మైఖేల్ షుమాకర్ కోమా నుంచి బయటపడుతాడా?

By Ravi

వరుసగా ఏడు సార్లు ఫార్ములా వన్ ఛాంపియన్‌షిప్‌ను గెలిచిన ప్రపంచ ప్రఖ్యాత ఫార్ములా వన్ రేసర్ మైఖేల్ షుమాకర్‌ గడచిన డిసెంబర్ 9, 2013వ తేదిన జరిగిన స్కీయింగ్ యాక్సిడెంట్‌లో తలకు బలమైన గాయం తగలడంతో కోమాలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసినదే. అయితే, ఇప్పుడు షుమాకర్‌ను కోమాలో నుంచి బయటుకు తీసుకువచ్చేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు.

ఈ విషయాన్ని షుమాకర్ ఏజెంట్ మరియు ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు స్పష్టం చేశారు. షుమాకర్ ఏజెంట్ సబిన్ కెమ్ తెలిపిన సమాచారం ప్రకారం, కోమా నుంచి బయటకు తీసుకువచ్చేందుకు షుమాకర్ సెడెషన్‌ను తగ్గించారని, ఇందుకు సుధీర్ఘ కాలం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోమాలో ఉన్నప్పటికీ, ఆయన ఆరోగ్యం మాత్రం స్థిరంగా ఉన్నట్లు తెలిపారు.

Michael Schumacher

యాక్సిడెంట్ జరిగిన రెండు వారాల్లోనే షుమాకర్‌కు రెండు సార్లు శస్త్రచికిత్స చేశారు. మెడికేషన్ డోసేజ్‌ను బట్టి షుమాకర్ కోమా నుంచి బయటకు రావటానికి రోజులు, వారాల సమయం పట్టే ఆస్కారం ఉంది. జర్మనీకి చెందిన ఫార్ములా వన్ డ్రైవర్ మైఖేల్ షుమార్ (44 ఏళ్లు) స్కీయింగ్ చేస్తూ, బ్యాలెన్స్ తప్పి పోడిపోవటంతో అతని బండరాయికి తగిలిందని, తీవ్ర రక్తస్రావం కావటంతో బ్రెయిన్ సర్జరీ చేశామని గతంలో వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసినదే.

మైఖేల్ షుమాకర్‌ తన కెరీర్‌లో మొత్తం 30,5 ఫార్ములా వన్ రేసుల్లో పాల్గొన్నాడు. అందులో 91 విజయాలు, 7 ఛాంపియన్‌షిప్ టైటిళ్లను షుమీ తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్నతనం నుంచే ఫార్ములా వన్ రేస్ పట్ల ఆసక్తి ఉన్న మైఖేలు షుమాకర్, ఫార్ములా వన్ రేస్ ట్రాక్‌పై ఇప్పటి వరకూ 80,000 కిలోమీటర్లకు పైగా టైర్లు అరిగేలా చకర్లు కొట్టాడు.

వివిధ రేస్ ట్రాక్‌ల మైఖేల్ షుమాకర్‌ ప్రయాణించిన మొత్తం దూరం 80,000 కిలోమీటర్లు (49,710 మైళ్లు)ను దాటింది. ఫార్ములా వన్ కార్లలో మైఖేల్ షుమాకర్‌ ఇప్పటి వరకూ చుట్టిన దూరంతో, రెండు సార్లు భూమిని చుట్టి రావచ్చట. 19 ఎఫ్ సీజన్స్ పూర్తి చేసిన తర్వాత అతను మొలురాయిని అధిగమించగలిగాడు.

Most Read Articles

English summary
Michael Schumacher has been in hospital since December 29, 2013, after he sustained injury in a ski accident, which left him in a coma. Doctors and Michael Schumacher's agent have confirmed, they will begin the waking up process of the Seven-time German Champion. The sedative used will be lowered, in an attempt to get Schumacher out of the artificial coma.
Story first published: Friday, January 31, 2014, 14:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X