బ్లడ్‌హౌండ్ సూపర్ సోనిక్ కారు టెస్టింగ్‌కి కౌంట్‌డౌన్ షురూ..

By Ravi

గంటకు 1600 కిలోమీటర్ల (1000 మైళ్ల) వేగంతో వెళ్లే సూపర్ సోనిక్ కారు (బ్లడ్‌హౌండ్) గురించి మనం ఇప్పటికే పలు కథనాల్లో తెలుసుకున్నాం. బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు జెట్ ఇంజన్‌తో నడిచే 'బ్లడ్‌హౌండ్' (Bloodhound) అనే సూపర్ సోనిక్ కారును అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. కాగా.. ఈ కారును రియల్ వరల్డ్ కండిషన్స్‌లో టెస్ట్ చేసేందుకు దీని రూపకర్తలు కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు.

ఈ కారుకు నవంబర్ 6, 2014వ తేదీ నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో 12 నెలల్లో ఈ కారును టెస్ట్ చేయనున్నారు. గంటకు గరిష్టంగా 1600 కి.మీ. పైగా వేగంతో ప్రయాణించే ఈ కారును నడపాలంటే సాధారణ రోడ్లు పనికిరావు. అందుకే ఈ బ్లడ్‌హౌండ్ కారును దక్షిణాఫ్రికాలోని నార్తర్న్ కేప్ ప్రావిన్స్‌లో ఉన్న హాక్‌స్కీన్ పాన్ అనే ఎండిపోయిన సరస్సులో టెస్ట్ చేయనున్నారు.

ఈ సరస్సుపై కమ్యూనికేషన్ వ్యవస్థను టెస్ట్ చేసేందుకు గాను ఓ ఎల్39 జెట్ విమానాన్ని 50 అడుగుల (15 మీటర్ల) ఎత్తులో 500 నాట్స్ (926 కి.మీ) వేగం వద్ద టెస్ట్ చేశారు. ఈ విమానానికి అపసవ్య దిశలో ఓ జాగ్వార్ ఎక్స్ఎఫ్ సెలూన్ కారును మరియు మరో ఆల్-వీల్ డ్రైవ్ జాగ్వార్ ఎఫ్-టైప్ కూపే కారును అత్యంత వేగంగా నడుపుతూ కమ్యూనికేషన్ సిస్టమ్‌ను చెక్ చేసుకున్నారు. (ఈ టెస్టింగ్ వీడియోని చివర్ స్లైడ్‌లో వీడియో రూపంలో వీక్షించవచ్చు).

బుల్లెట్ కంటే వేగంగా ప్రయాణించే ఈ బ్లడ్‌హౌండ్ సూపర్ సోనిక్ కారు కారుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

బ్లడ్‌హౌండ్ సూపర్ సోనిక్ కారు

తర్వాతి స్లైడ్‌లలో బ్లడ్‌హౌండ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

బ్లడ్‌హౌండ్ ప్రాజెక్ట్

బ్లడ్‌హౌండ్ ప్రాజెక్ట్

బ్లడ్‌హౌండ్ ప్రాజెక్టుకు రిచర్డ్ నోబెల్ సారథ్యం వహిస్తున్నారు, 2008లో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కాగా.. బ్లడ్‌హౌండ్ సూపర్ సోనిక్ కారుకు సంబంధించి ఫుల్ సైజ్ ప్రోటోటైప్‌ను 2012లో ఆవిష్కరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కారులో అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు.

బ్లడ్‌హౌండ్ ప్రాజెక్టులో మన ఇండియన్

బ్లడ్‌హౌండ్ ప్రాజెక్టులో మన ఇండియన్

దక్షిణాఫ్రికాలోని భారతీయ సంతతికి చెందిన 29 ఏళ్ల మహిళ ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే బ్లడ్‌హౌండ్ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించనున్నారు. యూకెలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన నిపులైన ఇంజనీర్ల బృందంలో 'బెవర్లీ సింగ్' కూడా ఒకరు. పోర్ట్ ఎలిజబెత్ నుంచి మెకానికల్ ఇంజనీర్ అయిన బెవర్లీ సింగ్, యూకేలోని బ్రిస్టల్‌కు సమీపంలోని ఓ హైటెక్ కేంద్రంలో నిర్మిస్తున్న 'బ్లడ్‌హౌండ్ సూపర్‌‌సోనిక్ కార్'ను నిర్మిస్తున్న 30 మంది ఇంజనీర్ల బృందంలో ఈమె కూడా తన వంతు సాయం చేయనుంది.

రోల్స్ రాయిస్ సపోర్ట్

రోల్స్ రాయిస్ సపోర్ట్

ఈ బ్లడ్‌హౌండ్ సూపర్‌సోనిక్ కారు ప్రాజెక్టుకు బ్రిటీష్ ఆటో దిగ్గజం రోల్స్ రాయిస్ కూడా తమ వంతు మద్దతు అందిస్తోంది. ఇందులో భాగంగానే, ఈ ప్రాజెక్టుకు కావల్సిన ఇంజన్, ఆర్థిక మరియు సాంకేతిక మద్ధతులను రోల్స్ రాయిస్ అందిస్తోంది.

జెట్ ఇంజన్

జెట్ ఇంజన్

బ్లడ్‌హౌండ్ సూపర్‌సోనిక్ కారులో రోల్స్ రాయిస్ ఈజె200 జెట్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇదే ఇంజన్‌ను యూరోఫైటర్ టైఫూన్ కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఉపయోగించారు.

దక్షిణాఫ్రికాలో టెస్టింగ్

దక్షిణాఫ్రికాలో టెస్టింగ్

గంటకు గరిష్టంగా 1600 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించే ఈ కారును నడపాలంటే సాధారణ రోడ్లు పనికిరావు. అందుకే ఈ బ్లడ్‌హౌండ్ కారును దక్షిణాఫ్రికాలోని నార్తర్న్ కేప్ ప్రావిన్స్‌లో ఉన్న హాక్‌స్కీన్ పాన్ అనే ఎండిపోయిన సరస్సు లోపల మాత్రమే టెస్ట్ చేయనున్నారు.

హాక్‌స్కీన్ పాన్ సరస్సు

హాక్‌స్కీన్ పాన్ సరస్సు

ఈ కారును టెస్టింగ్ చేసేందుకు దక్షిణాఫ్రికాలోని నార్తర్న్ కేప్ ప్రావిన్స్‌లో ఉన్న హాక్‌స్కీన్ పాన్ అనే ఎండిపోయిన ఈ సరస్సు గర్భాన్ని రేస్‌ ట్రాక్‌గా మారుస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

సరస్సు క్లీనింగ్

సరస్సు క్లీనింగ్

బ్లడ్‌హౌండ్ సూపర్‌కారు అంత గరిష్ట వేగంతో వెళ్తుంది కాబట్టి, కారుకు ఏ చిన్న రాయి తగిలినా చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే సుమారు 20 కిలోమీటర్ల పొడవు, 1.5 కిలోమీటర్ల వెడల్పు ఉండేలా ఈ సరస్సు గర్భాన్ని దాదాపు 300 మంది కార్యకర్తలు శుభ్రం చేస్తున్నారు. చిన్నచిన్న రాళ్లను ఏరిపారేస్తున్నారు.

థ్రస్ట్-2 సూపర్‌సోనిక్ కార్

థ్రస్ట్-2 సూపర్‌సోనిక్ కార్

గతంలో రిచర్డ్ నోబెల్ గరిష్టంగా గంటకు 1019 కిలోమీటర్ల వేగంతో నడిచే ‘థ్రస్ట్-2'ను విజయవంతంగా నడిపి చూపించారు.

థ్రస్ట్ సూపర్‌సోనిక్ కార్

థ్రస్ట్ సూపర్‌సోనిక్ కార్

ఆ తరువాత ఈయన ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న థ్రస్ట్ సూపర్‌సోనిక్ కార్ 1997లోనే గంటకు 1228 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ వేగాన్ని కన్నా 30 శాతం ఎక్కువ వేగం (గంటకు సుమారు 1609 కి.మీ.)తో 2016లో ఈ బ్లడ్‌హౌండ్ సూపర్‌సోనిక్ కారుతో రికార్డును నెలకొల్పనున్నారు.

వీడియో

కమ్యూనికేషన్ టెస్టింగ్ వీడియో

Most Read Articles

English summary
Having announced its intention in 2008 to attempt a new land speed world record, the Bloodhound team has now begun its 12-month countdown to the first test runs in South Africa. 
Story first published: Friday, November 7, 2014, 10:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X