100 ఏళ్లు పూర్తి చేసుకున్న బోయింగ్: దీని చరిత్రలో అతి ముఖ్యమైన విశయాలు

By Anil

సరిగ్గా వంద సంవత్సరాల క్రితం బోయింగ్ అనే ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ పురుడు పోసుకుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద విమాన తయారీ సంస్థగా నిలిచింది. అన్ని రకాల అవసరాలకు ఉపయోగపడే విమానాలను మరియు ఏరేస్పేస్ ఉత్పత్తులను తయారు చేసి ఆధునిక ప్రపంచానికి అందిస్తూ వచ్చింది.

బోయింగ్ సంస్థ ప్రపంచ దేశాలకు ఏరోస్పోస్ మరియు డిఫెన్స్ ఉత్పత్తులతో పాటు ప్రజా మరియు కార్గో రవాణా విమానాలను కూడా అందిస్తోంది. 1916 జూలైలో ప్రారంభమైన బోయింగ్ 100 ఏళ్ల వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బోయింగ్ చరిత్రలో అతి ముఖ్యమైన విషయాలను క్రింది కథనం ద్వారా అందిస్తున్నాము.

100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్

1916 జూలై 15 న అమెరికాలోని వాషింగ్టన్, సీటెల్‌లో విలియమ్ బోయింగ్ అనే వ్యక్తి ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ బోయింగ్‌ను స్థాపించాడు.

100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్

మార్చి 1, 1919 లో బోయింగ్ వారి మోడల్ సి అనే సీ ప్లేన్ ద్వారా మెయిల్ సర్వీస్‌ను ప్రారంభించారు. బిల్ బోయింగ్ చిత్రంలో సంచిని పట్టుకున్న వ్యక్తి మరియు అతని ప్రక్కన ఉన్న వ్యక్తి ఎడ్డీ హబ్బర్ ఈ ప్లేన్‌ను అమెరికాలోని సీటెల్ నుండి వాంకోవర్ వరకు నడిపారు.

100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్

సుమారుగా 100 సంవత్సరాల వయసున్న బోయిగ్ సంస్థ బిప్లేన్స్‌ (ప్రక్క ఫోటోలో చూపినది) కు కార్బన్ మరియు ఫైబర్‌ను ఉపయోగించి రెక్కలను తయారు చేస్తున్నప్పటి చిత్రం.

100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్

బోయింగ్ 204 ఫ్లైబోట్, దీనిని 1937 లో వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో నడిపారు. కలప మరియు ఫ్యాబ్రిక్ పదార్థాలలో తయారు చేసిన ఇందులో ఐదు ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. ఈ విమానంలో ప్రాట్ అండ్ విట్నీ కు చెందిన 400 హార్స్ పవర్ ఇంజన్‌ను వినియోగించారు. అప్పట్లో ఇది గంటకు 133 మైళ్ల వేగంతో ప్రయాణించేది.

100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్

న్యూయార్క్ నగరం మీదుగా ప్రయాణిస్తున్న ఈ విమానం బోయింగ్‌కు చెందిన మొదటి ఆధునిక ప్యాసింజర్ ప్లేన్. పూర్తి స్థాయిలో లోహంతో తయారయిన దీనిని 1930 లో పరిచయం చేశారు. ఇందులో ట్విన్-ఇంజన్‌ను వినియోగించారు.

100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్

ఇక్కడ పైలట్ సీటులో కూర్చున్న వ్యక్తి పేరు వెల్ల్‌వుడ్ ఇ. బెల్, ఇతను 1939 లో బోయింగ్ సంస్థలో ముఖ్య ఇంజనీరు. నాలుగు ఇంజన్‌లు గల 33 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ విమానాన్ని గరిష్ట ఎత్తుకు ప్రయాణించేందుకు వీలుగా డిజైన్ చేశారు. 1939 జూలై 12 న దీనిని పరిచయం చేశారు.

100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్

అమెరికాకు చెందిన బోయింగ్ తయారు చేసిన ఈ అతి పెద్ద విమానం 1941 ఆగష్టు 3 న ఇంగ్లాండు భూతలం మీద ల్యాండ్ అవుతున్నప్పటి చిత్రం ఇది. జర్మనీ ఆక్రమించిన యూరప్ భూభాగంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడుల్లో ఈ విమానం కీలక పాత్ర పోషించింది. అత్యంత దూరం ప్రయాణించే వీలుగు రూపొందించిన ఇందులో నాలుగు ఇంజన్‌లను అందించారు.

100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్

యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సుమారుగా 133 బి-50 బాంబర్ విమానాలను బోయింగ్ సంస్థకు ఆర్డర్ ఇచ్చింది. అందులో మొదటి విమాన్ని 1947 జూన్ 12 న డెలివరీ ఇస్తున్నప్పటి చిత్రం.

100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్

అధునాతమైన 707 ప్యాసింజర్ జెట్ విమానాన్ని మొదటి సారిగా 1954 మే లో వాషింగ్టన్‌లోని రెంటన్‌లో ప్రదర్శనకు ఉంచింది.

100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్

వేగం, సున్నితం మరియు సౌకర్యం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని బోయింగ్ ఈ 707 ప్యాసింజర్ విమాన్ని తయారు చేసింది. మరియు ఇందులో వినియోగించిన అన్ని పదార్థాలు కూడా ప్రయాణికుల భద్రతను పెంచేందుకు ఉపయోగపడే విధంగాజాగ్రత్తపడ్డారు.

100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్

707 జెట్ విమానంలో వినియోగించే రెండు ఇంజన్‌లను వినియోగించి 1962 అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడి కోసం ప్రత్యేక విమానాన్ని రూపొందించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు బోయింగ్ 7-సిరీస్ విమానాన్ని అమెరికా అధ్యక్షుడికి అధికారిక విమానంగా ఎయిర్ ఫోర్స్ వన్‌ పేరుతో అందుబాటులో ఉంచారు.

100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్

సీటెల్‌లోని హంగర్‌లో జనవరి 18, 1967 నాడు సుమారుగా 15 ఎయిర్ లైన్స్‌ సంస్థలకు బోయింగ్ 737 విమానాలను డెలివరీ ఇస్తున్న సందర్భంలో ఒక విమానం ముందు ఎయిర్ హోస్టెస్ ఫోజ్ ఇస్తున్నప్పటి చిత్రం.

100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్

1968 లో బోయింగ్ 747 అనే సరికొత్త విమానాన్ని విడుదల చేస్తున్న సందర్భంలో బోయింగ్ ప్రెసిడెంట్ బిల్ అల్లెన్ మరియు ప్యాన్ ఏఎమ్ సిఇవో జువాన్ ట్రిప్పీ (కుడివైపున) దిగిన చిత్రం. ఈ ఇద్దరూ రెండు సంస్థలకూ చాలా ఏళ్ల పాటు సేవలందించారు.

100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్

ఆర్బిటర్ ఎంటర్‌ప్రైసెస్ వారి అంతరిక్ష వాహక నౌక బోయింగ్ 747 క్యారియర్ రెక్కలను గ్రహించి ఆగష్టు 12, 1977 న నింగికెగిరిన సందర్బంలో తీసిన చిత్రం. ఈ విమానాలను వ్యోమగాములు ఫ్రెడ్ హైస్ మరియు గోర్డాన్ ఫుల్లెర్టన్ పైలట్లుగా నడిపారు.

100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్

సీటెల్‌లో ఉన్న బోయింగ్ ఫీల్డ్‌లోని బోయింగ్ ఎయిర్ క్రాప్ట్ మ్యూజియం ముందు అక్టోబర్ 30, 1977 న బోయింగ్ ఉద్యోగి కార్ల్ గస్టఫ్‌సన్ ఎడమ వైపు మరియు ప్రాజెక్ట్ మేనేజర్ హార్వర్డ్ లావరింగ్ చర్చించుకుంటున్నసందర్భంలోని చిత్రం.

100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్

అమ్‌స్టర్‌డ్యామ్ నుండి బీజింగ్ నగరాల మధ్య విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి అని తెలిపడానికి నిర్వహించిన కార్యక్రమం అనంతరం 1996 జూన్ 30 న బోయింగ్ సంస్థ బి 747-400 అనే ఎయిర్ క్రాఫ్ట్‌ను బీజింగ్‌లో విడుదల చేసి డచ్ ఎయిర్ లైన్స్‌కు అందించింది.

100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్

అమెరికాలోని బోయింగ్ విమానాల తయారీ ఫ్యాక్టరీ ముఖ చిత్రం, ప్రపంచంలోనే అతి పెద్ద అని చెప్పుకునే విమానాలను తయారు చేసే ఈ ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా నిలిచింది. ఇది వాషింగ్టన్‌లో కలదు.

100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్

ప్రస్తుతం బోయింగ్ సంస్థ యొక్క అధునాతన ప్యాసింజర్ విమానం 787 డ్రీమ్ లైనర్‌‌

100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్

ఇక్కడ విమానం దింపాలంటే ఆ ఎనిమిది మంది మాత్రమే అర్హులు

గంటకు 74,00 కిమీ.లు వేగంతో ప్రయాణించే విమానాలు

100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్

పాంబన్, రామేశ్వరాలను కలిపే రైలు వంతెన గురించి మీకు నిజాలు

ఇండియా మీదుగా వెళ్లే పది అంతర్జాతీయ రైలు మార్గాలు

Most Read Articles

English summary
Boeing turns 100: A look back at aviation history
Story first published: Thursday, July 21, 2016, 16:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X