అరె.. ఈ కారులో స్టీరింగ్ లేదే, మరి నడిపేదెలా..?

By Ravi

మీరు ఎప్పుడైనా ఫ్రంట్ సీటులో స్టీరింగ్ లేని కారును చూశారా..? కనీసం విన్నారా..? ఎవరైనా వెనుక సీటులో కూర్చుకొని కారును డ్రైవ్ చేయటం మీరు చూశారా..? ఇవన్నీ వినడానికే చిత్రంగా ఉన్నాయి కదా..! ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటి ఓ కారు గురించే.

దుబాయ్‌కి చెందిన ఓ ఆటోమొల్ ట్యూనర్ (వాహనాలను కస్టమైజ్ చేసే వ్యక్తి), నిస్సాన్ పెట్రోల్ ఎస్‌యూవీని వెనుక సీటులో కూర్చుని డ్రైవ్ చేసేలా కస్టమైజ్ చేశాడు. ఈ కస్టమైజ్డ్ నిస్సాన్ పెట్రోల్ ఎస్‌యూవీని బయటి వైపు నుంచి గమనిస్తే, ఎలాంటి మార్పు కనిపించదు.

అయితే, లోపలివైపుకు ప్రవేశించగానే ముందు సీట్లలో స్టీరింగ్ కనిపించదు. ఈ కారులోని ఇంటీరియర్లను పూర్తిగా కస్టమైజ్ చేశారు. మరి ఈ కారును నడపటానికి స్టీరింగ్ ఎక్కడుంది..? తెలుసుకుందాం రండి.. (ఫొటో ఫీచర్ పరిశీలించండి).

వెనుక సీటులో కూర్చిన డ్రైవ్ చేసే కారు

ఇదివరకు చెప్పుకున్నట్లుగానే, ఈ కారులోని ఇంటీరియర్లను పూర్తిగా కస్టమైజ్ చేశారు. ఇందులో ఫ్రంట్ సీట్లో ఉండాల్సిన స్టీరింగ్ వీల్, కంట్రోల్ పెడల్స్, ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్), ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్లను తొలగించారు.

వెనుక సీటులో కూర్చిన డ్రైవ్ చేసే కారు

ఇలా తొలగించిన స్టీరింగ్ వీల్, కంట్రోల్ పెడల్స్, ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్), ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్లను వెనుక సీట్లో (రెండవ వరుస సీట్లో) అమర్చారు. రెండు సీట్ల మధ్యలో ఉన్న ఖాలీ ప్రదేశంలో స్టీరింగ్ వీల్‌ను సెంటర్‌గా అమర్చారు.

వెనుక సీటులో కూర్చిన డ్రైవ్ చేసే కారు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‍‌కు చెందిన ఆటో ట్యూనింగ్ షాప్ 'కింగ్ ఆఫ్ కస్టమ్స'కు చెందిన నిపుణులు ఈ నిస్సాన్ పెట్రోల్ ఎస్‌యూవీని ఇలా విచిత్రంగా వెనుక సీటులో కూర్చుని నడిపేలా కస్టమైజ్ చేశారు.

వెనుక సీటులో కూర్చిన డ్రైవ్ చేసే కారు

ఈ కారు కేవలం షోకి మాత్రమే డిజైన్ చేయలేదు. ఇది రెగ్యులర్ కార్ల మాదిరిగానే రోడ్డుపై నడుస్తుంది. దీనిని నడపటానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే, విజిబిలిటీ మాత్రం తక్కువగా ఉండే ఆస్కారం ఉంది. తర్వాతి స్లైడ్‌లో ఈ కారును నడిపే వీడియోను చూడొచ్చు.

వెనుక సీటులో కూర్చున్న వ్యక్తి కారును సునాయాసంగా ఎలా నడుపుతున్నాడో చూడండి.

Most Read Articles

English summary
Backseat driving is a universally hated practice, which many drivers suffer from. It is that irritating act by a co-passenger sitting in the back seat constant instructing the driver about how to drive. But in this case that term can used to literally describe the car.
Story first published: Monday, September 23, 2013, 11:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X