నేటి వీడియో: కుక్కలు చింపిన కారు

By Ravi

కుక్క జోలికి వెళ్లకూడదనేది ఊరికే కాదు. ఈ వీడియో చూసిన తర్వాత 'కుక్కలు చింపిన విస్తరి' అనే సామెతను 'కుక్కలు చింపిన కారు' మార్చాల్సి వస్తుందేమో. సాధారణంగా కుక్కలు కార్ల వెంట పడటం, టైర్లపై మూత్రం పోయటం వంటి వాటిని గమనిస్తూ ఉంటాం.

కానీ ఎక్కడైనా కుక్కలు కారు బంపర్‌ను అందులోనూ పోలీస్ కారు బంపర్‌ను చీల్చి చెండాలడం చూశారా..? ఇదిగో ఈ వీడియోలో ఆ దృశ్యాన్ని చూడండి. అమెరికాలో ఓ పోలీస్ కారును కుక్కలు అటాక్ చేశాయి. వాటిని తరిమేందుకు పోలీసు బయపడి కారులోనే ఉండిపోవటం అవి కారు ముందు బంపర్‌ను ముక్కలు ముక్కలు చేసి పారేశాయి.

సాధారణంగా దొంగలను పట్టుకునేందుకు వీలుగా, వేగంగా వెళ్లేలా అక్కడి పోలీస్ కార్లను తయారు చేస్తుంటారు. అయితే, ఈ పోలీస్ మాత్రం వీధి కుక్కల నుంచి తప్పించుకోలేక (బహుశా కుక్కలకు హాని చేయకూడదనుకున్నాడేమో) కారును వాటికి అంకింత చేశాడు.

ఇంకేముంది.. కుక్క తన బలాన్నంతా పళ్లలోకి తెచ్చుకొని బంపర్‌ను కొరికింది. ఆ కుక్కకు మరో సాయం చేయడానికి మరో కుక్క వచ్చింది. ఇలా రెండు కుక్కలు కలిసి మొత్తానికి పోలీస్ కారును పరుగులు పెట్టించాయి. మరి ఆ కుక్కలు పోలీస్ కార్లపై ఎందుకు పగ బట్టాయో.. ఏమో..! సరే ఆ సరదా వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!

Most Read Articles

English summary
We've heard of fender benders but this particular one takes the cake. Dogs are known to chase after cars in their territory, relieve themselves on tyres, but possessing a taste for bumpers?
Story first published: Thursday, April 24, 2014, 16:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X