వీడియో: హెల్మెట్ పెట్టుకొని ట్రక్ డ్రైవింగ్

By Ravi

సాధారణంగా మన రోడ్లపై గమనిస్తే, కొందరు ట్రక్కు డ్రైవర్లు బాడీ లేని (కేవలం ఇంజన్, ఛాస్సిస్ మాత్రమే కలిగిన) ట్రక్కులను ఎలాంటి రక్షణ జాగ్రత్తలు తీసుకోకుండానే నడుపుతుండటాన్ని గమనిస్తుంటాం. ఇలాంటి వాహనాలను వీరు మైళ్ల దూరం పాటు ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండానే నడుపుతుంటారు. అయితే, ఈరోజు మనం చూడబోయే వీడియోలో డ్రైవర్ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు.

కొందరు మోటారిస్టులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ కూడా హెల్మెట్ పెట్టుకోరు, కానీ ఈ మలేషియన్ కూలెస్ట్ ట్రక్ డ్రైవర్ మాత్రం హెల్మెట్ పెట్టుకొని నేచురల్ ఎయిర్ కండిషన్‌ను ఎంజాయ్ చేస్తూ ఎలా హాయిగా డ్రైవ్ చేస్తున్నాడో చూడండి. సాధారణంగా ఇలాంటి చాసిస్స్‌లను నడుపుతున్నప్పుడు వాటికి విండ్‌షీల్డ్ ఉండదు కాబట్టి దమ్ము, ధూళి నేరుగా కళ్లల్లో పడుతుంది.

ఈ నేపథ్యంలో గాలి బెడను తప్పించుకునేందుకే ఈ ట్రక్ డ్రైవర్ హెల్మెట్ ధరించినట్లు తెలుస్తోంది. కానీ మన దేశంలో ట్రక్ డ్రైవర్లు మాత్రం మూతికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇలాంటి ట్రక్కులను నడుపుతుంటారు. ఈ వీడియో చూసిన తర్వాతైనా వారు అప్రమత్తమై ఇలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుంటుంది. మీరేమంటారు. సరే ఈలోపు ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

Most Read Articles

English summary
In India, we're used to seeing truck drivers driving the chassis of the truck for long distances without any protection from the elements. But this driver in Malaysia takes it a step further. In addition to natural 'air-conditioning', we notice that he actually has a helmet on.
Story first published: Friday, May 2, 2014, 17:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X