బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ ఇప్పుడు డాగ్ ప్రూఫ్

BIC
భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఇండియన్ గ్రాండ్ ప్రికు ఆతిథ్యం ఇచ్చిన గ్రేటర్ నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి)లో నేడు '2012 ఇండియన్ గ్రాండ్ ప్రి' అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అక్టోబర్ 26 నుంచి అక్టోబర్ 28 వరకూ ఈ ఫార్ములా వన్ రేస్ జరగనుంది. అక్టోబర్ 26, 27 తేదీలలో ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. ఫైనల్ రేస్ అక్టోబర్ 28వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో, ప్రాక్టీస్ సెషన్‌కు అంతరాయం కలగకుండా ఉండేందుకు బిఐసి యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంది.

గతేడాది అక్టోబర్ నెలలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిలో ప్రాక్టీస్ రేస్ జరుగుతున్న సమయంలో కొన్ని వీధి కుక్కలు (స్ట్రీట్ డాగ్స్)రేస్ ట్రాక్‌పై ప్రవేశించి ప్రాక్టీస్ సెషన్‌కు అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. అప్పట్లో అన్ని మీడియాలు ఈ విషయంపై ఫోకస్ చేయటం, హడావిడిగా చేసిన ఏర్పాట్ల పట్ల బిఐసి యాజమాన్యంపై విమర్శలు తలెత్తడంతో ఈసారి అటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు కార్యనిర్వాహకులు సాధ్యమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు. కుక్కలు, జంతువులు రేస్ ట్రాక్‌పైకి ప్రవేశించడానికి వీలు లేకుండా మెష్‌లను ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండగా.. బిఐసిలో అక్టోబర్ 27న జరగనున్న కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి:

  • జేకే ఏసియా రేసింగ్ సిరీస్ (క్వాలిఫైయింగ్): 09:15-09:45
  • ఎఫ్1 పడ్డాక్ క్లబ్ (పిట్ లేన్ వాక్): 09:50-10:40
  • ఎఫ్1 థర్డ్ ప్రాక్టీస్: 11:00-12:00
  • ఎమ్ఆర్ఆఫ్ ఛాంపియన్‌షిప్ ఫస్ట్ రేస్(10 ల్యాప్స్ లేదా 25 నిమిషాలు): 12:25-12:55
  • ఎఫ్1 పడ్డాక్ క్లబ్ పిట్ లేన్ వాక్: 13:00-13:45
  • ఎఫ్1 క్వాలిఫైయింగ్: 14:00
  • జేకే ఏసియా రేసింగ్ సిరీస్ ఫస్ట్ రేస్(10 ల్యాప్స్ లేదా 25 నిమిషాలు): 15:30-16:00
Most Read Articles

English summary
2012 Indian grand prix Formula 1 organisers says they are determined to ensure that the track near Delhi is completely "dog proof" ahead of Sunday's race.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X