ఫెరారీ కారు నడిపిన 9 ఏళ్ల బాలుడు, తండ్రిపై కేసు

By Ravi

బొమ్మ కార్లతో ఆడుకోవాల్సిన చిన్న పిల్లలకి ఏ తల్లిదండ్రులైనా నిజమైన కార్లను, అందులోనూ ఫెరారీ వంటి శక్తివంతమైన కార్లను ఇస్తారా..? బాధ్యత కలిగిన తల్లిదండ్రులైతే ఇవ్వరు. కానీ, కేరళలో ఓ తండ్రి మాత్రం తన తొమ్మిదేళ్ల కుమారుడు ఫెరారీ ఎఫ్430 సూపర్‌కారు నడుపుతుంటే చూసి సంబరపడిపోయాడు. అంతేకాదు, తన కుమారు ఫెరారీ కారు నడుపుతున్న సన్నివేశాన్ని వీడియోలో చిత్రీకరించి, ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశాడు. ఆ బాలుడు ఫెరారీతో పాటు ఓ రేంజ్ రోవర్ కారును కూడా నడిపి ఔరా అనిపించుకున్నాడు.

మొదట్లో ఈ వీడియోను తిలకించిన వారు సదరు బాలుడి ధైర్య సాహసాలను మెచ్చుకున్నప్పటికీ, ఓ మైనర్ కుర్రాడు ఇంతటి శక్తివంతమైన కార్లను నడపటానికి అనుమతించిన తల్లిదండ్రులను మాత్రం కోపగించుకున్నారు. బాధ్యత లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా పిల్లలను ఇలా పవర్‌ఫుల్ కార్లను నడిపేందుకు అనుమతి ఇవ్వటంపై సర్వత్రా నిరసనలు వెల్లవెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ సంఘటనపై విచారణ జరపాల్సిందిగా త్రిశూర్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు విచారణ జరిపిన పోలీసులు, 09 ఏళ్ల బాలుడి తండ్రి మహమ్మద్ నిషామ్‌పై కేసును నమోదు చేశారు. మోటార్ వాహన చట్టంలోని సెక్షన్ 23 జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఫెరారీ ఎఫ్430 స్కుడెరియా కారు యజమాని అయిన నిషామ్‌పై ఓ కేసును నమోదు చేశారు. ఏదేమైనప్పటికీ, చిన్న పిల్లలు చేసే ఇలాంటి చేష్టలు తల్లిదండ్రలు గర్వంగా భావించేలా చేసినప్పటికీ, ఇవి అత్యంత ప్రమాదంతో కూడుకున్నవి అలాగే చట్ట ప్రకారం నిబంధనలకు విరుద్ధమైనవనే విషయాన్ని మనం గ్రహించాలి.

ఫెరారీ నడుపుతున్న బాలుడు (వీడియో)

ఫెరారీ నడుపుతున్న బాలుడు

ఫెరారీ నడుపుతున్న బాలుడు

ఫెరారీ నడుపుతున్న బాలుడు

ఫెరారీ నడుపుతున్న బాలుడు

Most Read Articles

English summary
Father of the Ferrai F430 driving kid from Kerala has been booked. The father had recorded a vido and posted on YouTube, The police booked the father of ferrari driving kid.
Story first published: Monday, April 29, 2013, 17:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X