బాబ్ మార్లే ల్యాండ్ రోవర్‌కు తిరిగి ప్రాణం పోశారు..!

By Super Admin

జమైకన్ విప్లవ గేయ రచయిత, గాయకుడు, సంగీత విద్వాంసుడు బాబ్ మార్లే గురించి కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. నల్లజాతీయుల అణచివేతను వ్యతిరేకిస్తూ ఇతను పోరాటం చేశాడు. క్యాన్సర్ మహమ్మారి కారణంగా, 36 ఏళ్లకే కాలం చేశాడు.

సరే అదంతా అటుంచితే.. మన జమైతకన్ హీరో జన్మించి ఫిబ్రవరి 6తో సరిగ్గా 70 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, ఆయన జన్మదినానికి గుర్తుగా శాండల్స్ రిసోర్ట్స్ ఇంటర్నేషనల్ (ఎస్ఆర్ఐ) అతని ల్యాండ్ రోవర్ పికప్ కారును రీస్టోర్ చేసింది.

Bob Marley Land Rover 02

బాబ్ మార్లే అప్పట్లో 1977 మ్యాట్ బ్లూ కలర్ ల్యాండ్ రోవర్ సిరీస్ 3 కారును ఉపయోగించే వాడు. ఆయన కాలం చేసిన తర్వాత, ఆ కారును పట్టించుకున్న నాధుడే లేడు. దీంతో కాలంతో పాటుగా ఆయన ల్యాండ్ రోవర్ కారు కూడా పాతదైపోతూ వచ్చింది.

అయితే, ఎస్ఆర్ఐ అధికారులు, ఏటిఎల్ ఆటోమోటివ్, ఐటిసి, మార్లే కుటుంబ సభ్యులు చొరవ తీసుకొని, ఈ కారుకు తిరిగి జీవం కల్పించాలని 2012లో నిర్ణయించుకున్నారు. ఆ పని ఇప్పటికి పూర్తయింది. క్లచ్ నుంచి షాషీ వరకూ వర్క్ చేసి, దీనిని పూర్తి వర్కింగ్ కండిషన్‌లోకి తీసుకు వచ్చారు.

Bob Marley Land Rover 03

ఒకప్పుడు బాబ్ మార్లే నివసించిన కింగ్స్‌టన్‌లోని హోప్ రోడ్ వద్ద ఉన్న వాహనాన్ని ప్రస్తుతం ఆయన జ్ఞాపకార్థం మ్యూజియంగా మార్చారు. రీస్టోర్ చేసిన బాబ్ మార్లే ల్యాండ్ రోవర్ కారును తిరిగి ఇప్పుడు ఇదే మ్యూజియానికి చేర్చారు.

గతంలో బాబ్ మార్లే ఇదే ల్యాండ్ రోవర్ కారులో కింగ్స్‌టన్ చుట్టూ సంచరించే వారట. అంతేకాకుండా.. తన పెర్ఫార్మెన్స్‌ల కోసం అతని బ్యాండ్, మ్యూజికల్ ఎక్విప్‌మెంట్స్‌ను తరలించేందుకు వీలుగా కూడా ఈ పికప్ వాహనం ఉపయోగపడేది.

Most Read Articles

English summary
Sandals Resorts International (SRI) has found a brilliant way to celebrate Bob Marley's 70th birthday by successfully restoring the Jamaican legends Land Rover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X