ఇండియాలో మరో అధ్భుతానికి తెరదించనున్న రోడ్లు మరియు రైల్వే విభాగం

By N Kumar

ఇండియాలో ఒకే వంతెన మీద రైలు మరియు వాహనాలు నడిచే బ్రిడ్జి ఏదంటే తెలుగు వారందరూ గోదావరి నదిపై నిర్మించిన రాజమండ్రి వంతెన అని సగర్వంగా చెప్పవచ్చు. అయితే ఆసియా ఖండంలోనే రెండవ అతి పెద్ద రైల్ కమ్ రోడ్డు వంతెన కూడా ఇదే . అయితే దీని రికార్డును బ్రేక్ చేస్తూ ఇండియా అత్యంత పొడవైన రైల్ కమ్ రోడ్ వంతెనను నిర్మిస్తోంది.

బోగిభీల్ అనే రైల్ కమ్ రోడ్డు వంతెన నిర్మాణాన్ని 2018 నాటికి పూర్తి చేయనున్నారు. దీనికి చెందిన మరిన్ని ప్రత్యేకతల కోసం కథనం మొత్తం మీద ఓ లుక్కేసుకోండి.

బోగీభీల్: భారత దేశపు అత్యంత పొడవైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి

బోగీభీల్ బ్రిడ్జిని అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న మారు మూల ప్రాంతాలను కలుపూతూ బ్రహ్మపుత్ర నది మీద నిర్మిస్తున్నారు. ఈ వంతెన నిర్మాణాన్ని 2018 నాటికి పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురానున్నారు.

ప్రారంభం

ప్రారంభం

2002 లో ఈ బోగిభీల్ వంతెన నిర్మాణం ప్రారంభం అయ్యింది. అప్పట్లో దేశ ప్రధానిగా ఉన్న ఎ.బి. వాజ్‌పేయి 2002 ఏప్రిల్ 21 న ఈ వంతెన నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారు.

నిర్మాణం సమయం

నిర్మాణం సమయం

అనుకున్న అంచనాల ప్రకారం ఈ రోడ్ కమ్ రైలు వంతెనను ఏడు సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామనుకున్నారు. అయితే భారీ నిర్మాణాలు చోటు చేసుకుంటున్న క్రమంలో ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే మరో రెండేళ్ల కాలానికి ఈ బోగిభీల్ పూర్తి స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేసుకోనుంది.

అత్యంత పొడవైనదిగా

అత్యంత పొడవైనదిగా

బోగిభీల్ వంతెన సుమారుగా 4940 మీటర్లు పొడవు ఉంది. అయితే బీహార్‌లో 4,556 మీటర్లు పొడవున్న ఢిగా మరియు సోన్‌పూర్ బ్రిడ్జిని ఇది వెనక్కి నెట్టింది.

బ్రహ్మపుత్ర నది మీద

బ్రహ్మపుత్ర నది మీద

బోగిభీల్ వంతెన అస్సాం రాష్ట్రంలోని డిబ్రూఘర్ జిల్లాలో ఉన్న బ్రహ్మపుత్త నది మీద నిర్మించబడుతోంది. ఈ ప్రదేశంలో నది విశాలంగా ఉంటుంది. ఆధునిక పరిజ్ఞానం ద్వారా దీనిని నిర్మిస్తున్నారు. నీటి ద్వారా వంతెన పిల్లర్లకు కలిగే కోతను నివారించే విధంగా దీని నిర్మాణం చేపట్టారు.

డబుల్ డెక్కర్

డబుల్ డెక్కర్

ఈ బోగిభీల్ వంతెన డబుల్ డెక్కర్ వంతెనగా పనిచేయనుంది. అంటే వంతెన మీద మొదట రైలు ఆ వంతెన మీద నర్మించిన మరో వంతెన మీద వాహనాలు ప్రయాణిస్తాయి. ఇందులో రైలు కోసం రెండు లేన్ల బ్రాడ్ గేజ్ ట్రాక్ మరియు వాహనాల కోసం మూడు లేన్ల రహదారిని నిర్మించనున్నారు.

మొత్తం 74 కిలోమీటర్లు

మొత్తం 74 కిలోమీటర్లు

ఈ బోగిభీల్ వంతెన నిర్మాణం పూర్తయితే రైలు ద్వారా ప్రయాణించాల్సిన దూరం సుమారుగా 74 కిలోమీటర్ల మేర తగ్గిపోతుంది.

ఖర్చు

ఖర్చు

ప్రారంభంలోని దీని నిర్మాణ సమయంలో 17.67 బిలియన్స్ వరకు ఖర్చవుతాయని భావించారు. అయితే పనులలో జాప్య జరగడం మరియు ఎక్కువ పని ఉడటం వలన దీని నిర్మాణ ఖర్చు సుమారుగా 49.96 బిలియన్ల వరకు వ్యయం అవుతుందని అంచనా.

బోగీభీల్: భారత దేశపు అత్యంత పొడవైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి

పాంబన్, రామేశ్వరాలను కలిపే రైలు వంతెన గురించి మీకు తెలియని నిజాలు

సముద్ర గర్భంలో కదిలే రహదారి సొరంగం

Most Read Articles

English summary
Bogibeel Indias Longest Rail Cum Road Bridge In Northeast India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X