51 ఏళ్లుగా శరీరంలో కార్ టర్న్ సిగ్నల్‌తో..

By Ravi

వైద్యులు శస్త్రచికిత్స (ఆపరేషన్) చేసేటప్పుడు శరీరంలో కొన్ని వస్తువులు వదిలివేయటాన్ని (మర్చిపోవటం) వంటి వార్తలు మనం అప్పుడప్పుడూ వింటూ ఉంటాం. అవెంత వరకూ నిజమో అటుంచితే.. ఇప్పుడు చెప్పుకోబోయే సంఘటన మాత్రం చాలా విచిత్రమైనది.

అమెరికాకు చెందిన ఆర్థర్ లాంపిట్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న కాలంలో అతని ఫోర్డ్ థండర్‌బర్డ్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఓ మెటల్ టర్న్ సిగ్నల్ అతని భుజంలో ఇరుక్కుని, ఇరిగి పోయింది.

ఈ విషయాన్ని ఆర్థర్ కూడా గుర్తించలేదు, కాల క్రమంలో అది అతని శరీరంలోనే ఉండిపోయి, దాని చర్మం కప్పేసింది. ఆ సమయంలో వైద్యులు కూడా విరిగిపోయిన అతని వెన్నెముకపైనే శ్రద్ధ చూపారు కానీ, ఈ విషయాన్ని పట్టించుకోలేదు.

Arthur Lampitt

సుమారు పదేళ్ల క్రితం ఆర్థర్ ఈ విషయాన్ని గుర్తించారు. ఆర్థర్ ఓ కోర్ట్‌హౌస్ మెటల్ డిటెక్టర్ గుండా వెళ్లినప్పుడు బీప్ బీప్ మనే శబ్ధం వచ్చింది. ఆ శబ్ధం ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. బహుశా అది 1963 యాక్సిడెంట్‌కి సంబంధించినదేమోనన్న సందేహం వచ్చింది.

దీంతో ప్రమాదానికి గురైన అతని ఫోర్డ్ థండర్‌బర్డ్ కారు ఫొటోలను తిరగేసి చూడగా, స్టీరింగ్ పక్కనే ఉండాల్సిన టర్న్ ఇండికేటర్ సిగ్నల్ స్టాక్ కనిపించలేదు. అంతేకాకుండా, అతని భుజం కూడా కొంత కాలంగా నొప్పిగా ఉన్నట్లు ఆర్థర్‌కి అనిపించింది.

దీంతో వైద్యులని సంప్రదించిన ఆర్థర్‌కి అసలు విషయం తెలిసింది. వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు చికిత్స చేసి దాదాపు 7 ఇంచ్‌లు పొడవు ఉండి, కొద్దిగా వంగి, తుప్పు పట్టి ఉన్న మెటల్ షాఫ్ట్‌ను బయటకు తీశారు. శరీరంలో ఈ మెటల్ భాగం చుట్టూ ప్రొటెక్టివ్ పాకెట్ ఏర్పడిందని, అందుకే ఈ విషయాన్ని ఆర్థర్ గుర్తించలేకపోయాడని వైద్యులు చెప్పారు.

ఏదైతేనేం.. మొత్తానికి ఆర్థర్ కథ సుఖాంతమైంది. కాగా.. తన శరీరం నుంచి తొలగించిన ఆ మెటల్ పార్టును వీలైతే కీచైన్‌గా మార్చుకుంటానని లేదంటే ఇలాంటి వస్తువులను కలెక్షన్‌గా సేకరించే తనకు శస్త్రచికిత్స చేసిన వైద్యునికే ఇచ్చేస్తానని చెప్పారు.

Most Read Articles

English summary
This is the story of Mr. Arthur Lampitt who lived for 51 years with a metal turn signal inside his arm. The part protruded his skin back in 1963, when the man, working as a real estate agent, had a crash in his Ford Thunderbird.
Story first published: Monday, January 5, 2015, 15:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X