కాఫీతో నడిచే కార్లు వస్తున్నాయ్..

By Ravi

చాలా మందికి పొద్దున నిద్ర లేవగానే కాఫీ తాగకపోతే ఏ పని చేయాలనిపించదు. పొద్దున్నే కాఫీ పడకపోతే బండి నడవదని కొందరు అనడాన్ని మనం వినే వింటాం. మనిషి మాటేమో కానీ, ఇకపై కాఫీ పడకపోతే మీ కారు కూడా ముందుకు నడవదు. చిత్రంగా ఉంది కదూ.. అవును పెట్రోల్, డీజిల్‌కు కాఫీతో నడిచే కారును అభివృద్ధి చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

యూనివర్సిటీ ఆఫ్ బాత్‌కు చెందిన పరిశోధకులు ఇటీవలే పనికిరాని కాఫీ విత్తనాల నుంచి బయో ఇంధనం తయారు చేయటంపై పరిశోధన ప్రారంభించారు. ఇలా ఉత్పత్తి అయిన బయో ఇంధనాన్ని కార్లలో ఇంధనంగా ఉపయోగిస్తారు. కాఫీ విత్తనాల నుండి గ్రహించిన నూనెను ఆర్గానిక్ సాల్వెంట్‌లో నానబెట్టడం ద్వారా కాఫీ ఇంధనం తయారవుతుంది.

ఈ ప్రత్యేక రసాయన ప్రక్రియను 'ట్రాన్సెస్టెరిఫికేషన్' అంటారు. ఉపయోగించే కాఫీ విత్తనాలను బట్టి తుది ఉత్పత్తి ఇంధన లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. అయితే, పరిశోధకులు మాత్రం అన్ని కాఫీ విత్తనాలు వాటి మూలంతో సంబంధం లేకుండా సంబంధిత భౌతిక లక్షణాల ద్వారా ఒకే ప్రమాణాన్ని కలిగి ఉంటాయని వారు గుర్తించారు.

Coffee

ఈ అధ్యయనంలో భాగంగా, పరిశోధకులు ప్రపంచంలోని 20 విభిన్న ప్రాంతాల్లో ఉత్పత్తి చేయబడిన కాఫీ విత్తనాల నుండి విజయవంతంగా బయోఫ్యూయెల్ (జీవఇంధనాన్ని) తయారు చేయగలిగారు. ఇందులో కెఫినేటెడ్, డీకెఫినేటెడ్, రోబస్టా, అరాబికా వెరైటీలు కూడా ఉన్నాయి. వోరాడ్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్, కెమికల్ ఇంజనీరింగ్ డా. క్రిస్ చుక్ తెలిపిన సమాచారం ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8 మిలియన్ టన్నుల కాఫీ ఉత్పత్తి అవుతుందని, అందులో వృధా అయ్యే విత్తనాలలో దాదాపు 20 శాతం వరకు చమురు ఉంటుందని వివరించారు.

ప్రస్తుతం జీవఇంధనాన్ని తయారు చేస్తున్న ఫీడ్‌స్టాక్‌కు అవసరమైన లక్షణాలనే ఈ చమురు కూడా కలిగి ఉంటుందని ఆయన చెప్పారు. ఇతర ఉత్పత్తులను కేవలం బయోఫ్యూయెల్ కోసమే తయారు చేస్తుంటే, దీనిని మాత్రం కాఫీ వేస్ట్ నుంచి తయారు చేయవచ్చని తెలిపారు. వీటిని ఉపయోగించి సెకండ్ జనరేషన్ బయోఫ్యూయెల్‌ను తయారు చేసేందుకు పటిష్టమైన అవకాశం ఉందని క్రిస్ చుక్ చెప్పారు.

ప్రతి కాఫీ షాపు సగటున రోజుకు 10 కేజీల కాఫీ వ్యర్థాన్ని తయారు చేస్తుంది, ఈ వ్యర్థంతో సుమారు రెండు లీటర్ల బయో ఇంధనాన్ని తయారు చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కాఫీ వ్యర్థాలను చెత్తబుట్టలో పారేయటానికి బదులుగా, దానిని బయోడీజిల్‌గా మార్చి, అలా మార్చిన ఇంధనాన్ని వాహనాల్లో ఉపయోగించుకోవటం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చని వారు చెబుతున్నారు.

ఇదే గనుక పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే స్టార్‌బక్స్, కాఫీ బీన్ (మనకైతే మినర్వా, కెఫె కాఫీ డే, భరిస్తా) సంస్థలు కాఫీతో పాటుగా కాఫీ ఇంధనాన్ని కూడా విక్రయించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరేమంటారు..?

Most Read Articles

English summary
We have heard about hydrogen powered cars, but how about coffee powered cars? Yes coffee, that very drink which gets your day started. Scientists claim green biofuel can be extracted from waste coffee grounds.
Story first published: Wednesday, July 9, 2014, 18:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X