టాప్ 10 కార్ బాడీ టైప్స్

By Ravi

ఒకప్పటి కార్లతో ఇప్పటి కార్లను పోల్చుకుని చూస్తే, ఆటోమొబైల్ రంగంలో మనం ఎంత వృద్ధిని సాధించామో అర్థమవుతుంది. ఒకప్పుడు కారు అంటే, దానికి ఒక నిర్ధిష్టమైన రూపం ఉండేది. దాదాపుగా అన్ని కంపెనీలు ఇంచు మించు ఒకే రూపంలో కార్లు తయారు చేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ప్రస్తుతం అనేక రకాల రూపాల్లో కార్లు అందుబాటులో ఉన్నాయి.

ఒక్కో కారు రూపాని ఒక్కోరకమైన పేరు ఉంది. కారు బాడీ టైప్‌ని, దాని పరిమాణాన్ని, ఆకారాన్ని బట్టి హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎస్‌యూవీ ఇలా పలు రకాలుగా కారు బాడీ స్టైల్స్‌ని అభివర్ణించడం జరుగుతోంది. ప్రస్తుతం దాదాపు అన్ని ప్రధాన కార్ కంపెనీలు ఈ సెగ్మెంట్లలో తమ ఉత్పత్తులను ఆఫర్ చేస్తున్నాయి.

ఈనాటి మన ఆఫ్ బీట్ శీర్షికలో కార్ బాడీ టైప్స్ ఎన్ని రకాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..!

టాప్ 10 కార్ బాడీ టైప్స్

తర్వాతి స్లైడ్‌లలో వివిధ రకాల కార్ బాడీ టైప్స్ గురించి తెలుసుకోండి.

1. సెడాన్

1. సెడాన్

సెడాన్ లేదా సెలూన్ అనేది ఓ బాడీ టైప్. ఈ బాడీ టైప్ కలిగిన కార్లు అత్యంత ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ రకం కార్లు ప్రత్యేకించి వెనుక భాగంలో అధిక బూట్ స్పేస్, బూట్ డోర్ కలిగి ఉంటాయి. సాధారణంగా సెడాన్ కార్లలో నలుగురు లేదా ఐదుగురు ప్రయాణీకులు హాయిగా ప్రయాణించవచ్చు. సెడాన్ డిజైన్ కార్లను 'త్రీ-బాక్స్' (ఫ్రంట్ డ్రైవర్-ప్యాసింజర్, రియర్ ప్యాసింజర్స్, బూట్ స్పేస్) డిజైన్ కార్లు అని కూడా పిలుస్తారు. ఉదాహరణకు హోండా సిటీ, మారుతి సియాజ్, హ్యుందాయ్ వెర్నా మొదలైన కార్లు సెడాన్ విభాగం క్రిందకు వస్తాయి.

2. హ్యాచ్‌బ్యాక్

2. హ్యాచ్‌బ్యాక్

హ్యాచ్‌బ్యాక్ సాధారణంగా అధిక బూట్ స్పేస్‌ని కలిగి ఉండదు. రియర్ సీట్ తర్వాత వెనుక భాగం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా హ్యాచ్‌బ్యాక్ డిజైన్ కార్లు చాలా కాంపాక్ట్‌గా ఉండి, తక్కువ పార్కింగ స్థలాన్ని ఆక్రమిస్తాయి. సిటీ డ్రైవింగ్ ఈ తరహా కార్లు చక్కగా సూట్ అవుతాయి. సెడాన్లలో మాదిరిగానే హ్యాచ్‌బ్యాక్ కార్లలో కూడా నలుగురు లేదా ఐదుగురు హాయిగా ప్రయాణించవచ్చు. మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ ఐ20, ఫోర్డ్ ఫిగో మొదలైన కార్లు హ్యాచ్‌బ్యాక్ విభాగం క్రిందకు వస్తాయి.

3. ఎస్‌యూవీ

3. ఎస్‌యూవీ

ఎస్‌యూవీ లేదా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ భారీ ఆకారాన్ని కలిగి ఉంటాయి. పెద్ద టైర్లు, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, పవర్‌ఫుల్ ఇంజన్, ఫోర్-వీల్ (ఆల్-వీల్) డ్రైవ్ వంటి ఫీచర్లు ఎస్‌యూవీల సొంతం. కొన్ని రకాల ఎస్‌యూవీలను ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ఫోర్డ్ ఎండీవర్, టొయోటా ఫార్చూనర్, హ్యుందాయ్ శాంటాఫే, మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ మొదలైన వాహనాలు ఎస్‌యూవీ విభాగం క్రిందకు వస్తాయి.

4. ఎమ్‌పివి

4. ఎమ్‌పివి

ఎమ్‌పివి లేదా మల్టీ పర్సప్ వెహికల్ (వీటిని మల్టీ యుటిలిటీ వెహికల్ లేదా ఎమ్‌యూవీ అని కూడా పిలుస్తారు). ఎమ్‌పివిలు సాధారణంగా వన్/టూ బాక్స్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. పేరుకు తగినట్లుగానే ఈ వాహనాలను బహుళ ప్రయోజనం కోసం ఉపయోగిస్తుంటారు. ఎమ్‌పివిలు ఎక్కువగా టూరిస్ట్ వాహనాలుగా కనిపిస్తుంటాయి. ఇవి ఎక్కువ ఇంటీరియర్ స్పేస్‌ని కలిగి ఉండి ఆరు నుంచి 8 మంది ప్రయాణీకులు కూర్చునే విధంగా డిజైన్ చేయబడి ఉంటాయి. టొయోటా ఇన్నోవా, మారుతి సుజుకి ఎర్టిగా, హోండా మొబిలియో వంటి వాహనాలను ఎమ్‌పివి విభాగం క్రిందకు వస్తాయి.

5. ఎస్టేట్స్ / వ్యాగన్స్

5. ఎస్టేట్స్ / వ్యాగన్స్

ఎస్టేట్స్ లేదా స్టేషన్ వ్యాగన్స్ ఫ్రంట్ అండ్ రియర్ డోర్ వరకూ సెడాన్ లాంటి నిర్మాణాన్ని కలిగి ఉండి, వెనుక మాత్రం ఎక్కువ లేగేజ్ స్పేస్‌తో కూడిన హ్యాచ్‌బ్యాక్ లాంట్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సెడాన్, హ్యాచ్‌బ్యాక్‌ల కలయికే ఎస్టేట్ బాడీ స్టైల్ అని చెప్పొచ్చు. టాటా ఇండిగో మరీనా, టాటా ఎస్టేట్, స్కొడా ఆక్టావియా కాంబీ వంటి మోడళ్లు ఈ విభాగం క్రిందకు వస్తాయి.

6. క్రాసోవర్

6. క్రాసోవర్

ఎస్‌యూవీ లాంటి రగ్గడ్ లుక్, హ్యాచ్‌బ్యాక్ లాంటి పరిమాణంతో కూడిన వాహనాన్ని క్రాసోవర్ అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎస్‌యూవీ, హ్యాచ్‌బ్యాక్‌ల కలయికే ఈ క్రాసోవర్ బాడీ స్టైల్. ఆన్-రోడ్ అండ్ ఆఫ్-రోడ్ ప్రయోజనం కోసం తయారు చేయబడిన క్రాసోవర్ వాహనాలను వాటి హ్యాచ్‌బ్యాక్ వెర్షన్‌ల కన్నా కొంచెం ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఫియట్ అవెంచురా, ఎతియోస్ క్రాస్, ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ పోలో వంటి మోడళ్లు ఈ విభాగం క్రిందకు వస్తాయి.

7. కూపే

7. కూపే

సెడాన్ లేదా సెలూన్ బాడీ టైప్‌కి స్పోర్టీ వెర్షనే కూపే బాడీ టైప్. సాధారణంగా కూపే బాడీ స్టైల్ కలిగిన కార్లకు సెడాన్ల మాదిరిగా 4 డోర్లు కాకుండా 2 డోర్లు మాత్రమే ఉంటాయి. వెనుక సీటులోకి ప్యాసింజర్లు ప్రవేశించాలంటే, ముందు సీట్లను ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎస్-క్లాస్, మినీ 3-డోర్ మొదలైన కార్లు ఈ విభాగం క్రిందకు వస్తాయి.

8. కన్వర్టిబల్

8. కన్వర్టిబల్

ఈ బాడీ టైప్ చాలా వరకు ఖరీదైన కార్లలో మాత్రమే లభిస్తుంది. ఈ బాడీటైప్‌ని కన్వర్టిబల్ లేదా క్యాబ్రియోలెట్ అని కూడా పిలుస్తారు. ఈ రకం కార్లలో ఆటోమేటిక్‌గా మడుచుకునే రూఫ్ (కారు పైభాగం) లేదా మ్యాన్యువల్‌గా అమర్చుకునే సాఫ్ట్ టాప్ లేదా హార్డ్ టాప్ రూఫ్ ఉంటుంది. సాధారణంగా కన్వర్టిబల్ కార్లు రెండు డోర్లను కలిగి ఉంటాయి. ఉదాహరణకు బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 ఈ విభాగం క్రిందకు వస్తుంది.

9. పికప్

9. పికప్

పికప్ వాహనాలను ఇటు వాణిజ్య ప్రయోజనం కోసం అటు వ్యక్తిగత ప్రయోజనం కోసం వినియోగించుకోవచ్చు. ఇవి సాధారంగా సింగిల్ క్యాబిన్ (డ్రైవర్, కో ప్యాసింజర్) లేదా డబుల్ క్యాబిన్ (డ్రైవర్ + ముగ్గురు/నలుగురు ప్యాసింజర్స్) నిర్మాణాన్ని కలిగి ఉండి, వెనుక భాగంలో కొంత లగేజ్‌ను మోసుకెళ్లేందుకు వీలుగా ఫ్లాట్ బెడ్‌ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు టాటా జెనాన్, మహీంద్రా బొలెరో పికప్, ఇసుజు డి-మ్యాక్స్ మొదలైనవి ఈ విభాగం క్రిందకు వస్తాయి.

10. మినీవ్యాన్

10. మినీవ్యాన్

మినీవ్యాన్ వాహనాలను సాధారంగా వాణిజ్య లేదా వ్యక్తిగత ప్రయోజనం కోసం ఉపయోగిస్తుంటారు. ఇందులో ఎక్కువ మంది ప్రయాణీకులు లేదా ఎక్కువ లగేజ్‌ను ఉంచుకునే సదుపాయం ఉంటుంది. మినీవ్యాన్‌లు ఎక్కువగా ధీర్ఘచతురస్రాకారపు బాక్స్ టైప్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. మారుతి సుజుకి ఈకో, టాటా వెంచర్ మొదలైన వాహనాలు ఈ విభాగం క్రిందకు వస్తాయి.

Most Read Articles

English summary
Ever come across the terms ‘hatchback' or ‘sedan' and wondered what they mean? Well, those actually are descriptions of body styles of a car, or the type or form of vehicle design. In this short guide, we explain the different kinds of car designs out there.
Story first published: Wednesday, November 26, 2014, 18:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X