కార్ పార్ట్స్ విషయంలో మీరు ఎక్స్‌పైరీ డేట్ చూస్తున్నారా?

ఎక్స్‌పైరీ డేట్ (గడువు ముగిసే తేది) అనేది మనం ఉపయోగించే ఏ వస్తువుకైనా చాలా ముఖ్యమైనది. సదరు వస్తువు గడువు తేది ముగిసిన తర్వాత ఆ వస్తువును వినియోగించడం ప్రమాదకరం. ఉదాహరణకు మనం ఉపయోగించే మెడిసన్స్ నుంచి వంటకు ఉపయోగించే మాసాలల వరకు అన్నింటి విషయంలో ఎక్స్‌పైరీ డేట్‌ను ఒకటి రెండు సార్లు చూసిన తర్వాతనే కొనుగోలు చేస్తుంటాం.

ఇది కూడా చదవండి: టైర్ల గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు

అలాగే.. మనకు రవాణా అవసరాలు అందించే ఆటోమొబైల్స్‌లో ఉపయోగించే విడిభాగాలకు కూడా గడువు తేది ఉంటుంది. కాలం చెల్లిపోయిన విడిభాగాలను ఉపయోగిస్తే, అందుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. మనలో కొంతమందికి ఇలాంటి విడిభాగాలను కొనుగోలు చేసే టప్పుడు వాటి ఎక్స్‌పైరీ డేట్‌ను చెక్ చేసే అలవాటు ఉండదు.

కొన్ని వాహన విడిభాగాలను తయారు చేసిన నిర్ధిష్ట సమయం వరకు మాత్రమే ఉపయోగించాలి. తయారైన ఎక్కువ కాలం వాడకుండా నిల్వఉండి, కాలం చెల్లిపోయిన తర్వాత వాటిని ఉపయోగించకూడదు. మరి ఏయే విడిభాగాల విషయంలో ఎక్స్‌పైరీ డేట్‌ను చెక్ చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

టైర్లు

టైర్లు

టైర్లకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా? టైర్లను ప్రతి ఆరేళ్లకు ఒకసారి చొప్పున మార్చాలి. మినిమం థ్రెడ్ డెప్త్ 3 మి.మీ. ఉండాలి. టైరు బయటి వైపు ఉండే డాట్ (DOT - డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్) నెంబర్ టైరు తయారైన వారం, సంవత్సరాన్ని వెల్లడిస్తుంది. ఉదాహరణకు టైరుపై డాట్ నెంబర్ 3909 అని ఉంటే, ఆ టైరును 39వ వారం, 2009వ సంవత్సరంలో తయారు చేశారని అర్థం

క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్

క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్

క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ జీవితకాలం అనేది కారు తిరిగే ప్రాంతంలో ఉండే గాలి నాణ్యతను బట్టి ఉంటుంది (ఇది ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది). వాస్తవానికి ఎయిర్ ఫిల్టర్‌ను ప్రతి 25,000 కిలోమీటర్ల నుంచి 30,000 కిలోమీటర్ల మధ్యలో మార్చాల్సి ఉంటుంది. దీని రీప్లేస్‌మెంట్‌ను ఖచ్చితంగా తెలుసుకోవాలంటే, కారులో డిఫ్రోస్ట్ ఆన్ చేసిన తర్వాత, క్యాబిన్‌లో గాలి ప్రవాహం చాలా తక్కువగా ఉంటే, ఎయిర్ ఫిల్టల్ రీప్లేస్ చేయాలని అర్థం. అలాగే బ్లోయెర్ స్విచ్ ఆన్ చేసి హైస్పీడ్‌లో ఉంచిన తర్వాత శబ్ధంగా ఎక్కువగా వచ్చి, గాలి తక్కువగా ఉన్నట్లనిపిస్తే, ఎయిర్‌ఫిల్టర్‌ను తప్పనిసరిగా మార్చాలని గుర్తుంచుకోండి.

ఇంజన్ ఆయిల్

ఇంజన్ ఆయిల్

ఇంజన్ ఆయిల్‌కి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. వాస్తవానికి ఇంజన్ ఆయిల్‌ను తయారీదారు నిర్దేశించిన సమయం ప్రకారం మార్చాలి. కానీ సాధారణంగా 12-18 నెలలు లేదా ప్రతి 10,000 కిలోమీటర్లకు ఒకసారి చొప్పున ఇంజన్ ఆయిల్ మార్చుతూ ఉంటాం. ఇంజన్ ఆయిల్ స్థాయి తక్కువగా ఉంటే, భవిష్యత్తులో ఇంజన్‌లో తీవ్రమైన సమస్యల తలెత్తే ఆస్కారం ఉంటుంది.

ఎయిర్ ఫిల్టర్

ఎయిర్ ఫిల్టర్

ఎయిర్ ఫిల్టర్‌‌ను ప్రతి 20,000 కిలోమీటర్లు ఒకసారి చొప్పున లేదా ప్రతి ఏడాదికి ఒకటి చొప్పున (ఏది ముందైతే అది) మారుస్తూ ఉండాలి. దీని ఎక్స్‌పైరీ డేట్‌ను మ్యాన్యువల్‌పై నమోదు చేసి ఉంటుంది లేదంటే డీలర్‌ను అడిగినా తెలుస్తుంది.

బ్రేక్ ఆయిల్

బ్రేక్ ఆయిల్

సేఫ్టీ విషయంలో బ్రేకులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి బ్రేక్ ఆయిల్ విషయంలో అత్యంత ప్రాధాన్యత అవసరం. బ్రేకింగ్ సిస్టమ్‌ను ప్రతి 10,000 కిలోమీటర్ల తర్వాత తనిఖీ చేసుకుంటూ, సరైన మెయింటినెన్స్ చేసుకుంటుండాలి. కానీ బ్రేక్ ఆయిల్ కంటైనర్‌లోని ఆయిల్ కలర్ నలుపు రంగులోకి మారినా లేదా చిక్కగా అయినా, దాని అర్థం మీరు తక్షణమే బ్రేక్ ఆయిల్ మార్చాలి. లేకుంటే, బ్రేకింగ్ పవర్ తగ్గిపోయే ఆస్కారం ఉంది.

ఏసి రిఫ్రిజిరెంట్

ఏసి రిఫ్రిజిరెంట్

సాధారణంగా, సంవత్సరానికి ఒకసారి చొప్పున కార్ ఎయిర్ కండిషన్ సిస్టమ్‌ను చెక్ చేసుకోవాలి. కారులో ఏసి ఆన్ చేసినప్పుడు ఏసి వెంట్స్ నుంచి వచ్చే గాలి చల్లగా లేకపోయినా లేక ఉండాల్సిన చల్లదనం కన్నా తక్కువగా ఉన్నా వెంటనే ఏసి గ్యాస్‌ను రీచార్చ్ చేసుకోవాలి.

టైమింగ్ బెల్ట్

టైమింగ్ బెల్ట్

కార్ మ్యాన్యుఫాక్చరర్, కార్ మోడల్‌ను టైమింగ్ బెల్ట్‌ను మార్చే సమయం మారుతూ ఉంటుంది. సాధారణంగా 60,000 కిలోమీటర్ల నుంచి 80,000 కిలోమీటర్ల మధ్యలో దీనిని మార్చాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని కార్ మ్యాన్యువల్‌లో కూడా పేర్కొని ఉంటుంది. ఫాల్టీ బెల్ట్‌ను ఉపయోగిస్తే, ఇంజన్ సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంజన్ వాల్వ్, పిస్టన్స్ కూడా ప్రభావితమైన, భారీ రిపేరు ఖర్చు కావచ్చు.

చైల్డ్ సీట్స్

చైల్డ్ సీట్స్

చైల్డ్ సీట్స్ జీవితకాలం ఉండేలా తయారు చేయబడవు, వీటిని కొంత కాలం వరకు మాత్రమే ఉపయోగించాలి. ఇవి కొంత కాలం తర్వాత పహుళ్లు రావటం, సీట్ బెల్టులు సాగిపోవటం వంటివి జరిగే ఆస్కారం ఉంది. అనేక రకాల చైల్డ్ సీట్లపై ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. సాధారణంగా, తయారైన 6 ఏళ్ల తర్వాత వీటికి కాలం చెల్లిపోతుంది.

ఎయిర్ బ్యాగ్స్

ఎయిర్ బ్యాగ్స్

ఎయిర్‌బ్యాగ్స్ మరియు సీట్ టైట్‌నర్స్‌ను ప్రతి 10-15 ఏళ్లకు ఒక్కసారి చొప్పున మారుస్తూ ఉండాలి. ఒకవేళ బెల్టులపై ఏదైనా సందేహం వచ్చినా, అవి తెగిపోయినట్లు/పాడైపోయినట్లు అనిపించినా వాటిని తక్షణమే మార్చేయాలి.

ఫైర్ ఎక్స్టింగ్విషర్

ఫైర్ ఎక్స్టింగ్విషర్

ఫైర్ ఎక్స్టింగ్విషర్‌లను ప్రతి 2-3 ఏళ్లకు ఒక్కసారి చొప్పున మార్చుతూ ఉండాలి. కాలం చెల్లిపోయిన ఫైర్ ఎక్స్టింగ్విషర్ వేడిగా ఉండే క్యాబిన్‌లో లీక్ అయ్యే ఆస్కారం ఉంటుంది, ఫలితంగా దీని సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.

పంక్చరీ సీలెంట్

పంక్చరీ సీలెంట్

పంక్చర్ సీలెంట్ తయారైన సంవత్సరం నుంచి 3-8 ఏళ్ల కాలంలో ఎక్స్‌పైరీ అవుతుంది. ఒకవేళ ఈ బాటిల్‌ను ఓపెన్ చేసి, సగం ఉపయోగించి సగం అలానే ఉంచినట్లయితే, బాటిల్‌లో మిగిలిన సమయం త్వరగా ఎక్స్‌పైర్ అయ్యే ప్రమాదం ఉంది.

ఫస్ట్ ఎయిడ్ కిట్

ఫస్ట్ ఎయిడ్ కిట్

అన్ని కార్లలో ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తుంటారు. ఇందులో కొన్ని ఆయింట్‌మెంట్స్‌తో పాటు ప్రథమ చికిత్స సంబంధించిన వైద్య వస్తువులు ఉంటాయి. వీటిపై ఎక్స్‌పైరీ డేట్‌ను చూసిన తర్వాత మాత్రమే వాటిని వినియోగించాలి, కాలం చెల్లిపోయిన వస్తువులతో కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

Most Read Articles

English summary
Most of us do not have the habit of checking the date of manufacture or expiry date of what we buy. Believe it or not! expiry date is also applicable to a few car parts. Like most manufactured items, a few car parts can be used only for a certain period after which they might not function properly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X