వీడియో: కొండపై నుంచి సైకిల్‌ను వెనక్కు నడిపిన ఘనుడు!

By Ravi

సైకిల్‌పై కూర్చుని ముందుకు ఎవరైనా తొక్కగలరు, కానీ అదే సైకిల్‌పై వెనక్కు తిరిగి కూర్చుని రివర్సులో ఎవరైనా సైకిల్‌ను వెనుకకు తొక్కగలరా.. అది కూడా ప్రమాదకరమైన ఏటవాలు కొండపై నుంచి క్రిందకు.. కలలో కూడా సాధ్యం కాదంటారా..? కానీ ఈ అసాధ్యమైన ఫీట్ అత్యంత సునాయాసంగా సాధించాడు నార్వేకి చెంది ఈ బుల్లోడు.

నార్వేలోని స్టేంజ్‌కు చెందిన ఈ ఎక్స్‌ట్రీమ్ ఆర్టిస్ట్ బహుముఖ ప్రజ్ఞాశాలి. బ్యాలెన్సింగ్ యాక్ట్‌లను ప్రదర్శించడంలో దిట్ట అయిన ఇస్కిల్ రోనింగ్స్‌బ్యాకెన్ నార్వేలోని ట్రోల్‌స్టీన్ పర్వతం పైనుంచి సైకిల్‌పై వెనుకకు కూర్చొని దానిపై బ్యాలెన్స్ చేసుకుంటూ, వచ్చే ట్రాఫిక్‌ను అధిగమిస్తూ, ఎక్కడా ఆగకుండా నేరుగా క్రిందకు వచ్చేశాడు.

ఈ ఫీట్ చేస్తున్న సమయంలో గాలి సైకిల్ వెళ్లే దిశకు వ్యతిరేఖ దిశలో వీస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న లోయలోపడటం ఖాయం. ఈ సమయంలో సైకిల్ గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసింది. ఇలా ఇస్కిన్ మొత్తం 4.5 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్‌ను వెనుకకు నడుపాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇస్కిల్ ఈ ఫీట్‌ను ఎలాంటి సేఫ్టీ గేర్ కానీ, ముందస్తు జాగ్రత్తలు కానీ తీసుకోకుండా చేయటం. ఆ ఫీట్‌ను మనం కూడా క్రింది వీడియోలో వీక్షిద్దాం రండి. కానీ మీరు మాత్రం దయచేసి ఇలాంటి ఫీట్‌లను చేయటానికి ప్రయత్నించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/9QNdx2hs0n4?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Watch this amazing video Eskil Ronningsbakken riding a bike backwards at 80 km/h Trollstigen Norway.
Story first published: Wednesday, December 4, 2013, 17:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X