ఒక కారు కొనడానికి నాలుగు కార్లలో వచ్చాడు!

By Ravi

కొందరికి స్టాంప్ కలెక్షన్ హాబీ, మరికొందరికి కాయిన్ కలెక్షన్ హాబీ. కానీ, ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తికి మాత్రం ఫెరారీ కార్ కలెక్షన్ అంటే హాబీ. బ్రిటన్‌కు ప్రాపర్టీ ఎంటర్‌ప్రెన్యూర్ మరియు ప్రముఖ ఫెరారీ కలెక్టర్ జాన్ హంట్ వద్ద పలు ఫెరారీ కార్లు ఉన్నాయి. ఆయన కలెక్షన్‌లో ఫెరారీ 288 జిటిఓ, ఫెరారీ ఎఫ్40, ఫెరారీ ఎఫ్50 మరియు ఫెరారీ ఎన్జో లిమిటెడ్ ఎడిషన్ సూపర్‌కార్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: టాప్ 10 స్టోరీల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి

కాగా.. ఇతను తాజాగా తన కలెక్షన్‌లోకి లేటెస్ట్‌గా విడుదలైన లాఫెరారీ హైపర్ కారును చేర్చుకున్నాడు. అయితే, జాన్ హంట్ ఫెరారీ లాఫెరారీ కారును డెలివరీ తీసుకునేందుకు గాను తన వద్ద ఉన్న ఫెరారీ 288 జిటిఓ, ఫెరారీ ఎఫ్40, ఫెరారీ ఎఫ్50 మరియు ఫెరారీ ఎన్జో లిమిటెడ్ ఎడిషన్ సూపర్‌కార్లతో కాన్వాయ్‌గా రోడ్ ట్రిప్ ప్లాన్ చేసి లండన్ నుంచి మారనెల్లిలోని ఫెరారీ షోరూమ్‌కు వరకు వెళ్లాడు. తన ఇద్దరు కుమారులు, స్నేహితులతో కలిసి ఈ ట్రిప్ ప్లాన్ చేశాడు. ఆ సూపర్‌కార్స్‌పై ఓ కన్నేద్దాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

జాన్ హంట్ ఫెరారీ కార్ కలెక్షన్

తర్వాతి స్లైడ్‌లలో జాన్ హంట్ ఫెరారీ కార్ కలెక్షన్ గురించి తెలుసుకోండి.

జాన్ హంట్ ఫెరారీ కార్ కలెక్షన్

ఫెరారీ కార్లంటే తనకెంతో ఇష్టమని, అల్టిమేట్ స్పోర్ట్స్ కార్ అంటే ఫెరారీయేనని, తాను గత 20 ఏళ్లుగా ఫెరారీ కార్లను డ్రైవ్ చేస్తున్నాని, ఒక్క ఎన్జో కారునే 60,000 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేశానని జాన్ హంట్ చెప్పుకొచ్చాడు.

జాన్ హంట్ ఫెరారీ కార్ కలెక్షన్

లాఫెరారీ కారును తాను ఇప్పుడే కొనుగోలు చేశానని, ఆ కారును ఐదు నిమిషాల పాటు మాత్రమే నడిపినప్పటికీ ఆ డ్రైవింగ్ అనుభూతి అద్భుతంగా ఉందని, ఇదొక అల్టిమేట్ లుకింగ్ స్పోర్ట్స్ కార్ జాన్ చెప్పాడు.

ఫెరారీ 288 జిటిఓ

ఫెరారీ 288 జిటిఓ

ఫెరారీ 288 జిటిఓ కారును 1984 నుంచి 1987 మధ్య కాలంలో తయారు చేశారు. ఈ సమయంలో కేవలం 272 యూనిట్ల ఫెరారీ 288 జిటిఓ కార్లను మాత్రమే తయారు చేశారు. ఫెరారీ 308 జిటిబి (రేస్ వెర్షన్) మోడల్‍‌‌కు ఎగ్జోటిక్ హోమోలోగేషన్‌గా దీనని తయారు చేశారు.

ఫెరారీ ఎఫ్40

ఫెరారీ ఎఫ్40

ఫెరారీ ఎఫ్40 ఓ మిడ్-ఇంజన్, రియర్-వీల్ డ్రైవ్, టూ-డోర్ కూపే బాడీ స్టయిల్ స్పోర్ట్స్ కారు. ఈ కారును 1987 నుంచి 1992 మధ్య కాలంలో ఉత్పత్తి చేశారు. ఫెరారీ 288 జిటిఓ మోడల్‌కు సక్సెసర్‌గా ఈ కారును తయారు చేశారు. ఫెరారీ 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తయారు చేశారు కాబట్టి ఈ మోడల్‌కు ఫెరారీ ఎఫ్40 అనే పేరును పెట్టారు. ఇప్పటి వరకు కేవలం 1315 యూనిట్ల ఫెరారీ ఎఫ్40 కార్లను మాత్రమే ఉత్పత్తి చేశారు.

ఫెరారీ ఎఫ్50

ఫెరారీ ఎఫ్50

ఫెరారీ ఎఫ్50 కూడా మిడ్-ఇంజన్డ్ స్పోర్ట్స్ కారు. ఫెరారీ ఎఫ్50 కారును 1995లో పరిచయం చేశారు. ఇదొక టూ డోర్, టూ సీటర్ రోడ్‌స్టర్. ఈ కారు రూఫ్‌ను తొలగించుకోవచ్చు. 1992 ఫెరారీర ఎఫ్92ఏ ఫార్ములా వన్ కారులో ఉపయోగించిన 3.5 లీటర్ వి12 నుంచి అభివృద్ధి చేసిన 4.7లీ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 60-వాల్వ్ వి12 ఇంజన్‌ను ఫెరారీ ఎఫ్50లో వాడారు. ఫెరారీ తమ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని లిమిటెడ్ ఎడిషన్ ఎఫ్50 అనే స్పోర్ట్స్ కారును ఉత్పత్తి చేసింది. ఇలాంటివి కేవలం 349 కార్లను మాత్రమే ఫెరారీ తయారు చేసింది.

ఫెరారీ ఎన్జో లిమిటెడ్ ఎడిషన్

ఫెరారీ ఎన్జో లిమిటెడ్ ఎడిషన్

ఫెరారీ సంస్థ వ్యవస్థాపకుడు ఎన్జో ఫెరారీ జ్ఞాపకార్థం ఈ కారును తయారు చేశారు. ఇందులో 5998సీసీ అల్యూమినియం వి12 ఇంజన్‌ను ఉఫయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 660 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారును తొలిసారిగా 2002లో ఉత్పత్తి చేస్తారు. ఈ మోడల్‌కు సక్సెసర్‌గా వచ్చినదే లాఫెరారీ. ఫెరారీ ఎన్జో లిమిటెడ్ ఎడిషన్ కేవలం 3.4 సెకండ్ల వ్యవధిలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 217 మైళ్లు.

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీఫెరారీ లాఫెరారీ ఒక హైబ్రిడ్ కారు. ఇది డ్యూయెల్ పవర్ (పెట్రోల్ + బ్యాటరీ)తో పనిచేస్తుంది. ఇందులో 6.3 లీటర్ వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9000 ఆర్‌పిఎమ్ వద్ద 800 హెచ్‌పిల గరిష్ట శక్తిని, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 700 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే ఇందులో అమర్చిన 120 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ 163 హెచ్‌‌పిల గరిష్ట శక్తిని, 270 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్లు రెండు కలిసి గరిష్టంగా 963 హెచ్‌పిల శక్తిని విడుదల చేస్తాయి.

లాఫెరారీ హైపర్‌కారు కేవలం 3 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అలాగే 15 సెకండ్లలో 0-300 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది రిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఫెరారీ నుంచి లభిస్తున్న అత్యంత వేగంతమైన ప్రొడక్షన్ వెర్షన్ కార్లలో లాఫెరారీదే అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు, ఫెరారీ కార్లలో కెల్లా అత్యంత ఖరీదైన కారు కూడా ఇదే. దీని ధర 14 లక్షల డాలర్లు. (మన కరెన్సీలో సుమారు రూ.7 కోట్లకు పైమాటే).

జాన్ హంట్ ఫెరారీ కార్ కలెక్షన్

తన కుటుంబ సభ్యులు, మిత్రులతో ఫెరారీ కలెక్టర్ జాన్ హంట్.

వీడియో

తన ఫెరారీ కార్ కలెక్షన్ గురించి జాన్ చెప్పిన విషయాలను అతని మాటల్లోనే వినండి. ఈ వీడియో చూడండి.


Most Read Articles

English summary
Ferrari owners/fans like to do things a bit differently. British property magnate Jon Hunt, decided to pick up his new 1.8-million La Ferrari by driving down his collection of classic Ferraris from London to Ferrari’s headquarters in Maranello, Italy.
Story first published: Thursday, July 24, 2014, 11:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X