వేలంలో 1.35 మిలియన్ డాలర్ల ధర పలికిన 1969 ఈజీ రైడర్ బైక్

By Ravi

పాపులర్ హాలీవుడ్ చిత్రం 'ఈజీ రైడర్' (1969)లో పీటర్ ఫోండా నడిపిన కస్టమైజ్డ్ చోపర్-స్టయిల్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్ వేలంలో అత్యధిక వెల పలికింది. గడచిన వారాంతంలో నిర్వహించిన వేలంలో ఈ బైక్ 1.35 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది.

అమెరికా జాతీయ జెండా థీమ్‌లో పెయింట్ చేసిన ఈ 'కెప్టెన్ అమెరికా' బైక్‌ను ఇద్దరు ఆఫ్రికన్-అమెరికన్ బైక్ బిల్డర్స్ క్లిఫ్ వాగ్స్ మరియు బెన్ హార్డీలు డిజైన్ చేసి, నిర్మించారు. అయితే, ఫోండా అందించిన సూచనల ఆధారంగానే దీనిని తయారు చేశారు.


ఈజీ రైడర్ అనేది ఓ క్లాసిక్ అమెరికన్ రోడ్ మూవీ. ఓపెన్ రోడ్ ఫ్రీడమ్‌ను అనుభవించేందుకు గాను ఇద్దరు బైకర్స్ (పీటర్ ఫోండా, డెన్నిస్ హోపర్) దేశం మొత్తం ట్రావెల్ చేస్తారు. ఈ చిత్రంలోని పీటర్ ఫోండా కోసం ఓ హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌ను ఇలా ప్రత్యేకంగా తయారు చేశారు.

ఈ చిత్రంలో ఫోండా కెప్టెన్ అమెరికా పాత్రను పోషించారు. అతని పాత్ర మాదిరిగానే తాను నడిపిన బైక్ కూడా మోటార్‌సైకిల్ చరిత్రలో మంచి ప్రాచుర్యాన్ని దక్కించుకుంది. వాస్తవానికి ఈ చిత్రంలో హ్యార్లీ డేవిడ్‌సన్ ఎఫ్ఎల్‌హెచ్ పోలీస్ బైక్‌ల నుంచి తయారు చేసిన రెండు కెప్టెన్ అమెరికా చోపర్లను ఉపయోగించారు. కాగా.. ఇందులో ఒకటి చిత్ర షూటింగ్ సమయంలో నాశనమైపోగా, మరొకటి మూవీ సెట్ నుంచి మాయమైపోయింది.

Easy Rider Harley Davidson Chopper

అయితే, ఈ చిత్రం 30న వార్షికోత్సవాన్ని జరుపుకునేందుకు గాను ఫోండా సాయంతో, ఒరిజినల్ బైక్‌లను క్రియేట్ చేసిన వారు తిరిగి అచ్చం అలానే ఉండే కెప్టెన్ అమెరికా మోటార్‌సైకిల్‌ను తయారు చేశారు. ఆ తర్వాత దీనిని కొంత కాలం పాటు హ్యార్లీ డేవిడ్‌సన్ మ్యూజియంలో ఉంచారు.

కాగా.. ప్రస్తుతం వేలంలో విక్రయించిన బైక్ మాత్రం, ఈ చిత్రం ముగింపు సమయంలో క్రాష్ సీన్ (యాక్సిడెంట్) కోసం ఉపయోగించబడినది. లాస్ ఏంజిల్స్‌లో ఉన్న కలాబసాస్‌లోని ప్రొఫైల్స్ ఇన్ హిస్టరీ ఆక్షన్ రూమ్‌లో హాలీవుడ్ మెమరబిలియా సేల్‌లో భాగంగా విక్రయించారు.

Most Read Articles

English summary
The iconic Harley-Davidson chopper-style motorbike ridden by Peter Fonda in the 1969 classic Easy Rider was sold for $1.35 million at auction.
Story first published: Monday, October 20, 2014, 17:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X