డ్రైవర్ రహిత గగన విహంగ వాహనంతో ట్యాక్సీ సేవలను ప్రారంభించనున్న దుబాయ్

దుబాయ్ దేశం ప్రపంచపు తొలి ఎగిరే స్వయం చాలక ట్యాక్సీ సేవలను ప్రారంభించనుంది. ఇహాంగ్ 184 గా పిలువబడే గగన విహంగ వాహనాన్ని ఈ ట్యాక్సీ సేవలకు వినియోగించనుంది. దీని గురించి పూర్తి వివరాలు...

By Anil

ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆటోమొబైల్ తయారీ దిగ్గజ సంస్థలు స్వయం చాలక పరిజ్ఞానాన్ని(అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ) అభివృద్ది చేస్తున్నాయి. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ సాంకేతికంగా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చి అందుబాటులోకి రావడానికి ఇంకా చాలా సమయం పట్టనుంది. అయితే ఈ సాంకేతిక అభివృద్ది మరియు వినియోగంలో దుబాయ్ ముందు స్థానంలో ఉంది.

డ్రైవర్ రహిత గగన విహంగ వాహనం

చమురు నిల్వలు భారీగా ఉన్న దేశం కావడంతో, దుబాయ్ అన్ని ప్రత్యేకతలను కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్, ప్రపంచపు అతి పెద్ద మానవ నిర్మిత దీవి ఇలా అనేక రికార్డులను కలిగి ఉంది.

డ్రైవర్ రహిత గగన విహంగ వాహనం

అయితే ఇప్పుడు డ్రైవర్ రహిత ఎగిరే విహంగ వాహనం యొక్క ట్యాక్సీ సేవలను ప్రారంభించే మొదటి దేశంగా దుబాయ్ నిలవనుంది. జూలై 2017 నుండి అధికారికంగా ఈ అటానమస్ ఫ్లయింగ్ ట్యాక్సీ సేవలను దుబాయ్ ప్రారంభించనుంది.

డ్రైవర్ రహిత గగన విహంగ వాహనం

దుబాయ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఈ మధ్యనే అటానమస్ ఏరియల్ వెహికల్(AAV) ను ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయం సాధించింది. చైనాకు చెందిన డ్రోన్ల తయారీ సంస్థ ఇహాంగ్‌కు సెల్ఫ్-డ్రైవింగ్ ఏరియల్ వెహికల్‌ను ఇందుకు వినియోగించారు.

డ్రైవర్ రహిత గగన విహంగ వాహనం

విజయవంతంగా ప్రయోగించి పరీక్షించి చూసిన అనంత ట్యాక్సీ సేవలకు ఎంచుకున్న స్వయం చాలక విహంగ వాహనం పేరు ఇహాంగ్ 184. ఇది ఎగరడానికి ఎనిమిది ప్రొపెల్లర్లు ఇందులో ఉన్నాయి.

డ్రైవర్ రహిత గగన విహంగ వాహనం

ఒక సారి ఒక్క ప్రయాణికుడు ఇందులో ప్రయాణించగలడు. ప్రయాణించే ముందు ప్యాసింజర్ చేరాల్సిన గమ్యస్థానాన్ని స్మార్ట్ ఫోన్ ద్వారా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తరువాత వాహనం టేకాఫ్ తీసుకుని గమ్యస్థానం వద్ద ల్యాండ్ అవుతుంది.

డ్రైవర్ రహిత గగన విహంగ వాహనం

ఎగిరే ట్యాక్సీ యొక్క పనితీరును మరియు ఆపరేషన్‌ను గ్రౌండ్ నుండి మానిటర్ చేసే వ్యవస్థ ఉంటుంది. దీనికి రెండు గంటలు ఛార్జింగ్ చేస్తే 30 నిమిషాల పాటు నిరంతరం ఎగురుతుంది.

డ్రైవర్ రహిత గగన విహంగ వాహనం

ఇహాంగ్ 184 ఎగిరే ట్యాక్సీ గరిష్ట వేగం గంటకు 100కిలోమీటర్లుగా ఉంది మరియు ఇది గరిష్టంగా 300 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు.

డ్రైవర్ రహిత గగన విహంగ వాహనం

ఇహాంగ్ సంస్థ తమ ఇహాంగ్ 184 లో ఫెయిల్ సేఫ్ టెక్నాలజీని అందించింది. గాలిలో ఉన్నపుడు ఎదైనా ప్రమాదం జరిగితే సురక్షితంగా ల్యాండ్ అవడానికి ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.

డ్రైవర్ రహిత గగన విహంగ వాహనం

జూలై 2017 న దుబాయ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ అధికారులు అధికారింగా ఈ ఇహాంగ్ 184 ఎగిరే ట్యాక్సీ సేవలను ప్రారంభించనున్నారు. మొత్తానికి డ్రైవర్ రహిత ఎగిరే ట్యాక్సీ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu Dubai To Launch Self-Driving Flying Taxis By July 2017. Get more details about self-driving flying taxi.
Story first published: Monday, April 17, 2017, 9:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X