అద్బుతం: లీటర్ నీటితో 300 మైళ్ల మైలేజ్

Written By:

చాలా మంది అసాధ్యం అని ఆలోచించే వారి ఆలోచనలను సుసాధ్యం చేశాడు బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తి. తన సొంత గ్యారేజీలో ఓ మోటార్ సైకిల్‌లను అభివృద్ది చేశాడు. ఇది ఇంధనంగా కేవలం నీటిని మాత్రమే తీసుకుంటుంది. ఆశ్చర్యపోవడం మానేసి, ఎలా సాధ్యమో మీరు ఓ లుక్కేసుకోండి.

బ్రెజిల్‌కు చెందిన రికార్డో అజెవాడో సావ్ పౌలో లోని సొంత గ్యారేజీలో తన 1993 కాలం నాటి హోండా ఎన్ఎక్స్ 200 ను టి పవర్ హెచ్2ఒ (నీటి యొక్క రసాయనిక నామం H2O) మోటార్ సైకిల్‌గా మార్చేసాడు.

అజెవాడో ఈ మోటార్ సైకిల్‌ గురించి పత్రికా ప్రతినిధులతో వివరిస్తూ, ఒక్క లీటర్ నీటిలో గరిష్టంగా 300 మైళ్ల మేర ప్రయాణించవచ్చని, అది కూడా కలుషితమైన నదిలోని నీరు, డిస్టిల్ వాటర్ లేదంటే త్రాగేనీటిని కూడా ఉపయోగించవచ్చని పేర్కొన్నాడు.

అజెవాడో మాట్లాడుతూ, తన నివాసానికి దగ్గర్లో ఉన్న నదిలోని కలుషితమైన నీటిని ఇంధనంగా వినియోగించినప్పుడు, మంచి నీటి కన్నా మంచి ఫలితాన్నించిందని చెప్పుకొచ్చాడు.

పనితీరు

ఈ బైకులో విద్యుద్విశ్లేషణ(electrolysis) కోసం కారులో ఉపయోగించే పెద్ద బ్యాటరీని వినియోగించాడు. విద్యుద్విశ్లేషణ పద్దతి ద్వారా నీటిలో ఉండే హైడ్రోజన్ అణునువులను వేరు చేయబడతాయి. ఈ పరికరం నీరు (H2O)ని ఆక్సిజన్ (O2) మరియు హైడ్రోజన్(h2) అణువులుగా విభజిస్తుంది.

భారీ పరిమాణంలో వేరయ్యే హైడ్రోజన్‌ను ఇంజన్‌లోకి పంపి ఇంధనంగా వినియోగిస్తానని ఇతను తెలిపాడు. ఇంజన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ నుండి పొగబదులు నీటి ఆవిరి వస్తుందని వివరించాడు.

సాధారణంగా పెట్రోల్, డీజల్ మరియు గ్యాస్ ద్వారా నడిచే వాహనాల కార్బన్‌మోనాక్సైడ్(Co)ను విడుదల చేస్తాయి. ఇవి వాతావరణానికి అత్యంత హానికరమైనవి.

అజెవాడో ఆవిష్కరణతో ప్రపంచ రవాణా పరిశ్రమ మొత్తం కుదేలవడం ఖాయం. ఈ సాంకేతికతను తీసుకునే సంస్థలతో ఇతని జాగ్రత్త పడాలి. ఎందుకంటే గతంలో ప్రయోగ రూపకర్తల నుండి హ్కకులను కొనుగోలు చేసిన అనంతరం వారిని చంపేయడం జరిగింది.

ఒక్క లీటర్ నీటితో 300 మైళ్లు ప్రయాణించే పరిజ్ఞానం రూపుదిద్దుకున్నప్పుడు, ఖరీదైన ఇంధనాల వినియోగించాల్సిన అవసరమేంటి ? ఇలాంటి వానహాలను వినియోగిస్తే వాతావరణ కాలుష్యం కూడా అదుపులోకి వస్తుంది కదా...?

పెద్ద పరిమాణంలో ఇలాంటి బైకులను ఉత్పత్తి చేయాలంటే ఈ సాంకేతికతను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయోగం నచ్చినట్లయితే మీ మిత్రులతో పంచుకోండి.... మీ వద్ద ఇలాంటి ప్రయోగం ఉంటే మాతో పంచుకోండి...

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Saturday, February 25, 2017, 13:28 [IST]
English summary
Brazilian Water Powered Motorbike Goes Over 300 Miles on 1 Liter of Water
Please Wait while comments are loading...

Latest Photos