నేతాజీ బ్రిటీష్ పాలకుల బానిసత్వం నుండి తప్పించుకుంది ఈ కారులోనే

By Anil

యావత్ భారత దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న నేపథ్యంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోష్ గారిని బ్రిటీష్ పాలకులు గృహం నిర్బందం చేశారు. 1941 లో అతను బంధీగా ఉన్న గృహం నుండి బయటపడటానికి మారువేషంలో తప్పించుకుని బ్రిటీష్ ప్రభుత్వానికి చుక్కలు చూపించాడు.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

ఆ తరువాత భారత దేశపు స్వాతంత్రపు పోరాటం బాగా ఊపందుకుంది. అదే సమయంలో సుభాష్ చంద్రబోష్ 1942 లో ఇండియన్ నేషనల్ ఆర్మీ (NIA)ని స్థాపించారు. ఆ తరువాత కాలంలో బ్రిటీష్ పాలకులు చంద్రబోష్ గారిని కలకత్తాలోని తన పూర్వీకుల ఇంటిలో బంధించారు. ఇప్పుడు ఆ చారిత్రాక కారును కూడా అక్కడే భద్రపరిచారు.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

బ్రిటీష్ పాలకుల్లో బంధీగా ఉన్న నేతాజీ అక్కడ నుండి తప్పించుకోవడానికి తన అన్నయ్య కుమారుడు సహాయంతో మారు వేషం ధరించి ఆడి కారులో అక్కడ నుండి బయటపడ్డాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలను ప్రారంభించాడనే నెపంతో నేతాజీని బంధించారు.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

నేతాజీ సుభాష్ చంద్రబోష్ గారి జీవిత చరిత్రలో అత్యంత ముఖ్యమైన సందర్భం బ్రిటీష్ బానిసత్వం నుండి బయటపడటం. ప్రస్తుతం ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలోని కమో అనే ప్రదేశానికి కలకత్తా నుండి పారిపోయాడు. అపుడు నేతాజీ గారి అన్న కుమారుడే కారును నడిపారు.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

బ్రిటీష్ పాలకుల బానిస్వత్సం నుండి తప్పించుకునే సందర్భంలో నేతాజీ వినియోగించిన కారు నెంబర్ బిఎల్ఎ 7169 గా ఉంది. కలకత్తాలోని నేతాజీ పూర్వీకుల గృహం నేతాజీ భవన్‌లో దీనిని భద్రపరిచారు. ఆ తరువాత 1971 లో తీసిన డాక్యుమెంటరీ చిత్రంలో ఈ కారును చూపించారు.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

నేతాజీ గారు వినియోగించిన కారును అద్దాల గదిలో ఉంచారు. ఆ తరువాత కొద్ది రోజులకు సందర్శకులను రాకుండా చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోష్ పరిశోధనా స్థానాన్ని నేతాజీ కుటుంబ సభ్యులు నెలకొల్పడం జరిగింది.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

ఈ కారు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటున్న నేపథ్యంలో నేతాజీ కుటుంభ సభ్యులు దానిని సర్వీసింగ్ చేయించనున్నారు. అందు కోసం ఖరీదైన కార్ల తయారీ సంస్థ ఆడి ఈ కారుకు రీ పెయింటింగ్ చేసి పూర్తి స్థాయిలో సర్వీసింగ్ చేయడానికి ముందుకు వచ్చింది.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

సమస్యాత్మంగా ఉన్న పనికిరాని విడి పరికరాలను మార్చే పనిలో ఆడి నిమగ్నమయ్యింది. పూర్తి స్థాయిలో ఆధునీకరణకు సిద్దమయ్యింది. పెయింటింగ్ కూడా మార్చనున్నారు.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

వచ్చే డిసెంబర్ నాటికి దీని ఆధునీకరణ పనులను పూర్తి చేయనున్నారు. అయితే దీని పట్ల నేతాజీ మేనల్లుడు మాట్లాడుతూ ఈ కారును ఆధునీకరిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. అంతే కాకుండా దీని ఆధునీకరణ పూర్తయిన తరువాత సందర్శించాలనుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

నేతాజీ రీసెర్చ్ బ్యూరో కు సెక్రెటరీగా వ్యవహరిస్తున్న కార్తీక్ చక్రబొర్తీ మాట్లాడుతూ, దీని ఆధునీకరణ పనులు పూర్తయిన తరువాత ఈ కారును 100 లేదా 200 మీటర్ల పాటు నడపాలని ఉన్నట్లు తెలిపాడు.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

నేతాజీ 1930 నుండి 1941 మధ్య కాలంలో వినియోగించిన ఈ కారును 1896 స్థాపించబడిన జర్మనీకి చెందిన సంస్థ తయారు చేసింది. ఈ సంస్థ ఇప్పుడు సైకిళ్లను , ద్విచక్ర వాహనాలను, వ్యాన్లను మరియు కార్లను ఉత్పత్తి చేస్తోంది.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

నేతాజీ వినియోగించిన వాటెరర్ డబ్ల్యూ24 కారులో 4 నాలుగు సిలిండర్లు గల 1.8-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండేది. ఇది సుమారుగా 42పిఎస్ పవర్‌ను ఉత్పత్తి చేయును. ఇందులోని ఇంజన్‌కు 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసారు.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

ఈ కారులో నలుగురు కూర్చుని ప్రయాణించే సౌకర్యం కలదు. ఇది రెండు మరియు నాలుగు డోర్ల ఆప్షన్‌లో అప్పట్లో అమ్మకాల్లో ఉండేది. ప్రపంచ వ్యాప్తంగా నేతాజీ గారు వినియోగించినటువంటి వాటెరర్ డబ్ల్యూ24 కార్లు 23,000 వరకు ఉన్నట్లు సమాచారం.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు
  • ప్రపంచ చరిత్రలో ఎన్నికల ప్రచారానికి మొదటి సారిగా విమానాన్ని వినియోగించిన నాయకుడు
  • ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే లైసెన్స్ లేకుండానే డ్రైవింగ్ చేయవచ్చు
  • .

    కారు ఇన్సూరెన్స్‌లో పాత విధానాన్ని ఫాలో అవుతున్నారా ? అయితే నష్టపోయినట్లే..! మీ కోసం కొత్త విధానం

Most Read Articles

English summary
Read in Telugu: Car used by Netaji being restored by family.
Story first published: Saturday, September 10, 2016, 11:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X