అమీర్ ఖాన్ పుట్టిన రోజు ప్రత్యేకం: ఇతని కార్ల గురించే కాదు...ఇతని మరో ప్రపంచం కూడా

By Anil

బాక్సాఫీస్ వద్ద భారీ హిట్లు కొట్టిన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ నెల 14 వ రోజుతో సరిగ్గా 51 వ పుట్టిన రోజు సంబరాలు జరుపుకున్నారు. అమీర్ ఖాన్ తనదైన్ శైలిలో సినిమాకు, కథకు తగ్గట్టుగా తన వాక్చాతుర్యం మరియు నటనను అచ్చంగా ప్రదర్శించగలడు. ఎంతో మంది అభిమానుల్ని పోగు చేసుకోవడానికి బహుశా ఇవే కారణాలు కావచ్చు.

నటుడు, దర్శకుడు మరియు సామాజిక సేవా రంగాలలో తనదైన ముద్రతో అడుగులు వేస్తున్నాడు. ఇది అమీర్ ఖాన్ జీవితంలో ఒక వైపు రూపం. కాని ఇతని జీవిత ప్రతిబింబంలో కార్లు మాత్రమే ఉంటాయి. అంటే ఇతనికి కార్లు అంటే ప్రేమ మరియు ఇష్టం. అందుకే టాలీవుడ్ ప్రేమికుల కోసం బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కార్ల ప్రపంచం గురించి ప్రత్యేక శీర్షిక. ఇతని వద్ద ఉన్న కార్ల గురించి క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది.

బెంట్లీ కాంటినెన్షియల్

బెంట్లీ కాంటినెన్షియల్

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక లగ్జరీ ఫీచర్లను అందిస్తున్న సంస్థ బెంట్లీ. ఇటువంటి లగ్జరీ కారును తన స్టేటస్‌కు గుర్తుగా ఎంచుకున్నాడు అమీర్ ఖాన్. లగ్జరీ ఫీచర్లు అంటే రాయలు వారి జీవితాన్ని ప్రతిబించే విధమైన ఫీచర్లతో గల ఈ బెంట్లీ కాంటినెన్షియల్ కారును ఎంచుకున్నాడు.

ప్రత్యేక రిజిస్ట్రేన్ నెంబర్

ప్రత్యేక రిజిస్ట్రేన్ నెంబర్

ఇంతటి ప్రేమతో కొన్న కారుకు అంతే అరుదైన 0007 రిజిస్ట్రేషన్ నెంబర్‌ను తన బెంట్లీ కాంటినెన్షియల్‌ కోసం ఎంచుకున్నాడు. ఇది శక్తివంతమైన వి-8 ఇంజన్‌ను కలిగి ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 300 కిలోమీటర్లు మరియు దీని ధర సుమారుగా రూ. 2.25 కోట్లుగా ఉంది.

రేంజ్‌రోవర్

రేంజ్‌రోవర్

అమీర్ ఖాన్ తన అందమైన కార్ల ప్రపంచంలోకి మరొక ఆకర్షణీమైన ల్యాండ్ రోవర్ వారి రేంజ్ రోవర్ కారును ఎంచుకున్నాడు. ఇతనికి సాధారణ కార్లతో పాటు ఎస్‌యువి వాహనాలన్నా అంతే ఇష్టం. అందుకోసం ఇతను రేంజ్‌రోవర్ ఎస్‌యువిని ఎంచుకున్నాడు.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

బయట నుండి ఇది ఎంతో భారీగా మొండి తనంతో కనిపించినప్పటికీ ఇందులో విక్షణమైన సౌకర్యాలు కలిగిన ఫీచర్లు ఉన్నాయి. 5.0-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ దాదాపుగా 503 బిహెచ్‌పి పవర్ మరియు 625 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో వేరియంట్లను బట్టి ఇది 2.4 నుండి 4.2 కోట్ల మధ్య ధరలలో అందుబాటులో ఉంది.

రోల్స్ రాయిస్ ఘోస్ట్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

రోల్స్ రాయిస్ కొనుగోలు చేయడం అనేది అంత సులువు కాదు. ఎందుకంటే రోల్స్ రాయిస్‌తో ఒక సంభంద ముడిపడి ఉండాలి. అయితే అమీర్ ఖాన్ కుటుంబం రోల్స్ రాయిస్‌తో ఎప్పుడో ముడి పడి ఉంది. తదనుగుణంగా అమీర్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఎంచుుకున్నాడు. ఘోస్ట్ గురించి తరువాత స్లైడర్‌లో వివరంగా.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు 6,592 సీసీ కెపాసిటి గల వి-12 ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది దాదాపుగా 536 బిహెచ్‌పి పవర్ మరియు 780 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఖరీదు 3.10 కోట్లుగా ఉంది. తన కార్ల జాబితాలో బెంట్లీ తరువాత ఎక్కువ ఖరీదైన కారు ఇదే

 బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్

అమీర్ ఖాన్ బిఎమ్‌డబ్లూ లోని 6-సిరీస్ కారును కూడా అమితంగా ప్రేమిస్తాడు. అందుకే తన మనస్సులో పాటు తన కార్ల జాబితాలో కూడా దీనికి చోటిచ్చాడు. మీరు గమనించినట్లయితే అమీర్ ఖాన్ తన సినీ జీవితంలో ఎలా ఉంటాడో తన నిజజీవితంలో కూడా అంతే నిక్కచ్చితంగా వ్యవహరిస్తాడు.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

ఇందులో పెద్దగా ఉన్న లెథర్ సీట్లు, భద్రత కోసం ఆరు ఎయిర్ బ్యాగులు కలవు. దీని సాంకేతిక వివరాల పరంగా వివిధ రకాల వేరియంట్లను ఇష్టపడతాడు. ప్రస్తుతం ఇతని వద్ద ఉన్న 6 సిరీస్ కారు కేవలం 5.4 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని విలువ కోటి రుపాయల వరకు ఉంది.

టయోటా ఫార్చ్యూనర్

టయోటా ఫార్చ్యూనర్

టయోటా వారు ఫార్చ్యునర్ కారు పొలిటీషియన్స్ కోసం డిజైన్ చేశారు. అయితే ఈ డిజైన్ మన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌కు తెగ నచ్చేసింది కాబోలు. అందుకోసమే తన కార్ల ప్రపంచంలోకి ఫార్చ్యూనర్ కారును కూడా ఎంచుకున్నాడు.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

అమీర్ ఖాన్ ఎంచుకున్న టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యువిలో 3.0-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 169 బిహెచ్‌పి పవర్ మరియు 360 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్‌యువి కోసం అమీర్ 25 లక్షలువ వెచ్చించాడు.

బుల్లెట్ ఫ్రూఫ్ కారు

బుల్లెట్ ఫ్రూఫ్ కారు

ఇతను ఎలాంటి పారిశ్రామిక వేత్త కాదు మరియు రాజకీయ వేత్త కాదు కాని ఇతనికి ఇలాంటి కారు ఎందుకు అంటారా ? ఇతను సత్యమేవ జయతే షో చేస్తుండేవాడు కదా. అపుడు నిజాలు సత్యాన్వేషణ జరిపే ఆ వేదిక మీద నుండి అమీర్ ఖాన్‌కు భారీ స్థాయిలో శత్రువులు పోగయ్యారు. ఒక్కో సారి ఇతని ప్రాణాన్ని హరించడానికి కూడా పథనకం వేశారు. అందుకే అమీరు మెర్సిడెస్ బెంజ్‌కు చెందిన ఎస్600 బుల్లెట్ ఫ్రూఫ్ కారును ఎంచుకున్నాడు.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

బాంబు దాడులను సైతం తట్టుకునే ప్రత్యేకమైన టైర్లను ఇది కలిగి ఉంది. ఏకే-47 మెషీన్ గన్‌తో కాల్పులు జరిపినా కూడా వాటిని తిప్పికొట్టే విధంగా కారు అద్దాలు మరియు ఫ్రేమ్‌ను డిజైన్ చేశారు. అచ్చం ఇలాంటి కారునే గత ఏడాది భారతీయ దిగ్గజ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ కొనుగోలు చేశాడు.

సెలబ్రిటీ కార్లకు చెందిన కథనాలు
  • ఖరీదైన కార్లు గల దక్షిణ భారత సినీతారలు దుమ్ములేపిన తెలుగు తారలు
  • వేలానికి విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం...!!
  • బాలీవుడ్ తారలకు ఇష్టమైన బైకులు
  •  ఆసక్తికరమైన కథనాలు
    • విమానాలు, నౌకల్ని మింగుతున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనా ?
    • భారతదేశపు ఉత్తమ యుద్ద హెలికాఫ్టర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
    • వివేక్ ఎక్స్ ప్రెస్ గురించి అబ్బురపరిచే ఆసక్తికరమైన విషయాలు

Most Read Articles

English summary
Bollywood Actor Aamir khan Car Collection
Story first published: Wednesday, March 16, 2016, 13:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X