేగాన్ని ఎలా అందుకోగలవోననే అంశాన్ని డీకోడ్ చేశారు.

ఫార్ములా వన్ ఇంజనీరింగ్ పద్ధతులు మరియు వైమానిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్న బ్లడ్‌హౌండ్ సూపర్‌సోనిక్ కారు ఏరోడైనమిక్స్ ద్వారా ఇది సాధ్యమవుతుందని తేల్చారు. ఈ కారు ఏరోడైనమిక్స్ రోడ్డుపై వెళ్లేటప్పుడు వాహనం పక్కకు ఒరిగిపోయే ప్రమాదాన్ని తగ్గించి, ఏరోడైనమిక్ బలాలు నిట్టనిలువుగా ప్రయోగించడం వలన గంటకు 1000 మైళ్ల వేగంలోను ఈ కారుకి స్థిరత్వాన్ని కల్పించవచ్చని పరిశోధకలు చెబుతున్నారు. అదే ఈ విషయాన్ని ఈ వీడియోలో వివరించారు, మీరు కూడా ఆ వీడియోని చూడండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/9kKhR7AA0ZU" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Bloodhound SSC is a purpose built vehicle, driving which British Royal Air Force pilot and current world land speed record holder Andy Green, will attempt to reach 1000 mph (1600 km/h) and in the process break his own record.&#13;
Story first published: Friday, June 6, 2014, 16:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X