భారతదేశంలోని కస్టమ్ మోటార్‌సైకిల్ బిల్డర్స్

బహుశా బైక్ కస్టమైజేషన్ గురించి మీకు తెలిసే ఉంటుంది కాబోలు. కార్లను కస్టమర్లు అభిరుచికి తగిన విధంగా ఎలా కస్టమైజ్ చేస్తారో, బైక్‌లను కూడా అలా కస్టమర్ల ఇష్టానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. సాధారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి హెవీ ఇంజన్ కలిగిన మోటార్‌సైకిళ్లను ఎక్కువగా కస్టమైజ్ చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే, ఈ కస్టమైజ్డ్ మోటార్‌సైకిళ్లు ఎప్పటికీ ప్రొడక్షన్ దశకు చేరుకోవు. అలాగే, కస్టమైజ్డ్ మోడల్‌ను పోలిన మరో మోడల్ కూడా ఎక్కువగా కనిపించదు.

కస్టమైజ్డ్ మోటార్‌సైకిళ్లలో ఎక్కువగా చోపర్లను చూస్తూ ఉంటుంటాం. సాధారణ మోటార్‌సైకిళ్లతో పోల్చితే ఇవి చాలా భిన్నంగా ఉంటాయి. విశిష్టమైన డిజైన్ పొడవాటి ఫ్రంట్ ఫోర్క్‌లతో ఇవి చిత్రంగా కనిపిస్తాయి. ఇవి క్రూయిజ్ మోటార్‌సైకిళ్ల సంతతికి చెందినవి అని చెప్పవచ్చు. ఇంకా బాబర్స్, కెఫె రేసర్స్, స్ట్రీట్ ఫైటర్స్ వంటి అనేక రకాల కస్టమైజ్ మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. కస్టమ్ మోటార్‌సైకిల్స్ తొలుతగా 1940వ దశకంలోనే తయారయ్యాయి. పశ్చిమ దేశాలలో ముఖ్యంగా అమెరికాలో ఇవి ఎక్కువగా కనిపించేవి.

ఇప్పుడు ఈ కస్టమ్ మోటార్‌సైకిల్ ట్రెండ్ క్రమంగా భారతదేశానికి కూడా పాకింది. మనదేశంలో ఇప్పటికే అనేక మోటార్‌సైకిల్ కస్టమైజేషన్ సెంటర్లు వెలిశాయి. విదేశాల్లో నైపుణ్యం పొందిన కొందరు నిపుణులు బైక్‌లను కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా మోటార్‌సైకిళ్లను తయారు చేసి ఇస్తుంటారు. మనదేశంలో అలాంటి కొన్ని ఆసక్తిర కస్టమ్ మోటార్‌సైకిళ్ల గురించి, కస్టమ్ మోటార్‌సైకిల్ బిల్డర్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

కస్టమ్ మోటార్‌సైకిల్ బిల్డర్స్

ఈ కథనంలో మేము కొందరు ప్రముఖ భారతీయ కస్టమ్ బైక్ తయారీదారుల గురించి, అలాగే గ్లోబల్ కమ్యూనిటీలోని పెద్ద పేర్ల గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆసక్తికర అంశాలను తెలుసుకునేందుకు తర్వాతి స్లైడ్‌లను పరిశీలించండి.

రాజ్‌పుట్నా కస్టమ్స్

రాజ్‌పుట్నా కస్టమ్స్

ఇండియన్ కస్టమ్ మోటార్‌సైకిల్ విభాగంలో ప్రధానంగా వినిపించే పేరు రాజ్‌పుట్నా కస్టమ్స్. జైపూర్‌కు చెందిన ఈ బైక్ కస్టమైజేషన్ కంపెనీ అందమైన కస్టమైజ్డ్ మోటార్‌సైకిళ్లను తయారు చేస్తుంది. రాజ్ పుట్నా కస్టమ్స్ అధినేత విజయ్ సింగ్ తయారు చేసిన తొలి కస్టమైజ్డ్ బైక్ 'ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్'ను 2010 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఆ తర్వాత జాన్ అబ్రహామ్ కోసం లైట్‌ఫుట్ అనే కస్టమైజ్డ్ బైక్‌ను తయారు చేశారు.

రాజ్‌పుట్నా కస్టమ్స్

రాజ్‌పుట్నా కస్టమ్స్

అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్‌పుట్నా కస్టమ్స్ డజనుకు పైగా పాపులర్ కస్టమైజ్డ్ బైక్‌లను తయారు చేశారు. కస్టమ్ రాయల్ ఎన్‌ఫీల్డ్, చోపర్, బాబర్, కెఫే రేసర్ స్టైల్ కస్టమ్ బైక్స్‌ను వీరు తయారు చేశారు. అంతేకాకుండా, పురాతన క్లాసిక్ మోటార్‌సైకిళ్లను రిస్టోరింగ్ చేయటం కూడా రాజ్‌పుట్నా కస్టమ్స్‌కు వెన్నతో పట్టిన విద్య.

రాజ్‌పుట్నా కస్టమ్స్

రాజ్‌పుట్నా కస్టమ్స్

రాజ్‌పుట్నా కస్టమ్ బైక్స్ ధరలు రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల రేంజ్ వరకూ ఉంటాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసిన ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ బైక్ ధర రూ.5 లక్షలు. జాన్ అబ్రహామ్ కోసం తయారు చేసిన లైట్‌ఫుట్ బైక్ ధర కూడా ఇంచు మించు అంతే ఉంటుంది. కస్టమైజ్డ్ హ్యార్లీ డేవిడ్‌సన్ రాజ్‌మాతా మాత్రం రూ.6-8 లక్షల రేంజ్‌లో ఉంటుంది.

ఫొటోలు: ఫేస్‌బుక్
వర్డెంచి

వర్డెంచి

ఇది ముంబైకి చెందిన ఇండియన్ కస్టమ్ బైక్ కంపెనీ. ఈ కంపెనీకి కర్త కర్మ క్రియ అన్నీ అక్షయ్ వర్డే. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను ఆధారంగా చేసుకొని చోపర్ స్టైల్ మోటార్‌సైకిళ్లను తయారు చేయటంలో వర్డెంచి స్పెషలిస్ట్.

వర్డెంచి

వర్డెంచి

వర్డెంచి చోపర్లు వెనుక వైపు లోవర్ రైడ్ రియర్ సస్పెన్షన్‌ను, పొడవాటి ఫ్రంట్ ఫోర్క్‌ను, విశిష్టమైన ఫ్యూయెల్ ట్యాంక్‌లను కలిగి ఉంటాయి. ఈ బైక్‌లలో ఉపయోగించే అల్లాయ్ వీల్స్, వెడల్పాటి భారీ వెనుక టైర్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.

వర్డెంచి

వర్డెంచి

వర్డెంచి తయారు చేసిన కస్టమైజ్డ్ మోటార్‌సైకిళ్లలో ఇన్ఫినిటీ, స్లేయర్, టర్బో, సన్‌బర్న్ అనే చోపర్ స్టైల్ మోటార్‌సైకిళ్లు మంచి పాపులారిటినీ దక్కించుకున్నాయి. వీటి ధరలు రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.

ఫొటోలు: ఫేస్‌బుక్

బుల్లెటీర్ కస్టమ్స్

బుల్లెటీర్ కస్టమ్స్

బెంగుళూరుకు చెందిన బుల్లెటీర్ కస్టమ్స్‌ను రికార్డో పెరీరా నిర్వహిస్తున్నాడు. పేరుకు తగినట్లుగానే ఈ గ్యారేజ్‌లో బుల్లెట్ బైక్‌ (రాయల్ ఎన్‌ఫీల్డ్)లను ఆధారంగా చేసుకొని సరికొత్త బైక్‌లను సృష్టిస్తుంటారు.

బుల్లెటీర్ కస్టమ్స్

బుల్లెటీర్ కస్టమ్స్

రికార్డో పెరీరా ప్రధానంగా కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్లను కస్టమైజ్ చేయటం పైనే దృష్టి సారిస్తుంటాడు. కొన్ని బుల్లెటీర్ కస్టమ్ బైక్స్ క్లాసిక్, రెట్రో కస్టమ్ డిజైన్‌ను కలిగి ఆకర్షనీయంగా ఉంటాయి. వీటిని స్ట్రీట్ రాడ్స్ అని కూడా వ్యవరిస్తారు. వీటిని ఇంజన్‌తో పాటుగా పూర్తిగా మోడిఫై చేస్తారు.

బుల్లెటీర్ కస్టమ్స్

బుల్లెటీర్ కస్టమ్స్

బుల్లెటీర్ కస్టమ్స్ తయారు చేసిన కస్టమైజ్డ్ మోటార్‌సైకిళ్లలో థార్, ఎక్లిప్స్, కర్మా, స్ట్రీట్‌హాక్, ఫినిక్స్ మంచి ప్రాచుర్యం పొందాయి. ఈ కస్టమైజ్డ్ బైక్ ధరలు రూ.1.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల రేంజ్‌లో ఉంటాయి.

ఫొటోలు: ఫేస్‌బుక్

ఇండియా బైక్ వీక్

ఇండియా బైక్ వీక్

మనదేశంలో ప్రతి ఏటా జరిగే ఇండియా బైక్ వీక్ అనే కస్టమ్ మోటార్‌సైకిల్ ఫెస్టివల్‌లో దేశవ్యాప్తంగా ఉండే బైక్ కస్టమైజర్లు తమ విశిష్టమైన ఉత్పత్తులను ప్రదర్శిండం జరుగుతుంటుంది. ఇంకా ఈ కార్యక్రమంలో బైకర్ బిల్డ్-ఆఫ్ కాంపిటీషన్ కూడా ఉంటుంది. వచ్చే ఏడాది జరగాల్సిన 2014 ఇండియా బైక్ వీక్ కార్యక్రమం జనవరి 17, 18వ తేదీలలో గోవాలో జరగనుంది.

ఇండియా బైక్ వీక్

ఇండియా బైక్ వీక్

కాగా.. 2013 ఇండియా బైక్ వీక్ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నది ఓ ప్రముఖ చోపర్. అమెరికాలోని జెఎల్ఆర్ సైకిల్స్ సంస్థకు చెందిన జాన్ లెవీ ఈ బైక్‌ను తయారు చేశారు. 'లక్కీ 7'గా పిలిచే ఈ బైక్‌లో 7 సిలిండర్లతో కూడిన ఇంజన్‌ను అమర్చారు.

ఇండియా బైక్ వీక్

ఇండియా బైక్ వీక్

లక్కీ 7 కస్టమైజ్డ్ బైక్‌లో 7 సిలిండర్, రోటెక్ ఆర్2800 ఇంజన్‌ను ఉపయోగించారు. వాస్తవానికి ఇంలాంటి ఇంజన్లను చిన్న ప్రొపెల్లర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఉపయోగిస్తుంటారు. ఈ ఇంజన్ గరిష్టంగా 216.68 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కస్టమ్ ట్యూబ్లర్ స్టీల్ ఫ్రేమ్‌లో ఈ ఇంజన్‌ను అమర్చారు.

కస్టమ్ మోటార్‌సైకిల్ బిల్డర్స్

ఇండియా నుంచి అమెరికా వరకూ ప్రపంచంలో కెల్లా బెస్ట్ కస్టమ్ మోటార్‌సైకిల్ పేర్లను, టాలెంట్లను చూడాలంటే, ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ కస్టమ్ బైక్ బిల్డింగ్ కార్యక్రమానికి వెళ్లాల్సిందే. ఈ అంతర్జాతీయ బైకర్ బిల్డ్-ఆఫ్ పోటీని అమెరికన్ మోటార్‌సైకిల్ డీలర్ (ఏఎమ్‌డి) మ్యాగజైన్ నిర్వహిస్తుంది. వివిధ విభాగాల ఆధారంగా విజేతలను ఎంచుకుంటారు.

ప్రొడక్షన్ మ్యనుఫ్యాక్చరర్ క్లాస్

ప్రొడక్షన్ మ్యనుఫ్యాక్చరర్ క్లాస్

ఈ విభాగంలో, 'ది నాటీ జెంటిల్మెన్' అనే కస్టమై బైక్‌ను తయారు చేసిన యూకేకి చెందిన సెకండ్ సిటీ కస్టమ్స్ విజేతగా నిలిచింది. అయితే, ఈ ఫొటోలో మనం చూస్తున్నది 'ది నాటీ జెంటిల్మెన్' బైక్ కాదు, అదే సంస్థ తయారు చేసిన మరో అందమైన బైక్ లెజెండ్.

ప్రొడక్షన్ మ్యనుఫ్యాక్చరర్ క్లాస్

ప్రొడక్షన్ మ్యనుఫ్యాక్చరర్ క్లాస్

సన్నటి ఫ్యూయెల్ ట్యాంక్, పొడవాటి ఫ్రంట్ ఫోర్క్, ముందు వైపు సన్నటి పెద్ద అల్లాయ్ వీల్ (23 ఇంచ్‌లు), వెనుక వైపు లావుగా ఉండే వెడల్పాటి టైరు (20 ఇంచ్‌లు), ఎయిర్ సస్పెన్షన్, 124 క్యూబిక్ ఇంజన్ ఎస్ అండ్ ఎస్ ఇంజన్ వంటి విశిష్టతలు ఈ ఈ లెజెండ్ బైక్ సొంతం.

మోడిఫైడ్ హ్యార్లీ డేవిడ్‌సన్ క్లాస్

మోడిఫైడ్ హ్యార్లీ డేవిడ్‌సన్ క్లాస్

ఈ విభాగంలో విజేత తైవాన్‌కు చెందిన రఫ్ క్రాఫ్ట్స్ కస్టమైజ్ సంస్థ తయారు చేసిన స్టీల్త్ బుల్లెట్. ఈ ఫొటోలో చూస్తున్న బాబర్ స్టైల్ మోటార్‌సైకిల్ డీప్ బ్లాక్ కలర్‌లో విశిష్టమైన డిజైన్‌ను కలిగి ఉంది.

మోడిఫైడ్ హ్యార్లీ డేవిడ్‌సన్ క్లాస్

మోడిఫైడ్ హ్యార్లీ డేవిడ్‌సన్ క్లాస్

ఈ స్టీల్త్ బుల్లెట్ కస్టమైజ్డ్ హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లో 1200సీసీ వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. దీని ఫ్రంట్ ఫోర్క్ ఓ సింగిల్ లార్జ్ స్ప్రింగ్ సపోర్ట్‌పై ఉంటుంది.

కస్టమ్ మోటార్‌సైకిల్ బిల్డర్స్

దశాబ్ధాల చరిత్ర కలిగిన కస్టమ్ మోటార్‌సైకిల్ ప్రపంచం, ఈ ప్రపంచంలో అనేక విశిష్టమైన లెజెండ్ల పుట్టుకకు కారణం అయ్యింది. వీరంతా కస్టమైజేషన్‌లో తమకు ఉన్న నైపుణ్యంతో ప్రపంచ వ్యాప్తంగా కీర్తిని దక్కించుకోగలిగారు.

ఇండియన్ ల్యారీ

ఇండియన్ ల్యారీ

ఈ ఫొటోలో కనిపిస్తున్న లేట్ ఇండియన్ ల్యారీ మోటార్‌సైకిల్ కస్టమైజ్‌లో దిగ్గజం. ఇతని ఆసక్తి కేవలం బైక్‌లను తయారు చేయటానికే పరిమితం కాకుండా, స్టంట్ రైడింగ్, యాక్టింగ్ రంగాలకు పాకింది.

ఇండియన్ ల్యారీ

ఇండియన్ ల్యారీ

ఇండియన్ ల్యారీ అసలు పేరు లారెన్స్ డిస్మెడ్ట్. అయితే, 1980వ దశకంలో అతను ఓ చోప్డ్ ఇండియన్ మోటార్‌సైకిల్‌ను నడపటం చూసి అతినికి ఇండియన్ ల్యారీ అనే పేరును పెట్టారు. కానీ, దురృష్ట వశాత్తు ఓ మోటార్‌సైకిల్ స్టంట్ చేస్తుండగా సంభవించిన ప్రమాదంలో ఇండియన్ ల్యారీ 55 ఏళ్లకే ప్రాణాలు విడిచాడు.

మోండో పౌరాస్

మోండో పౌరాస్

మరొక చోపర్ బిల్డర్ దిగ్గజం మోండో పౌరాస్. డెన్‌వెర్స్ చోపర్స్ అనే సంస్థను డెన్వెర్ ముల్లిన్ భాగస్వామ్యంతో మోండో పౌరాస్ స్థాపించాడు. కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో ఉన్న డెన్వెర్ చోపర్స్ 1967 నుంచి కార్యకలాపాలు సాగిస్తూనే ఉంది.

రాన్ ఫించ్

రాన్ ఫించ్

ఫించ్ కస్టమ్స్ అనే బైక్ కస్టమైజేషన్ సంస్థ వ్యవస్థపకుడైన రాన్ ఫించ్ అసాధారణమైన, అతి విచిత్రమైన బైక్‌లను కస్టమైజ్ చేసి, ప్రంపంచం దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు.

ఇతర ప్రముఖులు

ఇతర ప్రముఖులు

ఇంకా ఈ రంగంలో అర్లెన్ నెస్, రిక్ ఫెయిర్‌లెస్, పౌల్ యాఫె, డగ్ కీమ్, ఫ్రెడ్ కోడ్లిన్, జే అల్లెన్, స్టీవ్ బాయెల్స్ సర్ మొదలైన ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు.

కస్టమ్ మోటార్‌సైకిల్ బిల్డర్స్

సరే ఇప్పుడు కస్టమ్ బైక్ తయారీదారుల గురించి పక్కకు పెట్టి, గడచిన దశాబ్ధ కాలం నుంచి కొన్ని పాపులర్ రియాల్టీ సిరీస్‌లో వీడియోల ద్వారా వీక్షిద్దాం రండి. కస్టమ్ బైక్ బిల్డింగ్ 2000వ సంవత్సర కాలంలో మంచి ప్రాచుర్యం పొందింది. ఈ థీమ్‌ను ఆధారంగా చేసుకొని కొన్ని రియాల్టీ షోలు కూడా వెలిశాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు పరిశీలిద్దాం రండి.

మోటార్‌సైకిల్ మానియా

ఈ షోలలో కెల్లా మొదటిది మోటార్‌సైకిల్ మానియా. ప్రముఖ బైక్ బిల్డర్ జెస్సె జేమ్స్ మరియు అతని కస్టమై బైక్ బిల్డింగ్ కంపెనీ అయిన వెస్ట్ కోట్ కస్టమ్స్‌లో జరిగే రోజువారీ కార్యకలాపాలను టెలివిజన్‌లో చూపించేవారు.

బైకర్ బిల్డ్-ఆఫ్

బైకర్ బిల్డ్-ఆఫ్ అనేది కస్టమైజ్డ్ బైక్‌లను తయారు చేసే ఓ రియాల్టీ షో కార్యక్రమం. తొలుత డిస్కవర్ ఛానెల్‌లో సింగిల్ స్పెషల్ షోగా వచ్చిన ఈ కార్యక్రమం ఆ తర్వాత క్రమంగా రెగ్యులర్ ప్రోగ్రామ్‌గా మారి అనేక సిరీస్‌లు పూర్తి చేసుకుంది.

అమెరికన్ చోపర్స్

అమెరికన్ చోపర్స్ కూడా ఓ రియాల్టీ సిరీసే, న్యూయార్క్ లోని ఆరెంజ్ కౌంటీ చోపర్స్ (ఓసిసి) వద్ద ఇది జరుగుతుంది.

కస్టమ్ మోటార్‌సైకిల్ బిల్డర్స్

కస్టమ్ మోటార్‌సైకిల్ ప్రపంచం గురించి పరిచయం చేసిన ఈ కథనం మీకు కూడా నచ్చిందా..? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.

Most Read Articles

English summary
A custom motorcycle is defined as any bike which has been heavily modified from its stock form or a bike that's been built by hand from the ground up. Custom motorcycles almost never enter production and even if they do, its always limited to very few units.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X