సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

ఆసియా మరియు యూరప్ దేశాలకు జల రవాణా మార్గాన్ని మానవ ప్రయత్నంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుయాజ్ కాలువ నిర్మాణం పూర్తయ్యాక ఆఫ్రికా మరియు ఆసియా ఖండాలకు చెందిన నౌకలు కొన్ని వేల మైళ్ల ప్రయాణం చేయకుండా యూరప

ప్రపంచ వ్యాప్తంగా రవాణాకు అత్యంత అనువైన మార్గం జలరవాణా. ఇందులో షిప్పింగ్ పరిశ్రమది మరీ కీలకమైన పాత్ర. భౌగోళిక సమస్యల వలన దగ్గరలో ఉన్న దేశాలను చేరుకోవడానికి కొన్ని పెద్ద పెద్ద సముద్రాలను దాటాల్సి వస్తోంది. అందుకోసం రెండు పెద్ద సముద్రాల మద్య భూ భాగాన్ని తొలిచి కాలువలుగా మార్చి భారీ నౌకలకు రాకపోకలు కలిగిస్తారు. అలాంటి వాటిలో పనామా కాలువ ఒకటి అయితే రెండవ అతి పెద్దది సుయాజ్ కాలువ.

ఆసియా మరియు యూరప్ దేశాలకు జల రవాణా మార్గాన్ని మానవ ప్రయత్నంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుయాజ్ కాలువ నిర్మాణం పూర్తయ్యాక ఆఫ్రికా మరియు ఆసియా ఖండాలకు చెందిన నౌకలు కొన్ని వేల మైళ్ల ప్రయాణం చేయకుండా యూరప్ దేశాలను అత్యంత సులభంగా చేరుకుంటున్నాయి. నేటి మన ఈ "నౌకలు" శీర్షికలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్న సుయాజ్ కెనా‌ల్ గురించి పూర్తి వివరాలు.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

ప్రపంచ షిప్పింగ్ పరిశ్రమలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న అత్యంత ముఖ్యమైన సుయాజ్ కెనాల్ యొక్క చరిత్ర, నిర్మాణం, రవాణా సౌలభ్యం వంటి అనేక ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

ఎర్ర సముద్రాన్ని మరియు మధ్యధరా సముద్రాన్ని కలుపుతూ ఈజిప్ట్ భూ భాగంలో సుయాజ్ కాలువను నిర్మించారు. 1896 వ సంవత్సరం నవంబర్ 17 న ఈ సుయాజ్ కాలువను ప్రారంభించారు. ఈ కాలువ ప్రారంభమయ్యి ఇప్పటికి సరిగ్గా 147 సంవత్సరాలు కావస్తోంది.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

సుమారుగా 163 కిలోమీటర్ల మేర 75 నుండి 79 అడుగుల లోతుతో 300 మీటర్ల వెడల్పుతో ఈ సుయాజ్ కాలువను నిర్మించారు. దీని నిర్మాణంలో రాజకీయ పార్టీల కారణంతో, కూలీల కొరతతో కలరా వంటి వ్యాధులు ప్రబలి కూలీలు మరణించడం వంటి అనేక కారణాలతో దీని నిర్మాణానికి సుమారుగా 10 ఏళ్లు పట్టింది.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

1854 లో సుయాజ్ కెనాల్ నిర్మాణానికి ఈజిప్ట్‌ సైయద్ పాషా అంగీకారంతో ఫ్రెంచ్‌కు చెందిన పెర్డినాండ్ డి లెస్సెప్స్ అనుమతులు పొందాడు. ఈ అంగీకారం ప్రకారం దీనిని ప్రారంభించినప్పటి నుండి 99 సంవత్సరాల వరకు అన్ని హక్కులను ఆ సంస్థకే అప్పగించారు.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

ఫ్రెంచ్ జాతీయుడైన ఫెర్డినాండ్ డి లెస్సిప్స్ అధికారితో ఫ్రెంచ్ ప్రభుత్వం సుయాజ్ కెనాల్ నిర్మాణాన్ని ప్రారంభించింది . 1854 లో ఇంగ్లాడులో వ్యతిరేకత ఎదురైనప్పటికీ అధికారికంగా ఫ్రెంచ్ దేశం ఈజిప్ట్‌తో పూర్తి స్థాయిలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ తరువాత 1859 నుండి కెనాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

నిర్మాణ ఒప్పందంలో భాగంగా ఫ్రాన్స్ ఈ కెనా‌ల్ ను సుమారుగా 99 ఏళ్ల పాటు నిర్వహణ చేయాల్సి ఉంటుంది. అందుకోసం 13 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక ఆర్గనైజేషన్‌ను ప్రారంభించింది. పూర్తి స్థాయిలో కెనాల్ నిర్మాణం మరియు నిర్వహణ కోసం ఈ బృందం పనిచేసేది.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

అయితే ఈజిప్ట్‌లో ఫ్రాన్స్‌ చేపట్టిన సుయాజ్ కాలువ నిర్మాణాన్ని బ్రిటన్ తీవ్రంగా వ్యతిరేకించింది. అలా బ్రిటన్ చేష్టలకు సుమారుగా ఆరు సంవత్సరాల పాటు కాలువ నిర్మాణ పనులు ఆగిపోయియాయి. అయితే బ్రిటన్‌కు 44 శాతం భాగస్వామ్యం కల్పించడంతో కాలువ నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యాయి.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

అన్ని ఓ కొలిక్కి వచ్చిన పరిణామంలో కూలీల కొరత బాగా ఇబ్బంది పెట్టింది. తక్కువ డబ్బు ఇవ్వడంతో కూలీలు అధిక సంఖ్యలో వచ్చే వారు కాదు, ఇలా సుయాజ్ కెనాల్ నిర్మాణంలో ఎదుర్కొన్న భారీ ఇబ్బందుల్లో కూలీల కొరత కూడా ఒకటి.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

1863 లో సుయాజ్ కెనాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఈజిప్ట్ రాజు ఆదేశించడంతో కెనాల్ నిర్మాణాన్నికి ముఖ్య నిర్వహణ అధికారిగా ఉన్న ఫెర్డినాండ్ కూలీల కొరతను అధిగమించడానికి మొదటి సారిగా ఆవిరి యంత్రాలను వివియోగించాడు.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

కాలువ నిర్మాణం దాదాపుగా పూర్తి అవుతుంది అనే సందర్బంలో కాలువ మధ్యదరా సముద్రంలోకి కలిసే ప్రదేశంలో సుమారుగా 90 అడుగుల ఎత్తైన గ్రీక్ దేవుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. ఈజిప్ట్ ఆసియా దేశాలకు వెలుగుని తీసుకువస్తోంది అనే అర్థం వచ్చేందుకు ఆ విగ్రహం చేతిలో కాంతిని వెదజల్లే వస్తువు ప్రతిమను కూడా డిజైన్ చేశారు.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

ఈజిప్ట్‌లో ఈ విగ్రహాన్ని నిర్మించాలనుకున్న ఫ్రాన్స్‌ నిర్ణయాన్ని ఈజిప్ట్ అంగీకరించలేదు, అయితే సుయాజ్ కెనాల్ నిర్మాణంలో అత్యంత కీలకమైన పాత్రపోషించిన ఫెర్డినాండ్ డి లెస్పిస్ ప్రోద్బలంతో మరియు అమెరికా జోక్యంతో చివరికి ఈ విగ్రహాన్ని నిర్మించి 1886 లో ప్రారంభించారు.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

సుయాజ్ కెనా‌ల్ నిర్మాణం పూర్తయిన తరువాత కెనాల్ ప్రారంభం వేడుకలో దీనిని ప్రారంభించారు, ఇప్పుడు ఈ విగ్రహం లిబర్టీ ఆఫ్ శాట్చ్యూగా నిలిచింది. సుయాజ్ కెనాల్ మీద అత్యంత ఎత్తైన శిలా విగ్రహంగా ఇది పేరుగాంచింది.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

ప్రస్తుతం 254 మీటర్లు వెడల్పు, మరియు 77.5 మీటర్ల లోతున్న ఈ సుయాజ్ కెనాల్‌ గుండా భారీ నౌకలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ కెనాల్ గుండా భారీ బరువులను చేరవేసే నౌకల స్థానంలో కెనా‌ల్ ఇటువైపు నుండి అటువైపుకు సరుకు రవాణా కోసం చిన్న చిన్న నౌకలు సర్వీసులో ఉన్నాయి.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

ఇప్పుడు ఈ సుయాజ్ కెనాల్ ద్వారా ఆఫ్రికా మరియు ఆసియా నుండి నౌకలు యూరప్ దేశాలను మరియు ఆసియా నౌకలు అమెరికా సంయుక్త దేశాలను చేరుతున్నాయి. ఈ కెనాల్ మీద నౌకలు సుమారుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

ఈ సుయాజ్ కెనాల్‌ను దాటడానికి నౌకలు సుమారుగా 11 నుండి 16 గంటల సమయాన్ని తీసుకుంటాయి. మరియు 2014 ఏడాదిలో 17,148 నౌకలు ఈ సుయాజ్ కెనాల్ గుండా ప్రయాణించాయి. కెనాల్ పొడవును సుమారుగా 35 కిలోమీటర్ల మేర తగ్గించారు.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

ఏదేమైనా 35 కిలోమీటర్ల మేర వినియోగంలో లేని కెనాల్‌ను మరింత అభివృద్ది చేస్తున్నారు. మరియు దీనిని నౌకలను నిలుపడానికి వినియోగిస్తున్నారు. ఈ కెనాల్ మీద ఒకే సారి సుమారుగా 49 నౌకలు ప్రయాణించవచ్చు.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

అయితే 1956 లో సుయాజ్ కెనాల్ జోన్ కోసం ఇంగ్లాడ్, ఫ్రాన్స్ మరియు ఇజ్రాయెల్ వంటి దేశాలు ఏకంగా యుద్దానికి దిగాయి. అప్పట్లో ఈజిప్ట్ ప్రధానిగా నజీర్ ఉండేవాడు.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

అప్పట్లో జరిగిన యుద్దం కారణంగా సుమారుగా 40 భారీ నౌకలు నీటమునిగాయి. సుయాజ్ కెనాల్ కూడా అక్కడక్కడ డ్యామేజ్ అయ్యింది.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

1975 లో సుయాజ్ కెనాల్ ప్రాముఖ్యతను చాటుతూ, దాని వలన ప్రపంచ దేశాలకు ఉన్న ప్రయోజనాలను వివరించడం చేసింది, అందు కోసం సుయాజ్ కెనాల్‌ను మళ్లీ ఆర్గనైజ్ చేసింది. నాలుగు సంవత్సరాల క్రితం ఈజిప్ట్ రాజు ఈ కెనాల్‌కు పునర్మిమాణం చేయించారు.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

ఎర్ర సముద్రాన్ని మరియు మధ్యధరా సముద్రాన్ని కలుపుతూ ఈజిప్టు భూబాగాన్ని రెండు చేసి ఫ్రాన్స్ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ప్రకృతి సిద్దం ఏర్పిడిన కాలువలకు తలమానికంగా నిలిచింది. చరిత్రలో నిలిచిపోయే నిర్మాణం చేపట్టిన ప్రాజెక్ట్‌లో ఫెర్డినాండ్ లి లెస్పిస్ పాత్ర అద్భుతం అని చెప్పాలి.

సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

  • ప్రపంచ షిప్పింగ్ పరిశ్రమలో చరిత్రను సృష్టించిన పనానా కెనాల్ గురించి అతి ముఖ్యమైన విశయాలు: కూలంకశంగా
  • షిప్పింగ్ ఇండస్ట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలు
  • సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!

    • ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు
    • పాక్‌తో యుద్దానికి సిద్దమైతే ఇండియన్ మిలిటరీ వద్ద ఉన్న బలం ఇదే
    • లగ్జరీ నౌకల్లో మానవాళికి తెలియని భయంకర రహస్యాలు

Most Read Articles

English summary
Read In Telugu; Fascinating Facts About The Suez Canal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X