ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం

By Anil

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రయాణికులకు సేవలు అందివ్వడంలో మొదటి స్థానంలో ఉన్న ఎయిర్ పోర్ట్, వరుసగా మూడు అవార్డులను సొంతం చేసుకున్న ఎయిర్ పోర్ట్ ఏదో తెలుసా ? చాలా మంది వరకు ఏ ఫారిన్‌ దేశాల్లోనో ఉంటుంది అని అనుకుంటారు. అలా అయితే మీ ఆలోచన తప్పు. ఎందుకంటే వీటన్నింటిని సొంతం చేసుకుంది. మన దేశ రాజధాని ఢిల్లీలో గల ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.
Also Read: భారత్‌లో గల టాప్-10 బెస్ట్ ఎయిర్‌లైన్స్
దీని అవార్డుల కథేంటో తెలుసుకోవాలంటే క్రింది శీర్షికను చదవాల్సిందే.

 ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం

ప్రతి ఏడాది కూడా అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కౌన్సిల్ వారి స్టడీ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఏడాదికి 25 నుండి 40 మిలియన్ ప్రజలకు సేవలు అందిస్తూ మొదటి స్థానంలో ఉందని తెలిపారు.

 ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం

ఇలా ఎంపిక కావడం వరుసగా ఇది రెండవ సారి, అంతకు ముందు సంవత్సరం కూడా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇలాంటి రికార్డును నమోదు చేసుకుని మొదటి స్థానంలో నిలిచింది.

 ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం

2007 తరువాత ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌ను ప్రైవేటీకరణ చేసిన తరువాత ఎయిర్ పోర్ట్ సర్వీస్ క్వాలిటీ(ఏఎస్‌కె) వారి ర్యాంకింగ్ ప్రకారం ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ప్రపంచ వ్యాప్తంగా నాణ్యమైన ఎయిర్ పోర్ట్ సేవలు అందిస్తున్నందుకు 101 వ స్థానంలో నిలిచింది.

 ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం

అయితే 2013 సంవత్సరం తరువాత నాణ్యమైన సేవల పరంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ర్యాకింగ్ పరంగా 101 నుండి మొదటి స్థానం వైపు ఎగబాకింది.

 ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం

ఆ తరువాత 2015 లో నిర్వహించిన నాణ్యమైన ఎయిర్ పోర్ట్ సేవల సర్వేలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ 4.96 స్కోర్ ద్వారా 1 నుండి 5 లోపు ర్యాంకుకు ఎంపిక అయినట్లు తెలిసింది.

 ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం

ఈ సందర్భంగా కొంత మంది ఇంధిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఉద్యోగులు మాట్లాడుతూ, నిరంతరం ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందివ్వడం ద్వారా ఎంతో అనుభవం గడించామని తెలిపారు. అందుకు గాను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మూడు అంతర్జాతీయ అవార్డులను పొందినట్లు తెలిపారు.

 ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం

ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నందుకు గాను ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ ఎయిర్ పోర్ట్ గా రెండు సార్లు నిలవడం, ఆసియా పసిఫిక్ రీజియన్‌లో గల ఎయిర్‌ పోర్ట్‌లలో విస్తీర్ణం పరంగా బెస్ట్ ఎయిర్ పోర్ట్ మరియు ఆసియా పసిఫిక్ రీజియన్‌లో రెండవ బెస్ట్ ఎయిర్ పోర్ట్‌ వంటి అవార్డులను కైవసం చేసుకుంది.

 ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం

దీని గురించి ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సిఇఓ ప్రభాకర్ రావు మాట్లాడుతూ, ఇలా బెస్ట్ ఎయిర్ పోర్ట్‌గా ఎంపిక కావడం వలన వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందివ్వడం పట్ల భాద్యత మరింత పెరిగిందని చెప్పారు.

మరిన్ని ఆసక్తికరమైన కథనాలు మీకోసం....
  1. విమానంలో పైలట్ మరియు విమాన సిబ్బంది చేసే 20 చీకటి పనులు
  2. టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో ఎకో ఫ్రెండ్లీ కార్ కలెక్షన్
  3. భారతీయుని అత్భుత సృష్టి పూర్తిగా డ్రైవర్ రహిత కారు ఆవిష్కరణ

Most Read Articles

English summary
Delhi Airport Retains Worlds Number One Position
Story first published: Wednesday, March 2, 2016, 12:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X