కొరియా: టాక్సీలో వాంతి చేస్తే రూ.8500 జరిమానా

By Ravi

టాక్సీలో వాంతి చేస్తే, అందుకు 1,50,000 వోన్‌లు (సుమారు రూ.8500) జరిమానా విధించాలని సియోల్ టాక్సీ సంఘాలు నిర్ణయించాయి. వీరు ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవటం వెనుక ఓ బలమైన కారణమే ఉంది. అదేంటంటే..

దక్షిణ కొరియాలోని టాక్సీలను ఉపయోగించే కస్టమర్లలో ఎక్కువ మంది మద్యం సేవించి, ప్యాసింజర్ సీటులో కూర్చొని ప్రయాణిస్తుంటారు. ఇలా ప్రయాణించే వారిలో చాలా మంది టాక్సీలోనే వాంతి చేసుకోవటం, దాని టాక్సీ యజమానులు క్లీన్ చేసుకోవటం జరుగుతుంటుంది.

yak in korean taxi

ఒక్కోసారి సరిగ్గా క్లీన్ చేయకపోతే, ఆ తర్వాత వచ్చే దుర్వాసన ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. సియోల్‌లో ఈ సమస్యలు నానాటికి అధికమవుతుండటంతో, టాక్సీ డ్రైవర్లు తమ ప్యాసింజర్లకు ముందుగానే ఈ విషయాన్ని చెప్పేస్తున్నారు.

మద్యం సేవించిన ప్యాసింజర్లు టాక్సీ లోపల కానీ లేదా, బయట డోర్‌పై కానీ వాంతి చేసినట్లయితే స్టాండర్డ్, సిటీ-అప్రూవ్డ్ ఫైన్ (రూ.8500) చెల్లించాలని తమ ప్యాసింజర్లకు డ్రైవర్లు ముందుగానే చెబుతున్నారు.

ఒకవేళ ఈ జరిమానా చెల్లించేందుకు ప్యాసింజర్లు నిరాకరించినట్లయితే, సదరు ప్యాసింజర్ నుంచి డ్రైవర్ మరింత ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంది. అప్పటికీ, ప్యాసింజర్ జరిమానా చెల్లించడానికి నిరాకరిస్తే, డ్రైవర్ సివిల్ కోర్టును ఆశ్రయించి చట్టపరంగా అప్రోచ్ అవ్వొచ్చు. ఈ నిర్ణయం ద్వారానైనా ప్రయాణీకులు మద్యం సేవించడం తగ్గుతుందని టాక్సీ సంఘాలు భావిస్తున్నాయి.

Most Read Articles

English summary
Seoul taxi drivers are tired of the yucky cleanup and complaints from other customers about the lingering stench, the capital’s two drivers associations have banded together. Beginning Feb. 1, drivers will ask passengers who vomit in their cabs to pay a standard, city-approved fine of 150,000 won.
Story first published: Friday, January 30, 2015, 9:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X