భారత్‌కు క్వాడ్-కాప్టర్ ఇక ఓలా, ఉబర్ కాలం ముగిసినట్లే

Written By:

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కార్ల తయారీ సంస్థలు గత రెండేళ్ల కాలం నుండి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల జపం చేస్తున్నాయి. కాని దుబాయ్ ఒక అడుగు ముందుకు వేసి ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ ఎగిరే కార్లను పూర్తి స్థాయిలో సిద్దం చేసింది. మరికొన్ని రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యపరమైన అమ్మకాలకు కూడా సిద్దం చేసినట్లు సమాచారం. ఇది పూర్తి స్థాయిలో సేవల్లోకి వస్తే ఓలా మరియు ఉబర్ వంటి అద్దె కార్ల సంస్థలకు కాలం చెల్లిందని చెప్పవచ్చు.

చైనా తయారు చేసిన ప్రోటోటైప్ సెల్ఫ్ డ్రైవింగ్ హావర్ కాప్టర్ ట్యాక్సీలను దుబాయ్ అధికారికంగా పలుమార్లు పరీక్షించింది. దుబాయ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ప్రకారం 2030 నాటికి అధికారిక రవాణా సాధనాలుగా వీటిని వినియోగంలోకి తేనుంది.

చైనా నిర్మించిన స్వయం చాలక హావర్ కాప్టర్ ట్యాక్సీ పేరు ఇహాంగ్ 184. ఇది ముందుగా ఇచ్చిన సమాచారం ప్రకారం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో 300 మీటర్ల గరిష్ట ఎత్తులో ప్రయాణించగలదు.

చూడటానికి హెలికాఫ్టర్ల తరహాలో ఉన్నప్పటికీ ఇది పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వెహికల్. రెండు గంటల సమయం పాటు చార్జింగ్ చేస్తే 30 నిమిషాల వరకు నిరంతరంగా విహరించగలదు.

ప్రయాణికుల చేయాల్సిందల్లా, ఇందులో కూర్చున్న తరువాత గమ్యస్థానాన్ని ఎంచుకోవడం మాత్రమే. తరువాత ఆటోమేటిక్‌గా గమ్యస్థానానికి చేరుకుని సూచించిన ప్రదేశంలో ల్యాండ్ అవుతుంది. గ్రౌండ్ కంట్రోల్ మానిటర్ పరిజ్ఞానం ద్వారా ల్యాండింగ్ ప్రదేశాన్ని ఎంచుకుంటుంది.

క్వాడ్ కాప్టర్ (హావర్ ట్యాక్సీ)లో ఎనిమిది ప్రొపెల్లర్స్ ఉంటాయి. మరియు గరిష్ట ఖచ్చితత్వమైన సెన్సార్లు ఇందులో ఉంటాయి. ఇవి దాని కాప్టర్ పరిధిలో ఉన్న ఉష్ణోగ్రతను ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగపడుతుంది.

ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ప్రధానాధికారి మ్యాటర్ అల్-టేయర్ మాట్లాడుతూ, "ప్రభుత్వ ప్రపంచ శిఖరాగ్ర ప్రదర్శన వేదిక మీద ప్రదర్శించిన అటానమస్ ఏరియల్ వెహికల్ కేవలం ప్రోటోటైప్ మాత్రమే కాదు. దుబాయ్ విహంగవీధుల్లో ఈ స్వయం చాలక వాహనాన్ని అనేక మార్లు పరీక్షించాము. మరియు 2017 జూలై నాటికి పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిపాడు".

ప్రస్తుతం వ్యక్తిగత రవాణా కోసం ఇండియాలో ఓలా మరియు ఉబర్  సంస్థలు ముందంజలో ఉన్నాయి. అయితే విపరీతమైన ట్రాఫిక్ వీటికి ప్రధాన సమస్యగా మారిపోయింది. మరి స్వయం చాలక ఎగిరేే ట్యాక్సీలు దేశీయంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఓలా, ఉబర్ లతో పాటు స్వల్ప కాలిక అద్దె వాహనాలకు కాలం చెల్లిపోవడం ఖాయం.

భవిష్యత్ యొక్క రవాణా గురించి మాట్లాడే సందర్భంలో మెర్సిడెస్ బెంజ్ జనరేషన్ ఇక్యూ కాన్సెప్ట్ ను ఈ మధ్యనే ప్రదర్శించింది. దాని తాలుకు ఫోటోలను క్రింది గ్యాలరీ ద్వారా వీక్షించగలరు...

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Is Dubai Looking To Launch Self-Driving Hover Taxis This Year?
Please Wait while comments are loading...

Latest Photos