రెండు భారీ లారీల మధ్య నుజ్జునుజ్జైన కారు: ఐదుగురు దుర్మణం

Written By:

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో అత్యంత హృదయవిదారకమైన ప్రమాదం చోటు చేసుకుంది. కనీసం ఈ ప్రమాదం గురించ వివరించేదుకు కూడా వీలు లేకుండా ఘోరాతిఘోరంగా సంభంవించింది. ఎదురెదురుగా ఢీ కొన్న రెండు లారీల మధ్య కారు చేరి తునాతునకలైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారంతా అక్కడిక్కడే మృతి చెందారు.

ఈ భీకర ప్రమాదం దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సిసిటివిలో రికార్డయ్యాయి. దీని ఆధారంగా ప్రమాదానికి కారణమయిన అంశాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఉన్నత విద్యకు సంభందించి కాలేజిను సందర్శించడానికి స్వగ్రామం నుండి హైదరాబాద్‌కు కారులో పయనమం అయిన వారు ఇలా లారీని ఓవర్ టేక్ చేయబోయారు.

ఇదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ మరియు ఓవర్ టేక్ చేయబోయిన లారీకి మధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు ఉండిపోయింది.

కేవలం క్షణాల వ్యవధిలోనే రెండు లారీల మధ్య ఐదు మందితో ఉన్న కారు పూర్తిగా నలిగిపోయింది.

ఈ ప్రమాదంలో ఎదురెదురుగా ఢీకొన్న లారీలలో ఒక లారీ ముందు భాగం పూర్తిగా నుజ్జునజ్జయింది. ఆ లారీలోకి కారు మరియు అందులో ప్రయాణిస్తున్న అందరూ భాగమైపోయి నలిగిపోయారు.

ప్రమాద స్థలి వద్ద ఏర్పాటు చేసిన సిసి టీవీలో రికార్డయిన ప్రమాద సంఘటనలో ప్రమాదం చోటు చేసుకున్న తీరును తెలిపే చిత్రాలు.

కారు డ్రైవర్ ముందు వైపు వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేసి కుడివైపుకు వెళ్లాలనుకున్నాడు. కాని దీనిని గమనించని లారీ డైవర్ అదే వేగంతో ముందుకు వెళ్లాడు.

ఒకే సమయంలో కారు దానితో పాటు ముందుకు వెళుతున్న లారీ ముందుకు రావడం రెండు వాహనాల ఆవళి వైపున్న రోడ్డు మీదకు చేరుకోవడం ఎదురుగా వచ్చిన లారీ ఈ రెండింటిని ఢీకొనడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. కనీసం ఆలోచించేంత సమయం కూడా లేకుండానే ఐదు మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.

నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలంలోని టెకిర్యాల చౌరస్తా వద్ద జాతీయ రహదారి మీద సంభవించిన ఈ ప్రమాదంలో మృతి చెందిన వారందరు కూడా ఆర్మూర్ మండలం ఆలుర్‌ వాసులుగా గుర్తించారు

నివారణ

ఇలాంటి కూడళ్లలో ఓవర్ టేక్ మరియు గరిష్ట వేగం రెండింటిని నియంత్రించుకోవాలి మరియు అవళి వైపున రోడ్డు మీద రహదారుల రాకపోకలను గుర్తించిన తరువాత రోడ్డును దాటాలి.

 

English summary
Car Crushing Between Two Trucks Horrific Collision
Please Wait while comments are loading...

Latest Photos