భార్య కోసం భారీ గిఫ్ట్; డెలివరీ తీసుకునే లోపే పాపం..

By Ravi

ఇప్పుడు మనం చదవబోయేది ఓ విషాద ప్రేమ గాధ. ఈ ఫొటోలలో కనిపిస్తున్న ఆమె పేరు కార్నెలియా హ్యాగ్‌మ్యాన్. ఆస్ట్రేలియాలో పుట్టి, స్విట్జర్లాండ్‌లో స్థిరపడిన ఈమె, ఓ ప్రముఖ పెయింటర్‌గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. కార్నెలియాకి పెయింటింగ్ మాత్రమే ఫెరారీ కార్ల అన్న కూడా ఇష్టమే. ఈమె ఓ ఫెరారీ కార్ కలెక్టర్ కూడా. కార్నెలియా వద్ద ఇప్పటికే అనేక కార్లున్నాయి.

కాగా.. ఫెరారీ గడచిన 2013లో జరిగిన జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించిన 'ఫెరారీ లాఫెరారీ' హైపర్‌కారు తాజాగా ఆమె కార్ కలెక్షన్‌లో వచ్చి చేరింది. వాస్తవానికి ఈ కారును బుక్ చేసింది కార్నెలియా భర్త వాల్టర్ హ్యాగ్‌మ్యాన్. తన భార్యకు ఈ సర్‌ప్రైజ్ కానుకను అందించాలనుకున్న వాల్టర్, గడచిన సంవత్సరంలోనే ఈ కారును బుక్ చేశారు. అయితే, ఆ కారు ఆమె భర్తకు చేరే లోపే ఆయన కన్నమూశారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

భార్య కోసం భారీ గిఫ్ట్

తర్వాతి స్లైడ్‌లలో కార్నెలియా హ్యాగ్‌మ్యాన్ మరియు ఆమె ఫెరారీ లాఫెరారీ స్టోరీని తెలుసుకోండి.

భార్య కోసం భారీ గిఫ్ట్

కార్నెలియా భర్త వాల్టర్ కూడా ఓ ప్రముఖ ఫెరారీ కార్ కలెక్టర్. తన భార్యకు కూడా ఫెరారీ కార్లంటే మోజు ఉండటంతో, ఆమెను సర్‌ప్రైజ్ చేయాలని రోస్సో కోర్సా (రెడ్ కలర్) లాఫెరారీ కారును బుక్ చేశారు. అయితే, ఆమె ఆ సర్‌ప్రైజ్‌ను అందుకునేలోపే ఆయన కాలం చేశారు.

భార్య కోసం భారీ గిఫ్ట్

కార్నెలియా ఈ ఫెరారీ కారును తన భర్త వాల్టర్ గుర్తుగా, జాగ్రత్తగా చూసుకుంటోంది. తన వద్ద ఉన్న ఇతర ఫెరారీ కార్ల కంటే, ఈ లాఫెరారీ కారు తనకెంతో ఇష్టమైనదని, ఇది తన మనస్సుకు చాలా దగ్గరగా ఉంటుందని కార్నెలియా తెలిపారు.

భార్య కోసం భారీ గిఫ్ట్

ఫెరారీ లాఫెరారీ ఉత్పత్తి 2013 మధ్య భాగంలో ప్రారంభమైంది. ఈ మోడల్ విషయంలో ఎక్స్‌క్లూజివిటీని మెయింటైన్ చేయటం కోసం, కంపెనీ కేవలం 499 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది.

భార్య కోసం భారీ గిఫ్ట్

ఫెరారీ లాఫెరారీ కారు కోసం దాదాపు ఏడాది సమయం వెయిటింగ్ పీరియడ్ కూడా ఉండేది. ప్రస్తుతం ఈ మోడల్ కోసం బుకింగ్‌లు క్లోజ్ అయిపోనట్లు సమాచారం. ఫెరారీ నుంచి లభిస్తున్న అత్యంత వేగంతమైన ప్రొడక్షన్ వెర్షన్ కార్లలో లాఫెరారీదే అగ్రస్థానం.

భార్య కోసం భారీ గిఫ్ట్

ఫెరారీ లాఫెరారీ ఒక హైబ్రిడ్ కారు. ఇది డ్యూయెల్ పవర్ (పెట్రోల్ + బ్యాటరీ)తో పనిచేస్తుంది. లాఫెరారీ హైపర్‌కారులో 6.3 లీటర్ వి12 ఇంజన్‌ను మరియు ఓ 120 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు.

భార్య కోసం భారీ గిఫ్ట్

ఈ ఇంజన్ 9000 ఆర్‌పిఎమ్ వద్ద 800 హెచ్‌పిల గరిష్ట శక్తిని, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 700 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ మోటార్ 163 హెచ్‌‌పిల గరిష్ట శక్తిని, 270 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్లు రెండు కలిసి గరిష్టంగా 963 హెచ్‌పిల శక్తిని విడుదల చేస్తాయి.

భార్య కోసం భారీ గిఫ్ట్

ఫెరారీ లాఫెరారీ హైపర్‌కారు కేవలం 3 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అలాగే 15 సెకండ్లలో 0-300 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు.

భార్య కోసం భారీ గిఫ్ట్

ఫెరారీ కార్లలో కెల్లా అత్యంత ఖరీదైన కారు కూడా లాఫెరారీనే. దీని ధర సుమారు 16 లక్షల డాలర్లు.

Most Read Articles

English summary
The latest issue of Ferrari's official magazine carried a rather touching story that involved a LaFerrari and a Swiss artist Cornelia Hagmann. The Swiss artist, has nurtured a passion for Ferraris for many years now, thanks to her husband - Walter Hagmann, who also happened to be a leading Ferrari collector.
Story first published: Wednesday, January 14, 2015, 15:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X