టాప్ 10 మైండ్ బ్లోయింగ్ కార్ టెక్నాలజీస్!

By Ravi

ఆటోమొబైల్ రంగంలో కార్లలో ఫీచర్లు, టెక్నాలజీలు నానాటికీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో ఆటోమొబైల్స్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నారు ఇంజీర్లు. ఇప్పటికే, అనేక అడ్వాన్స్డ్ టెక్నాలజీలు మనకు అందుబాటులో ఉన్నాయి.

గడచిన 20 ఏళ్ల క్రితం పరిస్థితిని, ఇప్పటి పరిస్థిని గమనిస్తే ఆటోమొబైల్ టెక్నాలజీలో అనేక కొత్త విప్లవాలు చోటు చేసుకున్నాయి. పాదచారులను, సైక్లిస్టులను ఆటోమేటిక్‌గా గుర్తించి బ్రేక్ వేసే కార్లు, ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ సీట్లు, రోడ్డును బట్టి మారే ఆటోమేటిక్ లైట్స్ అబ్బో ఇలాంటి సాంకేతికతలు ఎన్నో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.

ఈనాటి మన కార్ టాక్ కథనంలో టాప్ 10 మైండ్ బ్లోయింగ్ కార్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం రండి..!

1. అడాప్టివ్ డిజిటల్ డిస్‌ప్లే

1. అడాప్టివ్ డిజిటల్ డిస్‌ప్లే

కారుకు సంబంధించిన సమాచారాన్ని అందించడంలో స్టీరింగ్ వెనుక లేదా డ్యాష్‌బోర్డుపై ఉండే మీటర్ కన్సోల్ అత్యంత కీలకమైనది. ఇందులో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ అడాప్టివ్ డిజిటల్ డిస్‌ప్లే టెక్నాలజీ. ఇందులో మూడు రకాల డిస్‌ప్లేలు ఉంటాయి అవి - ఎలిగాన్స్, ఈకో, పెర్ఫార్మెన్స్. ఎలిగాన్స్ మోడ్‌లో స్పీడోమీటర్ సెంటర్‌లో ఉండి, నీడిల్ హైలైట్ అవుతుంది. ఈకోమోడ్‌లో కన్సోల్ మొత్తం ఆకుపచ్చ రంగులోకి మారి, ఇంధన వినియోగం, సగటు మైలేజ్, మిగిలిన ఇంధనంతో ఎంత దూరం వెళ్లవచ్చు వంటి అంశాలను తెలియజేస్తుంది. పెర్ఫార్మెన్స్ మోడ్‌లో కారు ఉపయోగించుకుంటున్న పవర్ వివరాలను తెలియజేస్తుంది.

2. ఆటోమేటిక్ డిమ్మింగ్ మిర్రర్

2. ఆటోమేటిక్ డిమ్మింగ్ మిర్రర్

కారు లోపల సెంటర్‌లో ఉండే ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, వెనుక వైపు నుంచి వచ్చే వాహనాల హెడ్‌లైట్ల కాంతిని నేరుగా రిఫ్లెక్ట్ చేయకుండా, ఆటోమేటిక్‌గా డిమ్ అయ్యి, స్పష్టంగా చూడటానికి వీలవుతుంది. కారు వెనుక కాంతి తగ్గగానే ఆటోమేటిక్‌గా ఇందులో బ్రైట్‌నెస్ అడ్జెస్ట్‌మెంట్స్ జరుగుతాయి.

3. ఎలక్ట్రిక్ సీట్స్ విత్ మెమరీ ఫంక్షన్

3. ఎలక్ట్రిక్ సీట్స్ విత్ మెమరీ ఫంక్షన్

మీ కారును ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉండి, ప్రతిసారి సీటింగ్ పొజిషన్‌ను మారుస్తూ ఉన్నట్లయితే, కారు ఎక్కిన ప్రతిసారి మీకు నచ్చినట్లుగా సీటును సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, కారులో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సీట్స్ విత్ మెమరీ ఫంక్షన్ ఉన్నట్లయితే, మీకు నచ్చినట్లుగా సీట్‌ను సర్దుబాటు చేసుకొని, మెమరీ బటన్‌లో స్టోర్ చేసుకుంటే, మీరు కారు సీట్లో కూర్చున్నప్పుడల్లా ఆ బటన్‌ను నొక్కగానే కారు మీరు ఇదివరకు సర్దుబాటు చేసుకున్న స్థానంలోకి మారిపోతుంది.

4. రోడ్డు సంకేతాల సమాచారం

4. రోడ్డు సంకేతాల సమాచారం

సాధారణంగా ఒక్కోసారి మనం రోడ్డుపై ఉన్న సంకేతాలను (స్పీడ్ లిమిట్, నో రైట్ టర్న్ మొదలైనవి) గమనించకుండా ముందుకు వెళ్లిపోయి ప్రమాదాల బారిన పడుతుంటాం. కానీ ఈ కొత్త టెక్నాలజీ రోడ్డుకు చుట్టు ప్రక్కల ఉండే ఇలాంటి సంకేతాలను పరిశీలించి, ఆ సమాచారాన్ని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై ప్రొజెక్ట్ చేసి డ్రైవరును అప్రమత్తం చేస్తుంది.

5. అడాప్టివ్ క్రూయిజ్ కంంట్రోల్ విత్ క్యూ అసిస్ట్

5. అడాప్టివ్ క్రూయిజ్ కంంట్రోల్ విత్ క్యూ అసిస్ట్

సాధారణ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌తో కారు మనం నిర్ధేశించిన వేగం ప్రకారం మాత్రమే వెళ్తుంది. కానీ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఉండే కారు, ఆ కారుకు ముందున్న కారు వేగాన్ని బట్టి స్పందిస్తూ, వేగాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అంటే, ముందున్న కారు వేగం తగ్గితే, మన కారు వేగం తగ్గటం, ముందున్న కారు వేగం పెరిగితే మన కారు వేగం పెరగటం జరుగుతుంది. ఇందులో లేన్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా నిర్ధిష్ట లేన్ నుంచి తప్పుకోకుండా ప్రయాణిస్తూ ఉంటుంది.

6. అడాప్టివ్ హెడ్‌లైట్స్

6. అడాప్టివ్ హెడ్‌లైట్స్

స్టాండర్డ్ హెడ్‌లైట్స్ కాంతిని నేరుగా మాత్రమే ప్రొజెక్ట్ చేస్తాయి. కానీ, ఈ అడాప్టివ్ హెడ్‌‌లైట్స్ డ్రైవర్ కారును ఏవైపు తిప్పితే ఆవైపుకు పూర్తి కాంతిని ప్రసరింపజేసేలా ఉంటాయి. ప్రత్యేకించి మలుపుల వద్ద ఈ టెక్నాలజీ చక్కగా ఉపయోగపడుతుంది.

7. హెడ్స్అప్ డిస్‌ప్లే

7. హెడ్స్అప్ డిస్‌ప్లే

ఈ టెక్నాలజీ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. కారు వెళ్తున్న వేగం, నావిగేషన్ తదితర వివరాలను ఇది నేరుగా విండ్‌షీల్డ్‌పై ప్రొజెక్ట్ చేస్తూ, డ్రైవరును అప్రమత్తం చేస్తూ ఉంటుంది.

8 పెడస్ట్రెయిన్, సైక్లిస్ట్ డిటెక్షన్

8 పెడస్ట్రెయిన్, సైక్లిస్ట్ డిటెక్షన్

రోడ్డుపై పాదచారులు, సైక్లిస్టులు వెళ్లడాన్ని గుర్తించి, ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు అప్లయ్ కావటం ఈ టెక్నాలజీ విశిష్టిత. కారులో ఉండే సెన్సార్లు ఈ పరిస్థితులను గమనించి, ఆన్-బోర్డ్ కంప్యూటర్‌కి సమాచారం అందజేస్తాయి. ఆ తర్వాత సదరు కంప్యూటర్ కారును తన కంట్రోల్‌లోకి తీసుకొని బ్రేక్స్ అప్లయ్ అయ్యేలా చేస్తుంది.

9. అడాప్టివ్ పార్కింగ్

9. అడాప్టివ్ పార్కింగ్

పార్కింగ్ సమస్యలను తప్పించేందుకు చక్కగా ఉపయోగపడే టెక్నాలజీ ఇది. పార్కింగ్ చేసేటప్పుడు డ్రైవర్‌తో పెద్దగా పనిలేకుండా కారును ఆటోమేటిక్‌గా పార్క్ చేయటంలో ఈ ఫీచర్ సహకరిస్తుంది.

10. అటానమస్ కార్

10. అటానమస్ కార్

ఈ టెక్నాలజీ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది, త్వరలోనే ఇది కస్టమర్లకు అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది. ఈ టెక్నాలజీ ఉండే కార్లలో డ్రైవర్ అవరసమే ఉండదు. కెమెరాలు, సెన్సార్లు, రాడార్ల సాయంతో కారు దానంతట అదే ఆటోమేటిక్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది.

Most Read Articles

English summary
Features and technology in cars are constantly evolving. A few years ago, most things in a car was manually operated. Now, however, things are going automatic. Imagine all this 20 years ago. Would you have even thought it possible? These 8 car technologies would have blown your mind in the past:
Story first published: Saturday, March 28, 2015, 11:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X