ఏకే47తో కాల్చినా ఏం కాలేదు.. కంపెనీ సీఈఓ సేఫ్..

By Ravi

విఐపిల భద్రత కోసం కార్ కంపెనీలు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తయారు చేస్తుంటాయి. అయితే, ఇలాంటి వాహనాలను కొనుగోలు చేసినా, అందులో ఎంత మేర భద్రత ఉంటుందో అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అందుకే, సాధారణ వాహనాలను బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చే ఓ సంస్థ, తమ కస్టమర్లను నమ్మించడానికి ఓ ప్రమాదకర ఫీట్ చేసింది.

వివరాల్లోకి వెళితే.. టెక్సాస్ ఆర్మోరింగ్ కార్పోరేషన్ (టిఏసి) అనే సంస్థ తమ బుల్లెట్ ప్రూఫ్ ప్రోడక్ట్ టెస్టింగ్‌‌ని చాలా సీరియస్‌గా తీసుకుంది. తమ వాహనాలు ఎంత సురక్షితమైనవో తెలియజేసేందుకు గాను, ఆ కంపెనీ సీఈఓనే నేరుగా రంగంలోకి దిగారు.

టిఏసి ప్రెసిడెంట్, సిఈఓ ట్రెంట్ కింబాల్ బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చిన ఓ కారులో కూర్చొని ఉండగా, కారు ఎదురుగా మరో వ్యక్తి అత్యంత శక్తివంతమైన ఏకె 47 గన్‌తో లైవ్‌గా కాల్పులు జరిపాడు. ఆ సమయంలో సీఈఓ కారులో ఎంతో ధైర్యంగా, ధీమాగా కూర్చొని ఉంటాడు. ఇదొక పబ్లిసిటీ స్టంటే అయినప్పటికీ, ఇందులో వాడిన తుపాకి, కారు, బుల్లెట్స్ చివరకు మనుషులు కూడా పూర్తిగా నిజమే.

టిఏసి ప్రపంచంలో కెల్లా అత్యంత తేలికైన సాయుధ వాహనాలను తయారు చేస్తుంటుంది. తమ కస్టమర్ల భద్రతలోను, విలాసంలోను కంపెనీ ఎక్కడా రాజీ పడకుండా, వినియోగదారులను సంతృప్తి పరచేలా కార్లను డిజైన్ చేస్తుంది. అధునాతన తయారీ పద్ధతులు, ముడిపదార్థాలను ఉపయోగించి టిఏసి తమ సాయుధ వాహనాలను మరింత ధృడంగా, సురక్షితంగా తీర్చిదిద్దుతుంది. మరి టిఏసి టెస్టింగ్ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/J8i5d5toEDk?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
At Texas Armoring Corporation (TAC) we take product testing EXTREMELY SERIOUSLY. Assuring our clients' safety is paramount to success in our industry, and batch-testing ballistic materials is critical in our QA process. Watch our latest video where TAC President and CEO Trent Kimball takes product testing to a whole new level.&#13;
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X