ఆసియా ఖండంలోనే అతి పొడవైన రహదారి AH-1 గురించి ఆసక్తికరమైన సమాచారం

By Anil

ప్రపంచంలో ఎన్నెన్నో భారీ నగరాలు ఉన్నాయి, ఇలాంటి నగరాలను ఆయా దేశాలకు చెందిన ప్రాంతీయ మరియు జాతీయ రహదారులు కలుపుతాయి. అయితే ఖండాలలో ఒకటైన ఆసియా ఖండంలోనే ఎన్నో దేశాలను కలపుతూ భూమికి సమాతారంగా ఒక పొడవైన రహదారి కలదు. దాని పేరే ఎహెచ్-1 హై వే.

దేశాలకు మధ్య సముద్రం అడ్డువచ్చినా కూడా వాటి మీద భారీ వంతెనలను నిర్మించి ఆ రహదారిని నిర్మించారు. ఇంతేనా దీని గురించి తెలుసుకోవాలే గాని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వాటి కోసం క్రింది కథనాన్ని చదవగలరు.

ఆది, అంతమం

ఆది, అంతమం

ఇది జపాన్‌లోని టోక్యోలో ప్రారంభం అయి యూరప్ దేశాలలో ఉన్న టర్కీ తో అంతం అవుతుంది.

పొడవు

పొడవు

ఈ ఎహెచ్‌-1 రహదారి పొడవు సుమారుదా 20,557 కిలోమీటర్లుగా ఉంది, ఇది ఆసియా ఖండం మొత్తం గర్వించేలా సుమారు 12 కు పైగా దేశాలలో విస్తరించి ఉంది.

జపాన్‌లోనే ఎక్కువగా

జపాన్‌లోనే ఎక్కువగా

జపాన్‌లో సుమారుగా 1,200 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు పరుచుకుని ఉంది. జపాన్‌లో అత్యంత ట్రాఫిక్ ఉన్న 11 రోడ్లను ఇందులో కలిపారు. అంతే కాకుండా చైనా ద్వారా రవాణా కోసం షిప్‌లు మరియు ఓడలు మీద ఆధారపడి ఉండేది జపాన్.

వివిధ దేశాల అనుసంధానం

వివిధ దేశాల అనుసంధానం

జపాన్, కొరియా, చైనా, హాంగ్‌కాంగ్, బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు టర్కీ మీదుగా ఇరాన్ అలాగే బల్జీరియా వంటి దేశాలను కలుపుతూ పోతుంది. వీటితో పాటు మరికొన్ని యూరోపియన్ దేశాలకు కూడా ఇది విస్తరించి ఉంది.

భారత్‌లో ఎహెచ్‌-1

భారత్‌లో ఎహెచ్‌-1

భారత భూభాగంలో ఉన్న ఇంఫాల్, కోహిమా, దిమాపూర్, నాహోర్, గౌహతి, షిల్లాంగ్, ఢాకా, కలకత్తా కాన్పూర్, ఢిల్లీ మీదుగా ఈ రహదారి విస్తరించి ఉంది.

ఆర్థిక పరమైన లాభం

ఆర్థిక పరమైన లాభం

ఆసియా ఖండానికి చెందిన దేశాలు ఆర్థిక పరమైన వృద్దిని సాధించేందుకు ఈ రహదారి ఎంతగానో ఉపయోగపడుతోంది. అన్ని దేశాలకు ముఖ్య ఆధాయ వనరు అయిన పర్యాటక రంగానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతోంది.

Picture Credit: Boombsbeat

యూరోపియన్ దేశాలు

యూరోపియన్ దేశాలు

ఆసియా ఖండానికి చెందిన అతి పొడవైన ఎహెచ్ 1 రహదారి గుండా వెళితే టర్కీ నుండి హై వే నెం. 80 ద్వారా యూరోపియన్ దేశాలను మొత్తం చుట్టేయవచ్చు.

Picture Credit: 2nified

పర్యాటక ప్రాముఖ్యత

పర్యాటక ప్రాముఖ్యత

పర్యాటకమే ముఖ్య అజెండాగా నిర్మించిన రహదారి వలన ఎంతో పర్యాటకులు ఈ ఆసియా జాతీయ రహదారుల మీద వివిధ రకాల పర్యాటక ప్రాంతాలకు వెలుతున్నారు. 2014 ఏడాదిలో భారత్‌ నుండి సుమారుగా 94 లక్షల మంది పర్యాటకులు థాయ్‌లాండ్‌కు టూర్‌గా వెళ్లారు. మరి ఇప్పుడు ఈ సంఖ్య ఎంత ఉంటుందో మీరే అంచనా వేయండి. అందుకోసం ఈ రహదారిని పర్యాటక ఆదాయ వనరు అని కూడా అంటున్నారు.

Picture Credit: Wikimedia Commons

ఆత్బుతమైన అనుభూతి

ఆత్బుతమైన అనుభూతి

క్వాడ్రిలాటరల్ రోడ్ ట్రిప్ అనే పేరుతో హిమాలయాల నుండి కారు లేదా బైకులలో థాయ్‌లాండ్‌కు రోడ్‌ ట్రిప్ ఉంటుంది. హిమాలయాల నుండి థాయ్‌లాండ్ వరకు ఉన్న ఆసియా హై వే మీద ప్రయాణం అత్భుతంగా ఉంటుంది. చూడ చక్కటి ప్రదేశాలతో మంచు కొండలు, కొలనులు మరియు ప్రకృతి రమణీయమైన తోటలు మధ్య ప్రయాణం మీకు చక్కటి అనుభూతిని ఇస్తుంది

Picture Via: Indiatimes

రహదారి పనులు

రహదారి పనులు

ఈ ఎహెచ్-1 హై వే మీద అక్కడక్కడ జరుగుతున్న చిన్నచిన్న పనులు ఈ ఏడాదికి దాదాపుగా పూర్తి కానున్నాయి.

Picture Credit: Holidayiq

ఇండియా థాయ్‌లాండ్ మధ్య ప్రయాణం దూరం

ఇండియా థాయ్‌లాండ్ మధ్య ప్రయాణం దూరం

ఆసియా రహదారి మీద ఇండియా నుండి థాయ్‌లాండ్ ను చేరుకోవడానికి సుమారుగా 3,200 కిలోమీటర్లు పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రయాణం దూరం చాలా ఎక్కువగా ఉన్నప్పట్టికీ ఈ దారి వెంబడి ఆత్బుతమైన పురాతణ ప్రదేశాలు, సాంప్రదాయాలు, ప్రజలు వారి జీవణ పద్దతులు ప్రతీది మనకు కొత్తగా పరిచయం అవుతుంది.

Picture Credit:Roughguides

ప్రయాణానికి అనువైన కాలం

ప్రయాణానికి అనువైన కాలం

ప్రతి ఏడాది కూడా భారత్ నుండి థాయ్‌లాండ్ కు నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్య కాలంలో ఎక్కువగా వెలుతుంటారు.

సమగ్రపత్రాలతో

సమగ్రపత్రాలతో

భారత్‌ నుండి థాయ్‌లాండ్‌కు ఎహెచ్‌-1 రహదారి మీద ప్రయాణానికి సిద్దమైతే ముందుకు కారు లేదా బైకులకు చెందిన అంతర్జాతీయ డ్రైవింగ్ లెసెన్స్‍‌ను వెంట తీసుకెళ్లాలి. ఒక వేళ అద్దె వాహనాలలో వెళితే వాటికి సంభందించిన ఒప్పంద పత్రాలు, ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, మయన్మార్ మరియు థాయ్‌లాండ్ దేశాలకు చెందిన అన్ని నియమాలు పాటించాలి.

Picture Credit: Wikimedia Commons

మరొక విషయం

మరొక విషయం

మీరు ఇలా పర్యానల కోసం మయన్మార్ మీదుగా వెళితే ఒక నెల ముందుగా మయన్మార్ ప్రభుత్వ అథారటీలకు సమాచారం అందివ్వాల్సి ఉంటుంది.

Picture Credit: Wikimedia Commons

 భద్రత పరమైన సమస్యలు

భద్రత పరమైన సమస్యలు

ఇలాంటి దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్లే ముందు తగింనంత డబ్బు చతిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి, మన రుపాయలనే కాకుండా ఆ ప్రాంతానికి సంభందించిన కొంత పైకాన్ని తీసుకెళ్లడం కూడా మంచిదే. పాన్‌కార్డు మరియు తాజాగా తీయించుకున్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను వెంట తీసుకెళ్లడం మంచిది.

Picture Credit- Via Indiatimes

సూచనలు

సూచనలు

మీకు సొంత కారు లేదా బైకు ఉంటే ఈ రోడ్డు మీద థాయ్‌లాండ్ వరకు ప్రయాణించవచ్చు. లేదంటే గౌహతిలో చాలా వరకు సంస్థలు కార్లను మరియు బైకులను స్వతగా డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లే విధంగా అద్దెకు అందుబాటులో ఉంచారు.

మరిన్ని కథనాల కోసం....

జీవితంలో చూసిన తీరాల్సిన రోడ్లు మరియు వంతెనలు

ప్రపంచంలో కెల్లా పది అత్యంత వేగవంతమైన రోడ్లు

Most Read Articles

English summary
Did You Know The Ah 1 Highway Is The Longest Road Asia
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X