స్కేట్ బోర్డుపై శ్రమ లేకుండా ఆఫీస్‌కు వెళ్లిపోండి..!

Posted by:

పెరిగి పెట్రోల్ ధరలను చూస్తుంటే, పెట్రోల్ నడిచే వాహనాల గుడ్‌బై చెప్పాలని అనిపిస్తోంది కదూ...! ప్రస్తుత గజిబిజి పరిస్థితుల్లో, సాధారణంగా చిన్న చిన్న దూరాలకు సైతం కాలినడక మాని వాహనాలను ఉపయోగించడం సర్వసాధారణం అయిపోయింది. మరి ఇలాంటి చిన్న దూరాలకు వాహనాలను ఉపయోగించి జేబులకు చిల్లు పెట్టుకోవటం ఎందుకు..? ఎంచక్కా ఈ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డును ఉపయోగిస్తే.. ఇటు సమయాన్ని అటు ఇంధనంపై ఖర్చు చేసే డబ్బును రెండింటినీ ఆదా చేసుకోవచ్చు.

బూస్టెడ్ బోర్ట్ - ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్

ఈ ఫోటోల్లో కనిపిస్తున్న స్కేట్ బోర్డ్ పేరు 'బూస్టెడ్ బోర్డ్'. ప్రపంచంలో కెల్లా తక్కువ బరువు కలిగిన ఎలక్ట్రిక్ వాహనంగా పేరు దక్కించుకుంది. ఈ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డును స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది.

బూస్టెడ్ బోర్ట్ - ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్

ఇది సాధారణ స్కేట్ బోర్డలతో పోల్చుకుంటే చాలా భిన్నమైనది. ఈ స్కేట్ బోర్డులోని వెనుక చక్రాలను బెల్ట్ సాయంతో ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క మోటార్‌కు అమర్చబడి ఉంటాయి. ఇవి శక్తివంతమైన తేలికపాటి లిథియం అయాన్ బ్యాటరీల సాయంతో పనిచేస్తాయి.

బూస్టెడ్ బోర్ట్ - ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్

బూస్టెడ్ బోర్డ్ బ్యాటరీలను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 9 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. ఇది గరిష్టంగా గంటకు 32 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.

బూస్టెడ్ బోర్ట్ - ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్

ఈ స్కేట్ బోర్డ్ బరువు కేవలం 5 కిలోలు మాత్రమే. దీనిని ఎక్కడికై సులువుగా మోసుకుని వెళ్లవచ్చు. యువతకు, కాలేజ్ కుర్రాళ్లకు, మంచి రోడ్లు కలిగిన ప్రాంతాలకు ఈ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ చక్కగా సూట్ అవుతుంది.

బూస్టెడ్ బోర్ట్ - ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్

ఈ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డును ఉపయోగిస్తే.. ఇటు సమయాన్ని అటు ఇంధనంపై ఖర్చు చేసే డబ్బును రెండింటినీ ఆదా చేసుకోవచ్చు.

బూస్టెడ్ బోర్ట్ టెక్నాలజీ

* వెనుక చక్రాలకు అమర్చిన ట్విన్ (రెండు) మోటార్స్
* పవర్‌ఫుల్ లిథియం బ్యాటరీలు
* కస్టమ్ ఎలక్ట్రానిక్స్
* ఫాస్ట్ ఛార్జింగ్ (2 గంటల కన్నా తక్కువ)

See next photo feature article

బూస్టెడ్ బోర్ట్ స్పెసిఫికేషన్లు

* మోటార్ పవర్ - 2000 వాట్స్
* గరిష్ట వేగం - గంటకు 32 కి.మీ.
* రేంజ్ - 9 కి.మీ.
* గరిష్ట గ్రేడ్ - 15 శాతం
* ఛార్జింగ్ సమయం - 2 గంటలు
* బ్యాటరీ - లిథియం అయాన్
* బరువు - సుమారు 5 కిలోలు


ఈ ఫోటోల్లో కనిపిస్తున్న స్కేట్ బోర్డ్ పేరు 'బూస్టెడ్ బోర్డ్'. ప్రపంచంలో కెల్లా తక్కువ బరువు కలిగిన ఎలక్ట్రిక్ వాహనంగా పేరు దక్కించుకున్న ఈ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డును స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. ఇది సాధారణ స్కేట్ బోర్డలతో పోల్చుకుంటే చాలా భిన్నమైనది. ఈ స్కేట్ బోర్డులోని వెనుక చక్రాలను బెల్ట్ సాయంతో ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క మోటార్‌కు అమర్చబడి ఉంటాయి. ఇవి శక్తివంతమైన తేలికపాటి లిథియం అయాన్ బ్యాటరీల సాయంతో పనిచేస్తాయి.

బూస్టెడ్ బోర్డ్ బ్యాటరీలను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 9 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. ఇది గరిష్టంగా గంటకు 32 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఈ స్కేట్ బోర్డ్ బరువు కేవలం 5 కిలోలు మాత్రమే. దీనిని ఎక్కడికై సులువుగా మోసుకుని వెళ్లవచ్చు. యువతకు, కాలేజ్ కుర్రాళ్లకు, మంచి రోడ్లు కలిగిన ప్రాంతాలకు ఈ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ చక్కగా సూట్ అవుతుంది. ఇందులో అమర్చిన బ్యాటరీలు కేవలం రెండు గంటల కన్నా తక్కువ సమయంలో పూర్తిగా ఛార్జ్ అవుతాయి.

Story first published: Wednesday, September 26, 2012, 19:28 [IST]
English summary
Soon, you can skate to work! Researchers are developing a skateboard which they claim will be the world's lightest electric vehicle and will be capable of travelling up to 9 kilometres. The Stanford University team behind the 'Boosted Board' said it could reach speeds of 32km/hr and be used by tourists, commuters and for everyday getting around, the Daily Mail reported.
Please Wait while comments are loading...