ISIS దాడుల్లో బుల్లెట్లను తిప్పికొట్టిన 1990 కాలం నాటి బిఎమ్‌డబ్ల్యూ

మధ్య ప్రాచ్య దేశాల్లో జరుగుతున్న ఐఎస్ఐఎస్ దాడుల్లో ప్రజలను కాపాడేందుకు పురాతణ బిఎమ్‌డబ్ల్యూ బుల్లెట్‌ప్రూఫ్‌ను ఉపయోగించారు.

By N Kumar

మధ్య ప్రాచ్య దేశాల్లో ఉగ్రదాడులు పెచ్చుమీరుతున్నాయి. ISIS ముష్కర మూకలు చేస్తున్న అనర్థమైన దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఒక వ్యక్తి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తన బుల్లెట్‌ప్రూఫ్ బిఎమ్‌డబ్ల్యూ ద్వారా ఐఎస్ఐఎస్ దాడులకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలను కాపాడాడు.

బిఎమ్‌డబ్ల్యూ బుల్లెట్ ప్రూఫ్

అయితే ఈ బిఎమ్‌డబ్ల్యూ బుల్లెట్‌ప్రూఫ్ కారు ఈ కాలం నాటిది కాదు. పాత కాలం నాటి ఇది కాల్పులను ఎదుర్కొని మరీ ప్రజలను కాపాడటంలో ఎంతగానో ఉపకరిచింది.

బిఎమ్‌డబ్ల్యూ బుల్లెట్ ప్రూఫ్

కుర్ధిష్ పెష్‌మెర్గా తిరుగుబాటుదారుడు 1990 ల కాలం నాటి బిఎమ్‌డబ్ల్యూ బుల్లెట్‌ప్రూఫ్ కారును దాడులు జరిగిన అక్టోబర్ 21 కి నాలుగు నెలల క్రితం కొనుగోలు చేశాడు.

బిఎమ్‌డబ్ల్యూ బుల్లెట్ ప్రూఫ్

ఇరాక్‌లోని కుర్ధిష్ లో గల కిర్‌కుక్ అనే ప్రాంతంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాడులు చేస్తుండగా అకొ రెహ్మాన్ అనే సైనికుడు సుమారుగా కొన్ని డజన్ల మందిని కాపాడాడు.

బిఎమ్‌డబ్ల్యూ బుల్లెట్ ప్రూఫ్

కుర్ధిష్ ప్రాంతీయ మీడియా సంస్థ ఆ ప్రాంతానికి చేరుకునే సరికి పరిస్థితి మొత్తం ఐస్ఐస్ ముష్కరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. వారిని ఎదుర్కోడానికి అక్కడే ఉన్న భద్రతా బలగాలు సైతం ముందుకు రాలేదు.

బిఎమ్‌డబ్ల్యూ బుల్లెట్ ప్రూఫ్

గత కొన్ని రోజుల నుండి సామాన్య జన జీవనం మొత్తం స్తంభించిపోయింది. ఉగ్రదాడుల్లో గాయపడిన ప్రజలను, సైనికులను రెహ్మాన్ తన బిఎమ్‌డబ్ల్యూ సెడాన్‌లో సురక్షితంగా హాస్పిటల్‌కు చేరవేశాడు.

బిఎమ్‌డబ్ల్యూ బుల్లెట్ ప్రూఫ్

అకో రెహ్మాన్ గడిచిన రోజుల్లో కాల్పుల్లో గాయపడిన సుమారుగా 70 మందిని సురక్షితంగా సమయానికి హాస్పిటల్‌కు తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ద్వారా తరలించాడు.

బిఎమ్‌డబ్ల్యూ బుల్లెట్ ప్రూఫ్

బుల్లెట్‌ప్రూఫ్ బిఎమ్‌డబ్ల్యూ కారు యొక్క ముందు, వెనుక భాగాలలో మరియు అద్దం మీద జరిగిన కాల్పుల్లో 50 నుండి 60 వరకు బుల్లెట్లు తగిలిన గుర్తులు ఉన్నట్లు రెహ్మాన్ పేర్కొన్నాడు.

బిఎమ్‌డబ్ల్యూ బుల్లెట్ ప్రూఫ్

పెష్‌మర్గా దాడుల్లో ఎదురొడ్డి ప్రజల ప్రాణాలు కాపాడినందుకు అక్కడి గవర్నర్ ఇతగాడికి సుమారుగా 500,000 ఇరాక్ దినార్లు (385 అమెరికా డాలర్లు) ను బహుమానంగా ప్రకటించాడు.

బిఎమ్‌డబ్ల్యూ బుల్లెట్ ప్రూఫ్

ధైర్యవంతుడు మరియు త్యాగశీలి అయినటువంటి రెహ్మాన్‌కు బిఎమ్‌డబ్ల్యూ సంస్థ కూడా సత్కరించనుంది. ప్రస్తుతం బుల్లెట్ల దాడికి గురైన బిఎమ్‌డబ్ల్యూ ఇ32 కారును తీసుకుని దానికి బదులుగా సరికొత్త బిఎమ్‌డబ్ల్యూని ఇవ్వనుంది. బిఎమ్‌డబ్ల్యూ ఆ కారును తమ కార్పోరేట్ కార్యాలయంలో ప్రదర్శనగా ఉంచనుంది.

బిఎమ్‌డబ్ల్యూ బుల్లెట్ ప్రూఫ్

  • ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ జిప్సీలనే వినియోగిస్తోంది, కారణం ?
  • ప్రపంచాన్ని వణికిస్తున్న రష్యన్ మిస్సైల్స్ ఇప్పడు భారత్ వద్ద
  • ప్రమాదకర శత్రువుల అంతానికి ఈ ఐదు ఎంతో కీలకం

Most Read Articles

English summary
Read In Telugu: Bulletproof BMW Used to Rescue Dozens During ISIS Attack
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X