ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య ప్రారంభం కానున్న యుద్దం...!!

By Anil

గల్లీ నుండి ఢిల్లీ దాకా ఎవరినీ అడిగినా చెబుతారు, పాకిస్థాన్ కు, భారత్‌కు మధ్య గల సంబంధ గురించి. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నేటి వరకు భారత్ ఎదుర్కొంటున్న ఏకైక శత్రు దేశం పాకిస్తాన్. కాని భారత్ మరియు పాకిస్తాన్ వారి వారి దేశ ప్రజలను కాపాడుకునే ప్రయత్నంలో తీవ్రమైవ యుద్దాలకు కూడా వెనుకాడటం లేదు. రెండు దేశాలకు మధ్య ఉన్న సరిహద్దు పరిసరాలలో దాడులు పెచ్చులుమీరుతూనే ఉన్నాయి.
Also Read: మానవరహిత రోబో బోటును ప్రారంభించిన ఇజ్రాయెల్: దీనితో ఎప్పటికైన ప్రమాదమే అంటున్న నిపుణులు
ఈ సయంలో, చైనా పాకిస్తాన్‌కు సహాయార్థం జెఎఫ్ 17 ఫైటర్ జెట్ ‌ను తయారు చేసి అందించింది. కాని భారత్ తన సొంత పరిజ్ఞానంతో తేజాస్ ఫైటర్ జెట్‌ను రూపొందించుకుంది. హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ ఈ తేజాస్ ఫైటర్ జెట్‌ను రూపొందించింది. అయితే పాకిస్తాన్ మరియు భారత్‌లు ఒకదానికొటి ఆయుధాల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. రెండు దేశాలు కూడా ఫైటర్ జెట్‌లను సమకూర్చుకుంటున్న నేపథ్యంలో ఇందులో ఏది శక్తివంతమైనది అనే ప్రశ్న మొదలైంది .
Also Read: భారతదేశం యొక్క మొదటి బులెట్ రైలు 'బ్లూ మ్యాప్' ; తెలుసుకోల్సిన 10 విషయాలు
అందుకోసం ఈ రెండింటి మద్య గల శక్తిసామర్థ్యాలను పోల్చి క్రింది కథనం ద్వారా అందివ్వడం జరిగింది. మరి భారత్, పాకిస్తాన్‌లలో ఏది శక్తివంతమైనదో తెలుసుకోండి.

 1.ఈ రెండింటిని పోల్చడానికి కారణం

1.ఈ రెండింటిని పోల్చడానికి కారణం

గత నెలలో బహ్రెయిన్‌లో అంతర్జాతీయ ఎయిర్ షో జరిగింది. దీనిని వేదికగా చేసుకుని భారత్ మొదటి సారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజాస్ ఫైటర్‌ జెట్‌ను ప్రదర్శించింది. భారత్ ఎప్పుడైతే శక్తివంతమైన జెట్ ప్రదర్శించిందో ఈ ప్రదర్శనే మాకు కూడా ఒక ఫైటర్ జెట్ కావాలనే పాకిస్తాన్ ఆలోచనకు పునాది అయ్యింది. అందుకే వీటిని పోల్చడం జరిగింది.

2.చైనా సహకారం

2.చైనా సహకారం

చైనాకు చెందిన చెంగ్ఢు అనే సంస్థ పాకిస్తాన్ కోసం జెఎఫ్17 అనే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌ను తయారు చేసింది. దాదాపుగా 2010 సంవత్సరం నుండి చైనా దేశం పాకిస్తాన్‌కు ఈ ఫైటర్‌ జెట్‌ను అందించే నిమగ్నంలో ఉంది. ఈ జెఎఫ్ 17 లో మూడవ తరానికి ఫైటర్ జెట్ ఫీచర్లను ఇందులో అందించారు.

3.తేజాస్ ఫైటర్ జెట్

3.తేజాస్ ఫైటర్ జెట్

పాకిస్తాన్‌కు చెందిన జెఎఫ్17 లో అందించిన మూడవ తరపు ఫైటర్ జెట్ ఫీచర్లను ఈ తేజాస్ ఫైటర్ జెట్‌‌లో స్వదేశీ ఇంజనీర్లు అందించారు. అయితే యుద్ద సమయంలో ఇది విశేష పనితీరును కనబరుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఐదవ తరానికి చెందిన ఫైటర్‌ జెట్‌తో సమానంగా పనిచేస్తుంది.

4.ఇంధన సామర్థ్యం

4.ఇంధన సామర్థ్యం

పాకిస్తాన్ జెఎఫ్ 17 ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ వారి ఇంధన సామర్థ్యం 2,268 కిలోలు మరియు భారత్‌కు చెందిన తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఇంధన ట్యాంకు సామర్థ్యం దాదాపుగా 2,458 కిలోలు

5.టేకాఫ్

5.టేకాఫ్

జెఎఫ్17 ఫైటర్ జెట్ టేకాఫ్ తీసుకోవడానికి 609 మీటర్లు పొడవైన రన్‌వే అవసరం అవుతుంది. అయితే భారత్‌కు చెందిన తేజాస్ ఎయిర్ క్రాప్ట్‌కు కేవలం 460 మీటర్లు పొడవైన రన్‌వే చాలు

6.ల్యాండింగ్

6.ల్యాండింగ్

ల్యాండింగ్ సమయంలో పాకిస్తాన్‌కు చెందిన జెఎఫ్17 ఫైటర్‌ జెట్‌కు 823 మీటర్లు పొడవైన రన్‌వే కావాల్సి ఉంటుంది. అయితే భారత్ కు చెందిన తేజాస్ ఫైటర్‌ జెట్‌కు 750 మీటర్లు పొడవైన రన్‌వే చాలు.

 7. బరువును మోయగలిగే సామర్థ్యం

7. బరువును మోయగలిగే సామర్థ్యం

పాకిస్తాన్ జెఎఫ్17 ఫైటర్ జెట్ దాదాపుగా 12,474 కిలోల వరకు మోయగలదు మరియు తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్ 14,735 కిలోల వరకు బరువులను మోసుకెళ్లగలదు.

8 తక్కువ బరువు గల ఎయిర్ క్రాఫ్ట్ బాడీ

8 తక్కువ బరువు గల ఎయిర్ క్రాఫ్ట్ బాడీ

పాకిస్తాన్‌కు చెందిన జెఎఫ్17 ఫైటర్ జెట్ బాడీని అల్యూమినియం మరియు స్టీల్ అల్లాయ్ మెటల్స్‌ను ఉపయోగించి తయారు చేశారు. కాని భారత్ చెందిన తేజాస్ ఫైటర్‌ జెట్‌లో కార్భన్ ఫైబర్ విడిభాగాలను ఎక్కువగా వినియోగించారు. అల్యూమినియం అల్లాయ్ మరియు టైటానియం అల్లాయ్ వంటి మెటల్స్‌ను ఉపయోగించి దీని బాడీని తయారు చేశారు.

9. గరిష్ట వేగం

9. గరిష్ట వేగం

పాకిస్తాన్ ఫైటర్ జెట్ జెఎఫ్ 17 యొక్క అత్యధిక వేగం 1,960 కిలోమీటర్లు మరియు ఇండియన్ తేజాస్ గరిష్టంగా గంటకు 2,376 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు.

10. డిజైన్

10. డిజైన్

జెఎఫ్ 17 ఎయిర్ క్రాఫ్ట్ 15 మీటర్లు పొడవు, 9.45 మీటర్లు వెడల్పు గలదు మరియు దీని బరువు 6,586 కిలోలు, అదే విధంగా మన తేజాస్ ఫైటర్ జెట్ 13 మీటర్ల పొడవు, 8.2 మీటర్ల వెడల్పు మరియు 6,500 కిలోల బరువును కలిగి ఉంటుంది.

11. ఇంజన్ వివరాలు

11. ఇంజన్ వివరాలు

తేజాస్ ఫైటర్ జెట్‌లో సాధారణ ఎలక్ట్రిక్ ఎఫ్404-జిఇ-ఐఎన్20 గల టర్భో‌ఫ్యాన్ ఇంజన్ కలదు. మరియు జఎఫ్17 ఫైటర్‌జెట్ లో క్లిమోవ్ ఆర్‌టి 90 టర్బో‌ఫ్యాన్ గల ఇంజన్‌ను వినియోగించుకున్నారు.

12 అత్యధిక దూరం

12 అత్యధిక దూరం

తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్ అత్యధికంగా 3,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది మరియు పాకిస్తాన్ జెఎఫ్17 ఫైటర్ జెట్ 3,482 కిలోమీటర్లు వరకు పరుగులు పెడుతుంది.

13. పరిమితి

13. పరిమితి

భారత్‌కు చెందిన తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్ 16,500 మీటర్ల ఎత్తు వరకు వెళ్లగలదు మరియు పాకిస్తాన్‌కు చెందిన జె‌ఎఫ్17 ఫైటర్ జెట్ 16,920 మీటర్ల ఎత్తును చేరుకోగలదు.

14. తేజాస్‌‌లోని ఆయుధాలు

14. తేజాస్‌‌లోని ఆయుధాలు

తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్ లో 23 ఎమ్ఎమ్ చుట్టుకొలత గల డబుల్ బ్యారెల్ గన్ కలదు. మరియు గాలిలో నుండి గాలిలోకి మరియు గాలిలో నుండి నేల మీదకు మిస్సైల్స్‌ను ప్రయోగించే సామర్థ్యం కలదు.

15. జెఎఫ్ 17 లోని ఆయుధాలు

15. జెఎఫ్ 17 లోని ఆయుధాలు

జెఎఫ్ 17 ఫైటర్ జెట్‌లో 23 ఎమ్ఎమ్ చుట్టు కొలత గల రెండు బ్యారెల్ గన్ మరియు 30 ఎమ్ఎమ్ చుట్టు కొలత గల గన్ కలదు. మిస్సైల్స్ మరియు లేజర్ గైడ్ బాంబులను ఇది కలిగి ఉంది.

 16 భవిష్యత్తు

16 భవిష్యత్తు

భవిష్యత్తులో భారత్‌ మరియు పాకిస్తాన్‌ల మధ్య యుద్ద సంభవిస్తే వచ్చే తరాల కోసం ఇండియన్ డిఫెన్స్ ఫైటర్ జెట్‌ల కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచింది. కేవలం విడిభాగాలను మాత్రమే ఇతర దేశాల నుండి సేకరిస్తోంది. మరియు విదేశీ ఒప్పందాల ద్వారా ప్రత్యేకమైన యుద్ద ఆయుధాల సహకారాన్ని పొందుతోంది. కాని పాకిస్తాన్ వద్ద ఎటువంటి స్వదేశీ పరిజ్ఞానం లేదు. ఇది ఎప్పటికైనా మరో దేశం మీద ఆధారపడాల్సిందే.

17 తేజాస్ భారత్‌కు ఓ వరం

17 తేజాస్ భారత్‌కు ఓ వరం

ప్రస్తుతం భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటోంది. ఇది తరువాత వచ్చే 15, 20 సవత్సరాల తరువాత దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే అప్పుడు ఇతర దేశాల సహకారం లేకుండా తయారు చేసుకోవచ్చు. కాని పాకిస్తాన్ ఇలాంటి నేఫథ్యంలో ఖచ్చితంగా ఓడిపోతుంది, కారణం దీని దగ్గర దేశీయంగా తయారు చేసుకునే వనరులు లేకపోవడం వలన.

 మరిన్ని ఆసక్తికరమైన విషయాలు.....
  • యుద్దానికి సిద్దమైన ఇండియన్ ఆర్మీ, డిఫెన్స్ మరియు నేవీ
  • శక్తివంతమైన సైనికబలాన్ని కలిగిన దేశాలు: ఇందులో భారత్ ఉందా...?
  • టైటానిక్ షిప్ మరియు టైటానిక్ సినిమా మధ్య గల వ్యత్యాసాలు

Most Read Articles

English summary
Comparison indian Tejas Vs Pakistan Jf 17 Thunder Fighter Jets
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X