మరింత అదనపు స్టోరేజ్ కోసం డెకెడ్ పికప్ ట్రక్ డ్రాయెర్స్!

By Ravi

పికప్ ట్రక్ అంటేనే లగేజ్ కోసం నిర్దేశించబడిన ట్రక్ అని అర్థం. అలాంటి పికప్ ట్రక్‌లో మరింత లగేజ్ పట్టేలా డిజైన్ చేయబడినదే ఈ 'డెకెడ్' (Decked). డెకెడ్ అనేది ఓ స్టోరేజ్ డ్రాయెర్ సిస్టమ్. పికప్ ట్రక్కు వెనుక భాగంలో ఉండే పికప్ ఫ్లాట్ బెడ్ (లగేజ్‌ను ఉంచే ఫ్లాట్‌ఫామ్)కు క్రింది భాగంలో ఇది డ్రాయెర్ రూపంలో అమర్చబడి ఉంటుంది.

ఇందులో అరలు అరలుగా ఉండే నిర్మాణం ఉంటుంది. డెకెడ్ డ్రాయెర్‌‌లో వస్తువులను/లగేజ్‌ను ఓ క్రమపద్ధతిలో అమర్చుకోవచ్చు. ఫుల్ సైజ్ పికప్ ట్రక్కుల కోసం ఇది డిజైన్ చేయబడినది. జాగ్రత్తగా తీసుకు వెళ్లాల్సిన చిన్న వస్తువులను ఈ కార్గో డ్రాయెర్‌లో భద్రపరచుకొని రవాణా చేయవచ్చు. పెద్ద వస్తువలను ఈ డ్రాయెర్‌కు పై భాగంలో ఉండే ఫ్లాట్ బెడ్‌‌పై రవాణా చేయవచ్చు.

మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

డెకెడ్ పికప్ ట్రక్ డ్రాయెర్స్

డెకెడ్ డ్రాయెర్లను అధిక సామర్థ్యం కలిగిన స్టీల్‌తో తయారు చేస్తారు. ఇవి చాలా ధృడంగా ఉంటాయి.

డెకెడ్ పికప్ ట్రక్ డ్రాయెర్స్

డెకెడ్ బెడ్ గరిష్టంగా 200 పౌండ్ల బరువును మోయగలవు, డెకెడ్ డ్రాయెర్లు 200 పౌండ్ల బరువును మోయగలవు.

డెకెడ్ పికప్ ట్రక్ డ్రాయెర్స్

డెకెడ్ డ్రాయెర్లు రెండు సైజులలో లభిస్తాయి. అవి 61.4 x 18.1 x 8.4 (చిన్న వాటి కోసం), 72.1 x 18.1 x 8.4 (స్టాండర్డ్ సైజ్) (పొడవు x వెడల్పు x ఎత్తు - మిల్లీ మీటర్లలో).

డెకెడ్ పికప్ ట్రక్ డ్రాయెర్స్

ఈ డెకెడ్ డ్రాయెర్స్ అన్నీ కూడా వాటర్‌ప్రూఫ్. డెకెడ్ బెడ్ పైభాగంలో నీరు పడినప్పటికీ, ఇవి క్రింది భాగంలో ఉన్న డ్రాయెర్లకు చేరుకోవు. కాబట్టి, అందులో ఉండే వస్తువులు తడిచిపోవటం, తుప్పుపట్టడం జరగదు.

డెకెడ్ డ్రాయెర్స్ పనితీరును చూపించే ఈ వీడియోని వీక్షించండి.

Most Read Articles

Story first published: Friday, March 28, 2014, 15:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X