ఇప్పట్లోనే కాదు పురాతణ కాలంలో కూడా వాహన దారులను చూసి విస్తుపోయారు

By Anil

ఆటోమొబైల్స్ ప్రాణం పోసుకున్నప్పటి నుండి వాహన ప్రపంచంలో ప్రమాదాలు అనేవి పరిపాటిగా మారిపోయాయి. ఈ కాలంలో పేపర్ తిరగేసిన చానెళ్లు మార్చేసినా ఖచ్చితంగా ప్రమాదాలకు సంభందించి ఏదో ఒక కథనం వస్తూనే ఉంటుంది. అయితే పురాతణ కాలంలో కూడా ఇదే తరహా ప్రమాదాలు చోటు చేసుకునేవి.

బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో ఉన్న ప్రమాదాలకు సంభందించిన ఫోటోలను ప్రఖ్యాత ఇంగ్లీష్ వార్తా పత్రిక బోస్టన్ హెరాల్డ్-ట్రావెలర్ లో పనిచేసిన లెస్లీ జొన్నస్ అనే ఛాయాగ్రహుడు తీసిన ఫోటోలు....

ఈ కాలంలోనే కాదు, ఆ కాలంలో కూడా వీటిని చూసి విస్తుపోయారు

లెస్లీ 1917 నుండి 1956 వరకు ఈ పత్రికకు ఫోటోగ్రాఫర్‌గా పనిచేశాడు. 1920 ల కాలంలో అప్పుడప్పుడే వాహన ప్రపంచం అభివృద్ది చెందుతుండేది. అయితే అభివృద్దితో పాటు ప్రమాదాలు కూడా అదే రీతిలో చోటుచేసుకునేవి.

ఈ కాలంలోనే కాదు, ఆ కాలంలో కూడా వీటిని చూసి విస్తుపోయారు

అందులో 1920 నుండి 1930 ల మధ్య కాలంలో అప్పట్లో అందరినీ విస్తుపరిచిన ప్రమాదాలను లెస్లీ తన కెమెరాలో బంధించాడు. తరువాత స్లైడర్లలో వాటి గురించి చూద్దాం రండి.

ఏడు టన్నుల డంప్ ట్రక్

ఏడు టన్నుల డంప్ ట్రక్

బోస్టన్‌లోని వారెన్ అవెన్యూ బ్రిడ్జి మీద ఈ ఏడు టన్నుల డంప్ ట్రక్ ఇలా కూలబడిపోయింది. ఈ సమయంలో లెస్లీ కమెరాలో చిక్కుకున్న ఫోటో.

సూసైడ్ చేసుకుంటున్న ట్రక్

సూసైడ్ చేసుకుంటున్న ట్రక్

దీనిని చూడగానే ఎవరో సూసైడ్ చేసుకుంటున్నట్లు ఉంది కదూ. కాని బోస్టన్‌లోని ఈ బిల్టింగ్‌లో ఉన్న కారు ఇలా అదుపు తప్పి సగం బయటకు, సగం లోపలకు ఉండిపోయింది.

మంచు ముక్కల్లో కూరుకుపోయిన కారు

మంచు ముక్కల్లో కూరుకుపోయిన కారు

బోస్టన్‌లో ఉన్న ఒక మంచు ప్రదేశంలో కారు ఇలా కూరుకుపోయినపుడు లెస్లీ తీసిన చిత్రం ఇది. లెస్లీ ప్రమాదాన్ని మాత్రమే కాదు అందులో ఉండే అసాధ్యాలను కూడా ఫోటో తీయగలడు. ఈ ఫోటోలో ఉన్న పోలీస్ మంచు ముక్కల్లోకి దిగబడిన కారును లాగుతూ ఒంటరి పోరాటం చేస్తున్నాడు చూడండి. ఇది నిజంగానే అసాధ్యం.

విడదీయరాని బందం

విడదీయరాని బందం

ఏ కోణం నుండి వచ్చి ఢీ కొడితే ఇలా కారు మధ్యలోకి చెట్టు వస్తుందో అని ఆశ్చర్యంగా ఉంది కదా.

నీటితో ఆటలా...?

నీటితో ఆటలా...?

ఈ కారు ఇలా ఎంత సేపని నిల్చుంటుంది అని అందరికీ అనుమానం కలుగుతుంది. కాని నిజం ఏంటంటే అప్పట్లో ప్రమాదం జరిగిన తరువాత ఇదిగో ఇలా నిటారుగా నిల్చుండిపోయిందట.

అత్యుత్సాహం అందుకే పనికిరానిది

అత్యుత్సాహం అందుకే పనికిరానిది

ఇంటిలో ఉన్న పేషెంట్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి రోడ్డు మీద నుండి గుమ్మం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదిగో ఇలా ఈ కారు గ్యారేజ్‌కు వెళ్లవలసి వచ్చింది.

మెట్లు దిగిన కారు

మెట్లు దిగిన కారు

1930 ల కాలంలో కార్లలో అప్పుడప్పుడే నూతన ఫీచర్లు కొత్త పుంతలు తొక్కాయి. అందులో హైడ్రాలిక్ బ్రేక్‌లు ఒకటి. ఒక డ్రైవర్ కారును అదుపుచేయడానికి బ్రేకులు అని యాక్సిలరేటర్‌ను తొక్కేశాడు. చివరికి ఇదిగా ఇలా ఆపాడు.

కార్లు కూడా ఈతకు వెళతాయా..?

కార్లు కూడా ఈతకు వెళతాయా..?

లెస్లీకు జర్నలిస్ట్ కన్నా ఫోటోగ్రాఫర్ కావడమే ఎక్కువ ఇష్టం. అందుకే కాబోలు నీట మునిగిన కారుతో పాటు అక్కడ ఉన్న ప్రజలు, పోలీసులు మరియు విపత్తు అధికారులు అంతా కలిసి ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తిని ఎలా రక్షిస్తున్నారో అనే దానిని కూడా ఒకే చిత్రంలో బంధించాడు.

లిమిటెడ్ ఎడిషన్ పోస్టల్ సర్వీస్

లిమిటెడ్ ఎడిషన్ పోస్టల్ సర్వీస్

అప్పట్లో పోస్టల్ సర్వీసుల కోసం కూడా వాహనాలను వినియోగించే వారు అని దీనిని చూస్తే తెలుస్తుంది. పోస్టల్ వాహనం ప్రమాదం జరిగినపుడు లెస్లీ తీసిన చిత్రం.

కారులో నుండి ఎగజిమ్ముతున్న నీరు

కారులో నుండి ఎగజిమ్ముతున్న నీరు

లెస్లీ తాను తీసే ఫోటోలలో నిజం స్పష్టంగా కనిపించాలని కోరుకుంటాడు. దీనిని చూడండి ఒక డ్రైవర్ కారును ఫైర్ వాహనానికి నీటిని నింపే పైపును ఢీ కొట్టాడు. ఇంకే మందు ఇతని కారణంగా ట్యాంకులోకి వెళ్లాల్సిన గంగ రోడ్డు మీదకు వచ్చింది. అయితే దీని కారణం ఈ కారే అని స్పష్టంగా తెలిపేలా ఫోటో తీశాడు లెస్లీ.

మరిన్ని కథనాల కోసం...

బొగ్గు గనులలో బయల్పడిన రహస్యమైన కార్లు అవశేషాలు

గగన తలం నుండి ప్రచారం నిర్వహించిన ఎన్నికల మొదటి రాజకీయ వేత్త

Most Read Articles

English summary
Classic Accidents From The Golden Era Of 1930s [Images]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X