మీకు 'హుడ్ ఆర్నమెంట్స్' గురించి తెలుసా..?

By Ravi

మీకు 'హుడ్ ఆర్నమెంట్స్' గురించి తెలుసా..? గోల్డ్ ఆర్నమెంట్స్ గురించి విన్నాం కానీ ఈ ఉడ్ ఆర్నమెంట్స్ ఏంటి చెప్మా అనుకుంటున్నారా..? హుడ్ అంటే కారు బానెట్ అని అర్థం, ఆర్నమెంట్ అంటే ఆభరణం అని అర్థం. సింపుల్‌హా హుడ్ ఆర్నమెంట్ అంటే, బానెట్‌ను అంటిపెట్టుకుని ఉండే ఆభరణం అన్నమాట.

ఆటోమొబైల్స్‌లో హుడ్ ఆర్నమెట్ ట్రెంటో ఎన్నో దశాబ్ధాల క్రితం నుంచే ప్రాచుర్యంలో ఉంది. ప్రత్యేకించి మెర్సిడెస్ బెంజ్, రోల్స్ రాయిస్, జాగ్వార్, షెవర్లే వంటి కార్ కంపెనీలు తమ బ్రాండ్ లోగో/సింబల్/యాంబ్లం/మస్కట్ మొదలైన వాటిని కార్ల ముందు భాగంలో బానెట్‌పై అమర్చబడి ఉండటాన్ని మనం చూసుంటాం.

హుడ్ ఆర్నమెంట్స్‌కు చాలా పెద్ద చరిత్రే ఉంది. 1920వ దశకంలో కార్ల ముందు వైపు రేడియేటర్ గ్రిల్, దాని క్యాప్‌లు ప్రధానంగా కనిపించేవి. దీంతో కార్ కంపెనీలు రేడియేటర్ క్యాప్‌లనే పక్షి రెక్కలు, జంతువులు వంటి బొమ్మలతో హుడ్ ఆర్నమెంట్స్‌గా మార్చేవారు. సుమారు 1940 వరకు ఈ ట్రెండ్ కొనసాగింది.

ప్రస్తుతం జాగ్వార్, రోల్స్ రాయిస్ వంటి కంపెనీలు మాత్రమే ఇప్పటికీ హుడ్ ఆర్నమెంట్ ట్రెండ్‌ను అలానే కొనసాగిస్తున్నాయి. ఈనాటి ఆఫ్ బీట్ కథనంలో పలు కార్ కంపెనీలు ఉపయోగించిన అందమైన హుడ్ ఆర్నమెంట్స్ మరియు వాటి వివరాలను తెలుసుకుందాం రండి..!

మరిత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

మీకు 'హుడ్ ఆర్నమెంట్స్' గురించి తెలుసా..?

తర్వాతి స్లైడ్‌లలో హుడ్ ఆర్నమెంట్స్‌కు సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలను చూడండి..!

రోల్స్ రాయిస్ - స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ

రోల్స్ రాయిస్ - స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ

'స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ'గా పిలువబడే ఈ హుడ్ ఆర్నమెంట్‌ను బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్ తమ కార్లలో ఉపయోగిస్తుంది. రోల్స్ రాయిస్ కార్లకు స్పెషల్ అట్రాక్షన్ కూడా ఇదే. ఇప్పటికీ రోల్స్ రాయిస్ తమ కార్లపై ఈ యాంబ్లంను ఉపయోగిస్తుంటుంది. స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ యాంబ్లంను చార్లెస్ రాబిన్సన్ సైకస్ డిజైన్ చేశారు. ఎలీనర్ వెలాస్కో తోర్నటన్ మరియు లార్డ్ ఆఫ్ బియూలియూల మధ్య రహ్యస ప్రేమను ఉందులో సింబలైజ్ చేశారు. గాలికి కాస్త ముందుకు వాలినట్లుగా ఉండే లేడీ, ఆ గాలికి పైకెగురుతున్న ఆమె గౌను ఓ దేవకన్య రెక్కలను తలపిస్తుంది. రోల్స్ రాయిస్ 1900వ సంవత్సరం నుంచి ఈ యాంబ్లంను ఉపయోగిస్తోంది.

లింకోల్న్ - గన్ సైట్

లింకోల్న్ - గన్ సైట్

గతంలో లింకోల్న్ విక్రయించిన అనేక కార్లలో ఈ 'గన్ సైట్' ఆర్నమెంట్‌ను చూడొచ్చు. తుపాకులతో లక్ష్యాన్ని ఛేదించేందుకు గాను ఉపయోగించే పాయింటర్ మాదిరిగా ఉంటుంది కాబట్టే దీనిని గన్ సైట్ యాంబ్లం అని పిలుస్తారు. ఈ లోగోలోని నాలుగు చివర్లు కంపెనీ అందించే కార్ల యొక్క స్పీడ్, గ్రేస్, బ్యూటీ, ఎండ్యూరెన్స్‌లను సూచిస్తాయి.

ప్యాకార్డ్ - గాడెస్ ఆఫ్ స్పీడ్

ప్యాకార్డ్ - గాడెస్ ఆఫ్ స్పీడ్

ప్యాకార్డ్ అనేది పురాతన అమెకన్ లగ్జరీ ఆటోమొబైల్ కంపెనీ. ఇది 1899 మరియు 1958 మధ్య కాలంలో కార్లను తయారు చేసింది. కంపెనీ తమ కార్లలోని రేడియేటర్ క్యాప్‌నే హుడ్ ఆర్నమెంట‌్‌గా ఉపయోగించేది. ఈ యాంబ్లంను 'గాడెస్ ఆఫ్ స్పీడ్' (వేగం యొక్క దేవత) అని పిలిచేవారు. చేతిలో చక్రం, వీపున రెక్కలు కలిగిన ఓ మహిళ రూపమే ఈ యాంబ్లం.

బెంట్లీ - ఫ్లైయింగ్ బి

బెంట్లీ - ఫ్లైయింగ్ బి

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ బెంట్లీ కూడా తమ కార్లపై హుడ్ ఆర్నమెంట్ ఉపయోగించేది. బెంట్లీ మస్కట్ 'ఫ్లయింగ్ బి'. ఇందులో ‘B' అనే ఆంగ్ల అక్షరానికి రెక్కలు అతికించబడి ఎగురుతున్న ‘B' మాదిరిగా అనిపిస్తుంది. అందుకే దీనిని ఫ్లయింగ్ బి అని పిలుస్తారు. ఈ హుడ్ ఆర్నమెంట్‌ను తొలిసారిగా 1919 బెంట్లీ 3 ½ లీటర్ కారులో ఉపయోగించారు. ఈ యాంబ్లంలో ‘B' అంటే బెంట్లీ అని అర్థం. దీనికి ఉండే రెక్కలు బెంట్లీ కార్ల వేగాన్ని ప్రతిభింభింపజేస్తాయి.

మెర్సిడెస్ బెంజ్ - త్రీ పాయింటెడ్ స్టార్

మెర్సిడెస్ బెంజ్ - త్రీ పాయింటెడ్ స్టార్

రోల్స్ రాయిస్ యొక్క స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ మాదిరిగానే మెర్సిడెస్ బెంజ్ యొక్క త్రీ పాయింటెడ్ స్టార్ హుడ్ ఆర్నమెంట్ కూడా ఎంతో పాపులర్ అయ్యింది. ఇటీవలి కాలంలోనే మెర్సిడెస్ బెంజ్ హుడ్ ఆర్నమెంట్ ట్రెండ్‌కు గుడ్‌బై చెప్పింది. ఒకప్పుడు గాట్లీబ్ డైమ్లర్ తన భార్యకు రాసిన లేఖలో ఈ త్రీ పాయింటెడ్ స్టార్ గుర్తు వేసి, ఏదో ఒకరోజు ఈ స్టార్ మన ఫ్యాక్టరీలపై ప్రకాశిస్తుందని రాశాడు.

ఆ తర్వాతి కాలంలో పౌల్, ఆడాల్ఫ్ డైమ్లర్ మరియు గాట్లీబ్ కుమారులు ఈ నక్షత్రాన్ని డైమ్లర్ మోటోరెన్ గెసెల్‌షాఫ్ట్స్ బోర్డ్ యొక్క అఫీషియల్ యాంబ్లంగా ప్రతిపాదించారు, ఆ తర్వాత బోర్డు దీనిని అంగీకరించింది. ఈ త్రికోణపు నక్షత్రాన్ని డిఎమ్‌జి 1921లో రిజిస్టర్ చేయించింది. ఇప్పుడు లభిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కార్లలో హుడ్ ఆర్నమెంట్స్ లేవు, కానీ పెద్ద స్టార్‌ను మాత్రం ఉపయోగిస్తున్నారు.

Picture Credit: Flickr

Ehisforadam

ప్లైమౌత్ - ఫ్లయింగ్ లేడీ

ప్లైమౌత్ - ఫ్లయింగ్ లేడీ

ప్లైమౌత్ అనే కంపెనీ దాదాపు 1940వ కాలంలో ప్రీమియర్ కంపెనీ ద్వారా మన దేశంలోకి ప్రవేశించింది. అప్పట్లో ఇది చాలా పరిమిత సంఖ్యలో వాహనాలను విక్రయించేంది. ప్లైమౌత్ కంపెనీ మస్కట్ పేరు 'ఫ్లయింగ్ లేడీ' (ఎగిరే స్త్రీ). గద్ద రెక్కలు కలిగిన ఓ స్త్రీ నాభి పైభాగం వరకు కలిగిన యాంబ్లం ఇది. 1920వ దశకం చివర్లో ప్లైమౌత్ ఈ యాంబ్లంను ఉపయోగించింది.

బుయిక్ - గాడెస్

బుయిక్ - గాడెస్

బుయిక్ కంపెనీ తయారు చేసిన రివీరా, మోడల్ 40 వంటి 1930కి చెందిన మోడళ్లు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ కార్లపై అప్పట్లో బుయిక్ కంపెనీ 'గాడెస్' అని పిలిచే మస్కట్‌ను హుడ్ ఆర్నమెంట్‌గా ఉపయోగించేందు. ఇసాడోరా డ్యూకన్ డ్యాన్సర్ సూచిస్తూ దీనిని తయారు చేసినట్లు చెప్పుకునేవారు. గాడెస్ యాంబ్లంలో ఓ స్త్రీ దుస్తులు లేకుండా పూర్తి నగ్నంగా, ఎదురుగాలిని స్వేచ్చగా ఆస్వాదిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆమె వెనుక భాగంలో ఓ స్కార్ఫ్ గాలి వేగానికి ఎగురుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ డ్యాన్సర్‌ను 1927లో తన స్కార్ఫ్‌తో కారు వెనుక చక్రాన్ని కట్టేసి లాక్కుంటూ వెళ్లి చంపేశారని చెప్పుకుంటుంటారు.

Picture credit: Flickr

Flythebirdpath

జాగ్వార్ - లీపర్

జాగ్వార్ - లీపర్

ఇటీవలే మన ఇండియన్ కంపెనీ టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న ఈ బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ తమ కార్లపై పాపులర్ 'లీపర్'ను హుడ్ ఆర్నమెంట్‌గా ఇటీవరి కాలం వరకూ ఉపయోగించేది. లీపర్ అనేది ఓ ప్రత్యేకమైన జాతికి చెందిన పులి లాంటిది. ఇది కారు బానెట్‌పై నుంచి ముందుకు దూకుతున్నట్లుగా ఉంటుంది. మొట్టమొదట్లో దీనిని ఓ యాక్ససరీగా ఉత్పత్తి చేసేవారు, ఆ తర్వాత 1938లో జాగ్వార్ దీనిని హుడ్ ఆర్నమెంట్‌గా పరిచయం చేసింది.

డాడ్జ్ - ది ర్యామ్

డాడ్జ్ - ది ర్యామ్

డాడ్జ్ యొక్క మస్కట్ పేరు ది ర్యామ్. అంటే కొమ్ములు తిరిగిన పొట్టేలు అని అర్థం. ఈ యాంబ్లంను డిజైన్ చేసింది కూడా యావర్డ్ ఫెయిర్‌బ్యాంక్సే. డాడ్జ్ కార్లు ధృడత్వాన్ని చాటి చెప్పేందుకు, ఈ కార్లకు మరొకటి సాటి రావని తెలిపేందుకే ఈ లోగోను డిజైన్ చేశారు. ఇక్కడ వాల్టర్ క్రైస్లర్‌కు, యావర్డ్ పెయిర్‌బ్యాంక్స్‌కు మధ్య జరిగిన ఓ సరదా సన్నివేశాన్ని చెప్పుకోవాల్సిన అసరం ఉంది. ఓ పొట్టేలు మీ కోసం వస్తుందంటే, అది డాడ్జ్ అని గుర్తుంచుకోమని పెయిర్‌బ్యాంక్స్ చెప్పగా, అందుకు సరేనన క్రైస్లర్ ఒప్పుకున్నాడు.

పోంటియాక్ - ఛీఫ్ పోంటియాక్

పోంటియాక్ - ఛీఫ్ పోంటియాక్

ప్రపంచంలో కెల్లా అత్యంత అందమైన హుడ్ ఆర్నమెంట్స్‌లో పోంటియాక్ కూడా ఒకటి. ఇదొక నేటివ్ అమెరికన్ తల, 1930వ దశకానికి చెందిన, పూర్తి హెడ్‌డ్రస్ ధరించిన ఓ నేటివ్ అమెరికన్ నుంచి స్ఫూర్తిపొంది దీనిని డిజైన్ చేశారు. ఆ తర్వాత 1950లే ఛీఫ్ పోంటియాక్ యెక్క హెడ్ యాంబ్లంతో జెట్ ప్లేన్స్ తయారు చేశారు.

Picture Credit: Flickr

Exfordy

ఫెండర్ ఎండర్

ఫెండర్ ఎండర్

ఆటోమొబైల్ చరిత్ర ఓ సమద్రమంత అయితే, అందులో ఈ హుడ్ ఆర్నమెంట్ అనేది ఓ నీటి బింధువు మాత్రమే. అయితే, కాలంతో పాటే హుడ్ ఆర్నమెంట్స్ కూడా చరిత్రలో కలిసిపోతున్నాయి. ఇప్పుడు అతికొద్ది కంపెనీలు మాత్రమే ఈ హుడ్ ఆర్నమెంట్ ట్రెండ్‌ను ఇంకా కొనసాగిస్తూ ఉన్నాయి. వాస్తవానికి హుడ్ ఆర్నమెంట్స్ కావాలంటే, మనం ఆయా బ్రాండ్ కార్లను కొనాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ మార్కెట్ మోడిఫికేషన్‌గా మన రెగ్యులర్ కార్లపై కూడా హుడ్ ఆర్నమెంట్స్‌ను అమర్చుకోవచ్చు. కార్ యాక్ససరీ, స్పేర్ పార్ట్స్, కార్ డెకార్ ఐటమ్స్‌ను విక్రయించే పలు కంపెనీలు ఈ హుడ్ ఆర్నమెంట్స్‌ను కూడా విక్రయిస్తుంటాయి. మరి మీ కారుపై ఎలాంటి హుడ్ ఆర్నమెంట్ ఉంది..? ఈ కథనంలో పేర్కొన్నవి కాకుండా, మీకు తెలిసిన మంచి హుడ్ ఆర్నమెంట్స్ ఏవైనా ఉంటే మాతో పంచుకోగలరు.

Most Read Articles

English summary
Growing up was never the same after a Mercedes-Benz joined the family. Our Merc was a classic, a grey ‘69 190 E, that my father immaculately restored to its former glory. While the car fascinated us to no end, one of its most prized features was the three-pointed star hood ornament.
Story first published: Thursday, May 15, 2014, 19:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X