లండన్‌కు మొదటి సరకు రవాణా రైలును ప్రారంభించిన చైనా

చైనా నుండి సుమారుగా 12,000 కిలోమీటర్ల దూరం గల లండన్‌కు గూడ్స్ రైలు సర్వీస్ ను ప్రారంభించింది. ఈ మార్గంలో అనేక దేశాలతో చైనా వాణిజ్య వ్యాపారాలను సాగించనుంది.

Written By:

చైనా చవక ఉత్పత్తులు ప్రపంచంలో ఏ మూలకెళ్లినా దర్శనమిస్తాయి. అయితే ఇప్పటికే కొన్ని దేశాలు చైనా ఉత్పత్తులను బహిష్కరించడం ప్రారంభించాయి. కాని చైనా మాత్రం ప్రపంచ దేశాలకు తమ ప్రొడక్ట్స్‌ను ఎగుమతి చేయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఎగుమతులను మెరుగుపరిచే క్రమంలో చైనా నుండి సుమారుగా 12,000 కిలోమీటర్ల దూరం గల లండన్‌కు గూడ్స్ రైలు సర్వీస్ ను ప్రారంభించింది. ఈ మార్గంలో అనేక దేశాలతో చైనా వాణిజ్య వ్యాపారాలను సాగించనుంది.

జనవరి 2, 2017 న చైనా లో గల అంతర్జాతీయ వస్తు ఎగుమతుల కేంద్రం యివు లోని జెజియాంగ్ ప్రావిన్స్ నుండి ఈ రైలు సేవలు ప్రారంభించింది.

చైనా రైల్వే కార్పోరేషన్ ప్రకారం ఈ రైలు బ్రిటన్ లోని గమ్యస్థానాన్ని చేరుకోవడానికి సుమారుగా 12,000 కిలోమీటర్లకు పైగా 18 రోజులు పాటు ప్రయాణించాల్సి ఉంటుంది.

చైనా లోని "యివు" ప్రాంతం చిన్న చిన్న వస్తువుల తయారీ మరియు ఎగుమతులకు ప్రసిద్దిగాంచింది. ఇక్కడి నుండి గృహోపకరణాలు, వస్త్రాలు, బ్యాగులు మరియు సుట్ కేసులు అధికంగా ఎగుమతి అవుతుంటాయి.

చైనా నుండి ప్రారంభమైన ఈ గూడ్స్ రైలు కజకిస్తాన్, రష్యా, బెలారస్, పోలాండ్, జర్మనీ, బెల్జియమ్ మరియు ఫ్రాన్స్ మీదుగా లండన్ ను చేరుకుంటుంది.

చైనా-యూరోప్ మధ్య సరకు రవాణా కోసం గల రైల్వే సర్వీసుల్లో లండన్ ఇప్పుడు 15 వ ప్రధాన నగరంగా ఉంది. చైనా మరియు బ్రిటన్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో పశ్చిమ యూరోప్‌లో వాణిజ్య సంభందాలు మరింత బలపడనున్నాయి.

ఆసియా, యూరోప్ మరియు ఆఫ్రికా మధ్య నిర్మాణాత్మకంగా మెరుగైన రవాణా నెట్‌వర్క్ కలిగి ఉంటే వాణిజ్యపరమైన రైల్వే సేవలను విస్తరించేందుకు సిద్దంగా ఉన్నట్లు చైనా రైల్వే కార్పోరేషన్ తెలిపింది.

ఆసియా, యూరోప్ మరియు ఆఫ్రికా లోని వివిధ దేశాలకు చైనా నుండి గూడ్స్ రైల్వే సేవలను విస్తరిస్తే చైనా ఆర్థికంగా బలపడటం ఖాయం.

ఇండియాలో బుల్లెట్ రైళ్ల తయారీకి టాల్గొ రెడీ...!!
మేకిన్ ఇండియా" చొరవతో దేశీయంగా బుల్లెట్ రైళ్ల తయారీకి స్పానిష్‌కు చెందిన ప్రముఖ రైళ్ల తయారీ సంస్థ టాల్గొ సముఖత వ్యక్తం చేసింది. అత్యంత వేగంగా ప్రయాణించే టాల్గొ రైళ్ల గురించి పూర్తి వివరాలు.

ఒక్కసారిగా నుజ్జునుజ్జయిన 120 BMW కార్లు: వీడియో
బవేరియన్ మోటార్ వర్క్స్ (BMW) కు చెందిన సుమారుగా 120 కార్లు నుజ్జునుజ్జయిపోయాయి. అమెరికా నుండి అంతర్జాతీయ మార్కెట్‌కు వీటిని రైలులో ఎగుమతి చేస్తుండగా రైలు పట్టాలు తప్పి ఈ ప్రమాదం జరిగింది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
China Flags Off First Goods Train To London
Please Wait while comments are loading...

Latest Photos