చెన్నై అన్నా సలాయ్ వీధిలో ఏర్పడిన పెద్ద గొయ్యి: ఇరుక్కుపోయిన బస్సు మరియు కారు

Written By:

తమిళనాడులోని అన్నా సలాయ్ రహదారిలో షడన్‌గా ఓ పెద్ద గొయ్యి ఏర్పడింది. ఏం జరుగుతుందో అని తేరుకుని తెలుసుకునే లోపే ఓ బస్సు మరియు కారు ఆ గొయ్యిలోకి కూరుకుపోయి ఇరుక్కుపోయాయి. భారీ రద్దీతో కూడిన ఈ రహదారిలో ఇలా భూమి చీలిపోవడానికి గల కారణం ఏమిటో చూద్దాం రండి...

చెన్నైలోని అన్నా సలాయ్ రహదారిలో ఉన్న చర్చ్ పార్క్ వీధిలో మద్యాహ్నం సుమారుగా 1:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఈ రోడ్డు మీద ఏర్పడిన పెద్ద చీలికల్లో తమిళనాడు ప్రభుత్వానికి చెందిన బస్సు మరియు ఓ కారు ఇందులో ఇరుక్కుపోయాయి.

ఈ సమయంలో బస్సులో 35 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. స్వల్పంగా గాయపడిన వారిని సమీపంలో ఉన్న రాయపెట్టాయ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సుతో పాటు హోండా సిటి కారు కూడా ముందు వైపు గాయపడింది.

ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు, బస్సు నిలిచిన ఉన్న సమయంలో ప్రయాణికులు క్రిందకు దిగుతుండగా రోడ్డు మీద చీలికలు ఏర్పడి అవి కాస్త బస్సు వద్దకు వచ్చి ఆ ప్రాంతంలో పెద్ద నుయ్యి ఏర్పడి బస్సు అందులోకి దిగబడిపోయిందని తెలిపారు.

ఈ ప్రాంతానికి సమీపంలో మెట్రో పనులు జరుగుతున్నాయి. ఓ మెట్రో అధికారి మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో మట్టి చాలా వదులుగా ఉండటం ద్వారా రోడ్టు మీద చీలికలు ఏర్పడి పెద్ద గొయ్యి ఏర్పడినట్లు తెలిపాడు.

అయితే ఏదో పెద్ద ప్రమాదం జరుగుతోందని భావించి అక్కడున్న వారు కాసేపు భయబ్రాంతులకు గురయ్యారు. ఆ ప్రాంతంలో మాత్రమే మట్టి వదులుగా ఉండటం ద్వారా ఇలా ఏర్పడిందని, భూకంపం కాదని ఊపిరిపీల్చుకున్నారు.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Read In Telugu about Bus Car Trapped Giant Crater Chennai Anna Salai
Please Wait while comments are loading...

Latest Photos