ఆరడుగుల అనకొండతో ట్రక్కు క్రింది ఈ కుర్రోడు ఏం చేస్తున్నాడో చూడండి

ఓ కుర్రాడు ఆరడుగులు అనుకొండతో భారీగా కుస్తీ పట్టి, చివరికి అనుకొండను పట్టుకున్నాడు. ఓ ట్రక్కులోని ఇంజన్‌ను చుట్టుముట్టిన పెద్ద పామును ఎలా తొలగించాడో చూద్దాం రండి...

Written By:

పాములు సాధారణంగా చల్లటి రక్తాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ వెచ్చదనాన్ని కోరుకుంటా. అందుకే కాబోలు ఎక్కువగా కలుగుల్లో నివశిస్తుంటాయి. అయితే చల్లటి వాతావరణం ఉన్న దేశాలలో అయితే పాముల నివాశం ఇదిగో ఇలాంటి వాహనాలే...

ఈ కుర్రాడి పేరు ఒలి వార్‌డ్రోప్, ఈ కుర్రాడు సరిగ్గా పాఠశాల విద్యాభ్యాసం కూడా పూర్తి చేయలేదు. ఏకంగా ఆరు అడుగులు ఉన్న అనుకొండను కట్టడి చేసి పట్టుకున్నాడు.

వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఈ ట్రక్కు వేడిగా ఉన్న సమయంలో వచ్చి ఇంజన్ వద్ద వెచ్చిగా వొల్లు కాచుకుంటోంది. అయితే వాహనం కలదలడానికి అవాంతరం ఏర్పడిందని ట్రక్కును పూర్తిగా గమనిస్తే, ఇంజన్ క్రింది భాగంలో ఈ పెద్ద పాము ఇంజన్ మొత్తాన్ని కౌగిలించుకుని ఉంది.

అయితే ఒలి చేతులకు గ్లౌజులను ధరించి మెల్లగా పాము తలను వెతికిపట్టుకుని తరువాత పాముకు గానీ, తనకు గానీ ఎలాంటి ప్రమాదం సంభవించకుండా పామును పట్టుకున్నాడు.

వీడియో ద్వారా ట్రక్కు ఇంజన్ భాగం నుండి అనకొండను తొలగించడాన్ని వీడియో ద్వారా వీక్షించగలరు.

పాఠకులారా, పాములు ఎప్పుడు వెచ్చటి వాతావరణాన్ని కోరుకుంటాయి. కాబట్టి అప్పుడప్పుడు మీ వాహనాలను, బైకులను సైలెన్సర్ మరియు ఇంజన్ వద్ద గమనిస్తూ ఉండండి....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Tuesday, March 7, 2017, 17:21 [IST]
English summary
Teenager Wrestles Six-Foot Python Out Of A Pickup-Truck
Please Wait while comments are loading...

Latest Photos