సూపర్‌కార్లు అయిపోయాయ్.. ఇప్పుడు క్వాడ్‌స్కీ వంతు..!

By Ravi

బహుశా ప్రపంచంలో కెల్లా అత్యధిక సూపర్‌‌కార్లను కలిగిన పోలీసు శాఖ దుబాయ్‌దే కావచ్చేమో. అనేక రకాల సూపర్‌‌కార్లను కలిగి ఉన్న దుబాయ్ పోలీసులు, తాజాగా కొత్త రకం వాహనాలను సొంతం చేసుకున్నారు. నేలపై వేగంగా పరుగులు తీసే కార్లనే కాకుండా ఇటు నేలపై అటు నీటిపై కూడా జెట్ వేగంతో పరుగులు తీయగలిగిన యాంఫిబియస్ క్వాడ్‌స్కీను తాజాగా దుబాయ్ పోలీసులు తమ వాహన కలెక్షన్‌లో చేర్చుకున్నారు.

క్వాడ్‌స్కీ ఒక యాంఫీబియస్ వెహికల్ (ఉభయచర వాహనం). ఇది నేలపై క్వాడ్ లేదా ఏటివి (నాలుగు చక్రాలు కలిగిన ఆల్-టెర్రైన్ వాహనం)లా పనిచేస్తుంది. నీటిపైకి చేరుకోగానే సెకండ్ల వ్యవధిలో జెట్ స్కైగా మారిపోతుంది. కేవలం 5 సెకండ్ల వ్యవధిలో ఇది మారుతుంది.


క్వాడ్‌స్కీ వాహనంలో బిఎమ్‌డబ్ల్యూ కె1300ఎస్ నుంచి గ్రహించిన ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 140 హార్స్ పవర్‌ల శక్తిని, 118 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

క్వాడ్‌స్కీ నేలపై గంటకు గరిష్టంగా 72 కిలోమీటర్ల వేగంతోను, నీటిపై 38.9 నాట్‌ల వేగంతోను పరుగులు తీస్తుంది. దుబాయ్ పోలీసుల వద్ద ఉండే ఈ పవర్‌ఫుల్ కార్లు, వాహనాలతో వారు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించకపోయినప్పటికీ, ఇవి మాత్రం అక్కడ పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్‌గా మారిపోతున్నాయి.

Quadski Side

ఈ యాంఫీబియస్ వాహనం ధర 40,000 డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.25 లక్షలు).
Most Read Articles

English summary
This beast of an amphibious vehicle costs USD 40,000. Now considering this is an official police vehicle, the Dubai government can shell out this money for a few more and let the police have a bit of fun at the beach as well.
Story first published: Monday, October 20, 2014, 14:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X